వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫ్లాష్ బ్యాక్ : కార్గిల్ యుద్ధంలో యుద్ధ ఖైదీగా పట్టుబడ్డ పైలట్ నచికేత ఎలా విడుదలయ్యారు?

|
Google Oneindia TeluguNews

అది 1999..ఇండియా భారత్‌ల మధ్య యుద్ధమేఘాలు అలుముకున్న రోజులు. దాయాది దేశాలు రెండు యుద్ధానికి సిద్ధమయ్యాయి. అదే కార్గిల్ యుద్ధం. ఆ సమయంలో గగనతలంలో ఓ యుద్ధ విమానంలో నిఘా పెడుతూ ముందుకు వెళ్లారు ఓ పైలట్. కానీ కొన్ని సాంకేతిక లోపాలతో ఆ యుద్ధ విమానం పాక్ సరిహద్దుల్లో కూలింది. విమానంలోని పైలట్‌ను యుద్ధ ఖైదీగా పట్టుకున్నారు... ఇంతకీ ఆ పైలట్ ఎవరు..? యుద్ధ ఖైదీగా ఉన్న తనను ఎవరు విడిపించారు..

సాంకేతిక లోపంతో యుద్ధ విమానం నుంచి దూకేసిన నచికేత

సాంకేతిక లోపంతో యుద్ధ విమానం నుంచి దూకేసిన నచికేత

భారత్ పాకిస్తాన్‌ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత గగనతలంలో గస్తీ నిర్వహించింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ఓ యుద్ధ విమానం. ఆ యుద్ధ విమానంకు పైలట్‌గా వ్యవహరించారు నచికేత. యుద్ధంలో ఉన్న భారత ఆర్మీకి సహాయక చర్యల్లో భాగంగా ఈ యుద్ద విమానం గస్తీ నిర్వహించింది. అదే సమయంలో తన విమానం యొక్క ఇంజన్ ఫెయిల్ అయ్యింది. కొండ ప్రాంతంలో దిగుతుండగా విమానం నియంత్రణ కోల్పోయింది. అయినప్పటికీ విమానంను కంట్రోల్ చేసేందుకు చాలా ప్రయత్నించారు. ఇక చివరి నిమిషంలో విమానంలోనుంచి బయటకు దూకేశాడు. దూకిన తర్వాత చూసుకుంటే తను పాక్ భూభాగంలోకి పడిపోయినట్లు తెలుసుకున్నాడు. వెంటనే పాక్ సైనికులు వచ్చి నచికేతను యుద్ధ ఖైదీగా పట్టుకున్నారు.

బాధలు పడ్డాడు కానీ భరతమాత రహస్యాలు చెప్పలేదు

బాధలు పడ్డాడు కానీ భరతమాత రహస్యాలు చెప్పలేదు


సైనికులు తనవైపు సమీపిస్తున్నారన్న సంగతి గ్రహించిన నచికేత అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లు ఇతరత్రా రహస్య సమాచారం మొత్తాన్ని ధ్వంసం చేశారు. ఇక పాక్ అధికారులు భారత మిలటరీ రహస్యాలు చెప్పాల్సిందిగా నచకేతను చిత్రహింసలకు గురిచేశారు. అయినప్పటికీ బాధను భరించాడు తప్పితే భరతమాతకు సంబంధించిన ఎలాంటి రహస్యాలు చెప్పలేదు. పాక్ ఉన్నతాధికారి ఒకరు చిత్రహింసలను ఆపివేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినప్పుడు మాత్రమే సైన్యం నచికేతపై దాడులు ఆపింది. తనను ఎంతలా చిత్రహింసలకు గురిచేశారో నాటి చేదు రోజులను గుర్తు చేసుకున్నారు నచికేత. అసలు మరుసటి రోజు చూస్తానో లేదో అన్నట్లుగా వారు హింసించారని నచికేత చెప్పారు. అయితే పాక్ ఉన్నతాధికారి యుద్ధ ఖైదీని విచారణ చేసే పద్ధతి ఇదికాదని చెప్పడంతో వారంతా వెనక్కు తగ్గారని వెల్లడించారు.

