• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జయలలిత పోలికలు రాజకీయాల్లో ఆమెకు కలిసివస్తాయా, శశికళ వల్లే జయకు దూరమయ్యాం

By Narsimha
|

చెన్నై :రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనన ఉన్నట్టు జయలలిత కోడలు దీప ప్రకటించారు. అయితే ఎంజిఆర్ మరణించిన తర్వాత అనేక అవమానాలను తట్టుకొని పార్టీని అధికారంలోకి తెచ్చేవరకు జయలలిత వెకకడుగు వేయలేదు.

శశికళకు షాక్: పొలిటికల్ రంగంలోకి జయలలిత కోడలుశశికళకు షాక్: పొలిటికల్ రంగంలోకి జయలలిత కోడలు

అయితే రాజకీయాల్లోకి వస్తే జయ తరహాలోనే దీప రాణిస్తారా లేదా అనేది ఆమె చూపే పోరాట పటిమ మీద ఆదారపడి ఉంటుంది.

జయ పోలికలు కలిసి వస్తాయా

జయ పోలికలు కలిసి వస్తాయా


జయలలిత పోలికలు ఆమె సోదరుడి కూతురు దీపలో కొంచెం కన్పిస్తాయి. జయ సమాధి వద్ద దీప నివాళులర్పించే సమయంలో దీపను చూసిన జయ అభిమానులు అచ్చం అమ్మను చూసినట్టుగానే ఉందని ఆనందపడ్డారు. క్షణాల్లోనే దీప చుట్టూ చేరారు. జయ తరహ పోలికలు దీపకు కొంచెం కలిసివచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో పోలీకలు ఒక్కటే సరిపోదు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రత్యర్థుల కంటే వేగంగా నిర్ణయాలు తీసుకొవాలి. కొన్ని సమయాల్లో సంయమనం పాటించాలి. కొన్ని సమయాల్లో వేగంగా నిర్ణయాలను అమలు చేయాల్సి ఉంటుంది. పోలికలు ఒక్కటే రాజకీయాల్లో రాణించేందుకు దోహదపడే అవకాశం లేదు. ఉద్దండులైన నాయకుల కుటుంబసభ్యులు కొందరు రాజకీయాల్లో రాణించలేదు. ఎలాంటి రాజకీయ వాసన లేని కుటుంబాల నుండి వచ్చిన వారు రాజకీయాల్లో చక్రంతిప్పిన వారు కూడ లేకపోలేదు.

 ఇద్దరికీ ఒకే తరహ అనుభవాలు

ఇద్దరికీ ఒకే తరహ అనుభవాలు

ఎంజిఆర్ మరణించిన సమయంలో ఆయన పార్థీవదేహం వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన జయలలితను అవమానించారు. ఈ అవమానాలను తట్టుకొని ఆమె అక్కడే ఉన్నారు. తన రాజకీయగురువు అంతిమయాత్ర సాగే వరకు అవమానాలను తట్టుకొని ఉండాలని జయ భావించారు. అయితే అంత్యక్రియలకు ఎంజిఆర్ వాహానాన్ని తరలించే సమయంలో ఆ వాహనం నుండి ఆమెను కిందకు దించేశారు. జయను తీవ్రంగా దూషించారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో జయ చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను చూసేందుకు వచ్చిన దీపకు అనుమతిలభించలేదు.ఆమె అంత్యక్రియల్లో కూడ ఆమె పాల్గొనలేదు. అంత్యక్రియలు జరిగిన మరునాడు ఆమె సమాధి వద్ద జయ కోడలు దీప నివాళులర్పించారు.

 శశికళ వల్లే కుటుంబం దూరం

శశికళ వల్లే కుటుంబం దూరం

జయలలితకు తన సోదరుడి కుటుంబం అంటే ప్రేమ ఉండేది. తన సోదరుడి పిల్లలతో ఆమె సరదాగా గడిపేవారని దీప గుర్తుకు చేసుకొన్నారు. తాను జయ ఇంట్లోనే పుట్టానని ఆమె చెబుతుంటారు. తన సోదరుడి కుటుంబంతో జయ సన్నిహితంగానే ఉండేవారు. అయితే కారణాలు ఏమిటో కాని క్రమంగా జయ ఆయన సోదరుడి కుటుంబాన్ని దూరం పెట్టింది.శశికళ ప్రభావం వల్లే తమ కుటుంబాన్ని జయ దూరం పెట్టిందని దీప ఆరోపించారు. జయ సోదరుడి సతీమణి కారణంగానే ఆ కుటుంబానికి జయ దూరమైందనే ప్రచారం కూడ ఉంది.దీప వివాహం సమయంలో ఈ వివాహానికి జయ హాజరుకాలేదు. అయితే నవదంపతులు జయ నివాసానికి వెళ్ళి ఆశీర్వదాలు తీసుకొన్నారు. అయితే ఈ దూరం కొనసాగుతూనే ఉంది. తమ కుటుంబానికి జయకు దూరం పెరగడానికి శశికళే కారణమనే ఆరోపణలు చేస్తోంది.

నన్ను శశికళ అవమానించారు.

నన్ను శశికళ అవమానించారు.

ఆసుపత్రిలో అత్త జయలలిత చికిత్స పొందుతున్న సమయంలో ఆమెను పరామర్శించేందుకు దీప వెళ్ళింది. అయితే ఆమెను ఆసుపత్రిలోకి అనుమతించలేదు. ఆమె ఆరోగ్య పరిస్థితులపై దీప అనుమానాలను ఆనాడే వ్యక్తం చేశారు. జయకు సక్రమంగా వైద్య చికిత్సలు , సపర్యలు అందకుండా చేశారని ఆమె ఆరోపించారు. ఆసుపత్రి వద్ద తనను శశికళ అవమానించారని చెప్పారు. మరో వైపు అంత్యక్రియలకు వెళ్ళలేని పరిస్థితులున్న నేపథ్యంలో సమాధి వద్ద నివాళులర్పించేందుకు వచ్చిన తనను శశికళ అవమానించారని చెప్పారు.

 పార్టీ పగ్గాలు శశికళ తీసుకోవడంపై అసంతృప్తి

పార్టీ పగ్గాలు శశికళ తీసుకోవడంపై అసంతృప్తి

అన్నా డిఎంకె పార్టీ పగ్గాలు శశికళ చేతికి దక్కడం పట్ల దీప అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీలు నడుచుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. శశికళ పార్టీ పగ్గాలు చేపట్టనున్నారనే వార్తపై దీప కొంత అసంతృప్తిని వ్యక్తం చేశారు.అన్నాడిఎంకె పగ్గాలు శశికళ చేతికి తీసుకోవడంపై ఆమె అయిష్టతను వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాను రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. శశికళ లేదా ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో జయ ఉన్నారనే మాటలను దీప ఖండించారు.

English summary
jayalalita daughter in law deepa, she will be join in politics very soon. our family faraway from jaya bacause of shashikala alleged deepa, when jaya treatment in apollo hospital deepa went to hospital for see jaya, she didnot permit in to hospital,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X