• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రియాంక చొక్కా పట్టుకునేందుకు ఎంత ధైర్యం...ఆ పోలీస్‌పై యోగి కఠిన చర్యలు తీసుకోవాలి:బీజేపీ మహిళా నేత

|

గత గురువారం(అక్టోబర్ 1) హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బయలుదేరిన ప్రియాంక గాంధీ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ పోలీస్ ప్రియాంక చొక్కా పట్టుకుని మరీ ఆమెను లాగేందుకు ప్రయత్నించడంపై అటు కాంగ్రెస్‌తో పాటు ఇటు బీజేపీ నుంచి కూడా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాజాగా మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్ర కిశోర్ వాగ్ ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.

యోగి కఠిన చర్యలు తీసుకోవాలి...

యోగి కఠిన చర్యలు తీసుకోవాలి...

భారతీయ సంస్కృతీ సంప్రాదాయాలను విశ్వసించే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆ పోలీస్ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్ర కిశోర్ వాగ్ డిమాండ్ చేశారు. ఒక పురుష పోలీస్ అధికారికి మహిళా నాయకురాలి దుస్తులపై చేయి వేయడానికి ఎంత ధైర్యం అని ప్రశ్నించారు. వాగ్ మద్దతుపై మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ సత్యజిత్ తంబే హర్షం వ్యక్తం చేశారు. గతేడాది ఎన్సీపీని వీడి బీజేపీలో చేరినా... వాగ్ తన సంస్కారానికి,పద్దతులకు కట్టుబడే ఉన్నారని వ్యాఖ్యానించారు.

ప్రియాంకకు పోలీసుల క్షమాపణ...

ప్రియాంకకు పోలీసుల క్షమాపణ...

మరోవైపు గౌతమ బుద్దనగర్ పోలీసులు ప్రియాంక గాంధీకి క్షమాపణలు చెప్పారు. జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నామని... దీనిపై విచారణకు ఆదేశించామని తెలిపారు. కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేస్తున్న క్రమంలో ప్రియాంక వారికి రక్షణగా నిలిచే ప్రయత్నం చేయగా... సదరు పోలీస్ అధికారి ఆమె చొక్కా పట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మహిళా నాయకురాలి పట్ల పోలీసులు ప్రవర్తించే తీరు ఇదేనా అని కాంగ్రెస్ వర్గాలు ప్రశ్నించాయి.

  Hathras : Rahul Gandhi, Priyanka Gandhi Reach Hathras ప్రపంచంలో ఏ శక్తి ఆ కుటుంబం గొంతు నొక్కలేదు..!

  కార్యకర్తలపై లాఠీచార్జి... ప్రియాంక అడ్డుకోవడంతో...

  గత గురువారం హత్రాస్ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ కార్యకర్తలతో కలిసి ఢిల్లీ నుంచి అక్కడికి బయలుదేరిన సంగతి తెలిసిందే. అయితే నోయిడా-ఉత్తరప్రదేశ్ బోర్డర్‌లోనే వారి వాహనాలను అడ్డుకున్న పోలీసులు హత్రాస్ పర్యటనకు అనుమతించలేదు. దీంతో రాహుల్ కాలి నడకనే హత్రాస్ వెళ్లేందుకు సిద్దమయ్యారు. దీంతో పోలీసులు రాహుల్‌ను అడ్డుకోవడం... ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం,తోపులాట చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో రాహుల్ కింద పడిపోయారు. అదే సమయంలో కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయగా ప్రియాంక వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో ఓ పోలీస్ ఆమె చొక్కా పట్టుకున్నారు.

  English summary
  Maharashtra BJP vice president Chitra Wagh on Sunday demanded that Uttar Pradesh Chief Minister Yogi Adityanath take "strict action" against a policeman who held Congress leader Priyanka Gandhi Vadra by her clothes at the Delhi-UP border on her way to Hathras.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X