వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముకేశ్‌ అంబానీకి దిలీప్ సంఘ్వి చెక్: ఫోర్బ్స్ భారత రిచెస్ట్ మ్యాన్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

ముంబై: 2015 సంవత్సరానికి గాను అత్యంత సంపన్న భారతీయుడిగా సన్ ఫార్మా గ్రూప్ అధినేత దిలీప్ సంఘ్వి నిలిచారు. 2150 కోట్ల డాలర్ల (రూ. 1,29,000 కోట్లు) నికర సంపద విలువతో ఆయన ఆగ్రస్ధానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ మ్యాగజైన్ బుధవారం నివేదికలో పేర్కొంది.

రెండో స్ధానంలో ముకేశ్ అంబానీ, మూడో స్ధానంలో అజీమ్ ప్రేమ్‌జీ ఉన్నట్లు వెల్లడించింది. ఫోర్బ్స్ పత్రిక సోమవారం విడుదల చేసిన జాబితా ప్రకారం ముకేశ్ అంబానీ అగ్రస్ధానంలో ఉన్నారు. అయిత్ సన్ ఫార్మా షేర్లు విలువ ఒక్కసారిగా పెరగడంతో దిలీప్ సంఘ్వీ నెంబర్ వన్ స్ధానంలో నిలిచారు.

How Dilip Shanghvi Ended Mukesh Ambani's 8-Year Run as India's Richest

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ల విలువకు అనుగుణంగా ముకేశ్ అంబానీ సంపద 2100 కోట్ల డాలర్లు (రూ. 1,26, 000 కోట్లు)గా ఉన్నట్లు ఫోర్బ్స్ జాబితాలో పేర్కొంది. 2015 సంవత్సరానికి గాను ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో దిలీప్ సంఘ్వి 37వ స్ధానంలో నిలవగా, ముకేశ్ అంబానీ 43వ స్ధానంలో ఉన్నారు.

English summary
Dilip Shanghvi, the billionaire founder of drugmaker Sun Pharma, ended Reliance Industries promoter Mukesh Ambani's eight-year run as India's richest billionaire on Wednesday, according to Forbes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X