ఆ తర్వాత నచికేత యుద్ధ ఖైదీగా జూన్ 3 ,1999 వరకు ఉన్నారు. నాడు భారత ప్రభుత్వం నుంచి ఇతర అంతర్జాతీయ మీడియా నుంచి పాక్ పై త్రీవ ఒత్తిడి రావడంతో ఆయన్ను వదిలేశారు. నాడు యుద్దం జరుగుతున్న సమయంలో తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించడం...ఎంత చిత్రహింసలకు గురిచేసిన భారత్ రహస్యాలు చెప్పకపోవడాన్ని ప్రశంసిస్తూ నాటి ప్రభుత్వం ఆయన్ను వాయుసేన పథకంతో గౌరవించింది.

 నచికేతను విడిపించడంలో పార్థసారథి కృషి

నచికేతను విడిపించడంలో పార్థసారథి కృషి

ఇక నచికేతను విడిపించేందుకు నాడు ఇస్లామాబాద్‌లో భారత హై కమిషనర్‌గా ఉన్న పార్థసారథి కృషి కూడా చాలా ఉంది. నాడు తనకు ఓ ఫోన్‌కాల్ వచ్చిందని విదేశీవ్యవహారాల కార్యాలయంలో నచికేతన్‌ను ఉంచుతామని తనను తీసుకెళ్లాల్సిందిగా ఫోను వచ్చిందని చెప్పారు పార్థసారథి. దయ తలచి అతన్ని వదిలేస్తున్నామంటూ పాక్ చెప్పడాన్ని తాను జీర్ణించుకోలేకపోయానని అందుకే తను అక్కడికి రానని తేల్చి చెప్పినట్లు పార్థసారథి వివరించారు. జెనేవా కన్వెషన్ ప్రకారం పాకిస్తాన్ భారత అధికారులకు అప్పగించాల్సి ఉందని చెప్పారు. యుద్ధ సమయంలో దేశాలు ఎలా వ్యవహరించాలో అంతర్జాతీయ న్యాయసూత్రాలు జెనెవా కన్వెన్షన్‌లో పొందుపర్చారు. ఇక నచికేతను అదే రోజు సాయంత్రం జెనీవా కన్వెన్షన్ ప్రకారం పాక్ అధికారులు తనకు అప్పగించారని గుర్తుచేసుకున్నారు. అక్కడి నుంచి తాము వాఘా సరిహద్దు గుండా భారత్‌కు చేరుకున్నట్లు వెల్లడించారు.

పట్టుబడ్డ పైలట్‌ను ఎలా విడిపిస్తారు..?

పట్టుబడ్డ పైలట్‌ను ఎలా విడిపిస్తారు..?

ఇప్పుడు సరిగ్గా 20 ఏళ్ల తర్వాత భారత్ నాటి పరిస్థితులే ఎదుర్కొంటోంది. మిగ్ యుద్ధ విమానం నడుపుతున్న పైలట్ అదృశ్యమయ్యాడని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అదే సమయంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌ను తాము అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఇద్దరు పైలట్లను అరెస్టు చేసినట్లు బుధవారం ఉదయం చెప్పిన పాక్ ఆతర్వాత మాట మార్చింది. ఒక పైలట్‌కు తీవ్రగాయాలు అవడంతో ఆయన్ను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించినట్లు పాక్ పేర్కొంది. మరో పైలట్‌ను అదుపులోకి తీసుకున్నామని చెప్పి సాయంత్రం సమయంకల్లా మాట మార్చి ఒక పైలట్ మాత్రమే తమ అదుపులో ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఓ పైలట్ కస్టడీలో ఉన్నట్లు చెబుతున్న పాక్ అతని వదిలేస్తుందా..? మరి నాటి పరిస్థితులే రిపీట్ అవుతాయా... భారత్ ఎలాంటి వ్యూహంతో అదృశ్యమైన పైలట్‌ను తిరిగి తీసుకొస్తుంది తెలియాలంటే మరికొన్నిరోజులు వేచిచూడాల్సిందే.

English summary
Group Captain K. Nachiketa who is the recipient of the Vayu Sena Medal and the then Flight Lieutenant was an Indian Air Force fighter pilot who went for an air mission during the Kargil War but due to unfortunate circumstances and fierce combat his aircraft malfunctioned and he was taken a prisoner of war. Due to the efforts put by the then Indian high commissioner to Islamabad Parthasarathy, Nachiketa was released.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X