వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు ఎలా గట్టెక్కింది..? ఆ రెండు పార్టీల వల్లేనా, శివసేన హెల్ప్..?

|
Google Oneindia TeluguNews

ఎట్టకేలకు పౌరసత్వ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. ఎగువ సభలో మోడీ సర్కార్‌కు తగిన మెజార్టీ లేదు. మరి ఎలా గట్టెక్కింది ? ఆ పార్టీలు సహకరించడంతోనే ఆమోదం పొందిందా ? శివసేన కూడా పరోక్షంగా సహకరం అందిందించా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకీ బుధవారం రాత్రి ఓటింగ్ సమయంలో ఏం జరిగింది ?

సుప్రీంకోర్టుకు పౌరసత్వ సవరణ బిల్లు పంచాయతీ: రిట్ పిటిషన్ దాఖలు చేసిన ముస్లిం పార్టీలుసుప్రీంకోర్టుకు పౌరసత్వ సవరణ బిల్లు పంచాయతీ: రిట్ పిటిషన్ దాఖలు చేసిన ముస్లిం పార్టీలు

సవరణలతో

సవరణలతో

పౌరసత్వ చట్టం 1955కు నరేంద్ర మోడీ సర్కార్ సవరణలు చేసింది. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందిన ముస్లింమేతరులకు భారతీయ పౌరసత్వం ఇస్తామని పేర్కొన్నది. కానీ రాజ్యసభలో బీజేపీకి తగిన మెజార్టీ లేదు. ఎన్డీయేతర పక్షాలు బిజు జనతాదళ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ మద్దతునివ్వడంతో బిల్లు గట్టెక్కింది. 125 ఓట్లతో ఆమోదం పొందింది. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమి 105 ఓట్లు రావడం విశేషం.

 దూరంగానే.. కానీ

దూరంగానే.. కానీ

బీజేపీతో అంటిముట్టనట్టుగానే వ్యవహరిస్తున్న జేడీయూ మద్దతు తెలుపడం విశేషం. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా కొనసాగుతున్న కేంద్ర మంత్రివర్గంలో పదవులపై నితీశ్ కుమార్ అలకబూనారు. అప్పటినుంచి మోడీ-అమిత్ షాతో దూరంగానే ఉంటున్నారు. కానీ లోక్‌సభలో మాత్రం జేడీయూకు చెందిన 11 మంది ఎంపీలు పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు.

వ్యతిరేకమే..

వ్యతిరేకమే..

వాస్తవానికి జేడీయూ.. జాతీయ పౌరసత్వ రిజిష్టర్, పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నారు. ఆ రెండింటీ ముఖ్య ఉద్దేశం ముస్లింలపై వివక్ష చూపడమేనని చెప్పారు. బిల్లుతో ఈశాన్య రాష్ట్రంలో అశాంతి నెలకొంటుందని ఆయన చెప్పారు. కానీ పార్టీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌తో బీజేపీ హైకమాండ్ సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. దీంతో లోక్ సభలో వారు ఓటేసినట్టు సమాచారం.

 మౌనం..

మౌనం..

బిల్లు రాజ్యసభకు వచ్చిన సందర్భంలోనూ నితీశ్ కుమార్ కూడా మిన్నకుండిపోయారు. దీంతో లోక్ సభ మాదిరిగా మద్దతు ఇవ్వాలా అనే అభిప్రాయానికి వచ్చారు. జేడీయూతోపాటు బీజేడీ కూడా మద్దతిచ్చారు. మొత్తం 11 సభ్యుల ఓట్లతో బిల్లుకు 125 మంది సభ్యుల మద్దతు లభించింది. దీంతోపాటు అన్నాడీఎంకే కూడా సపోర్ట్ చేసింది. శ్రీలంక తమిళ శరణార్థులకు మినహాయింపు ఇవ్వకపోయినా అండగా నిలిచింది.

శివసేన ఇలా

శివసేన ఇలా

శివసేన కూడా బిల్లుకు మద్దతివ్వకుండా గైర్హాజరైంది. దీంతో అధికార బీజేపీకి అనుకూలంగా మారింది. అంతకుముందు బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని ఓటింగ్ నిర్వహించగా 124-99 ఓట్లతో వీగిపోయినా సంగతి తెలిసిందే.

English summary
how narendra modi govt pass cab bill in rajya sabha. support of bjd, jdu government and indirect help of shivasena.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X