వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫలిస్తున్న తాలిబన్ల వ్యూహం-భారత్ లోకి పెరిగిన హెరాయిన్ రవాణా-నిఘా సమాచారం

|
Google Oneindia TeluguNews

ఏపీలో తాజాగా ఆఫ్ఘనిస్తాన్ నుంచి హెరాయిన్ అక్రమ రవాణాపై అధికార, విపక్షాల మధ్య రచ్చ సాగుతోంది ఆప్ఘనిస్తాన్ లోని గుజరాత్ లోని ముంద్రాపోర్టుకు వచ్చిన భారీ హెరాయిన్ డంప్ ను డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది దీంతో ఈ వివాదం మొదలైంది ఈ హెరాయిన్ తో ఏపీకి సంబంధం ఉందని విపక్షాలు, లేదని అధికార వైసీపీ వాదులాడుంకుంటున్నాయి. అయితే ఏపీతో సంబంధం ఉన్నా లేకున్నా భారత్ లోకి మాత్రం ఆప్ఘన్ నుంచి హెరాయిన్ అక్రమ రవాణా పెరిగిందని నిఘా నివేదికలు చెప్తున్నాయి.

 ఆప్ఘన్ లో తాలిబన్ల పాలన

ఆప్ఘన్ లో తాలిబన్ల పాలన

ఆప్ఘనిస్తాన్ లో గత రెండు నెలల్లో చోటు చేసుకున్న పరిణామాలతో ప్రజా ప్రభుత్వం కూలిపోయి ఆ స్ధానంలో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటైంది. అప్పటికే హెరాయిన్ ఎగుమతుల్లో ఆరితేరిన తాలిబన్లు ప్రభుత్వం వచ్చాక మాత్రం ఊరుకుంటారా .. ? ఇక మరింత వేగంగా అక్రమ ఎగుమతులు చేపడుతున్నారు. భూ, సముద్ర మార్గాల్లో ఈ ఎగుమతులు సాగిపోతున్నాయి. ఇందులో దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో భారత్ కూడా చేరిపోయింది. అసలే భారత్ అంటేనే మండిపడే తాలిబన్లు.. ఇఫ్పుడు మన దేశాన్ని డ్రగ్స్ మత్తులో ముంచేందుకు ఈ హెరాయిన్ అక్రమ రవాణా చేపడుతున్నట్లు తెలుస్తోంది.

ముంద్రా పోర్టు ఘటనతో

ముంద్రా పోర్టు ఘటనతో

తాజాగా ఆప్ఘనిస్తాన్ నుంచి భారీ ఎత్తున భారత్ చేరుకున్న హెరాయిన్ డంప్ ను గుజరాత్ లోని ముంద్రా పోర్టులో డిపార్ట్ మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సీజ్ చేశారు. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేగడానికి కారణమవుతోంది. అయితే ఈ డ్రగ్స్ పెట్టెలపై విజయవాడలోని ఓ కంపెనీ అడ్రస్ ఉండటంతో ఏపీ రాజకీయాల్లో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే ఇవేవీ పట్టించుకోకుండా ఈ డ్రగ్స్ భారత్ లోకి ఎలా వచ్చాయన్న దానిపై నిఘా సంస్ధలతో పాటు యాంటీ డ్రగ్, యాంట్రీ టెర్రరిస్ట్ ఏజెన్సీలు దృష్టిపెడుతున్నాయి. దీంతో కీలక సమాచారం వెలుగులోకి వస్తోంది.

ఇరాన్ ద్వారా సముద్ర మార్గంలో అక్రమ రవాణా

ఇరాన్ ద్వారా సముద్ర మార్గంలో అక్రమ రవాణా

ఆప్ఘనిస్తాన్ నుంచి నేరుగా భూ లేదా వాయు మార్గాల్లో భారత్ కు డ్రగ్స్ చేరుకునే అవకాశాలు లేవు. దీంతో తాజాగా పట్టుబట్ట హెరాయిన్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు సంస్ధలు దృష్టిపెట్టాయి. ఇందులో ఆప్ఘనిస్తాన్ నుంచి ఈ హెరాయిన్ డంప్ సముద్ర మార్గంలో ఇరాన్ ద్వారా భారత్ చేరిందనే నిర్ధారణకు వచ్చారు. ఆఫ్ఘన్ నుంచి ఇరాన్ ద్వారా సముద్ర మార్గంలో చేరిన ఈ డ్రగ్ డంప్ భారత్ లో ఎక్కడికి చేరాల్సి ఉందనే దానిపై విచారణ జరుగుతోంది. అదే్ సమయంలో విజయవాడకు చెందిన షెల్ కంపెనీ అడ్రస్ ఎందుకిచ్చారనే దానిపైనా డీఆర్ఐ, నార్కోటిక్స్ బ్యూరో, గుజరాత్ ఏటీఎస్ దర్యాప్తు చేస్తున్నాయి.

Recommended Video

China పక్కలో బల్లెంలా Taliban - Joe Biden తాలిబన్లతో చైనా భేటీ.. దూల తీరటానికే ! || Oneindia Telugu
వ్యూహంలో భాగమేనా ?

వ్యూహంలో భాగమేనా ?

ఆప్ఘనిస్తాన్ లో అధికారాన్ని కైవసం చేసుకున్న తాలిబన్లు ఆ తర్వాత విదేశాలపై దృష్టిపెట్టారన్న ప్రచారం జరుగుతోంది. ఆప్ఘన్ తరహాలోనే ముస్లిమేతరుల ఆధీనంలో ఉన్న భూభాగాలపై దృష్టిసారించాలని తాలిబన్లకు అల్ ఖైదా గతంలో సూచించింది. దీంతో తాలిబన్లు కశ్మీర్ లోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా కశ్మీర్ లో కేంద్రం గట్టి భద్రత కల్పిస్తోంది. అక్రమ చొరబాట్లు నివారించేందుకు ప్రయత్నిస్తోంది. అదే సమయంలో మిగతా మార్గాల ద్వారా కూడా భారత్ లోకి ప్రవేశించేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా హెరాయిన్ రవాణా చేయడం ద్వారా మార్గాలను క్లియర్ చేసుకోవాలనే ఉద్దేశంలో తాలిబన్లు ఉన్నట్లు అర్ధమవుతోంది. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకపోతే భవిష్యత్తులో నేరుగా ఎంట్రీ ఇచ్చేందుకు తాలిబన్లు ప్రయత్నించవచ్చన్న వాదన వినిపిస్తోంది. దీంతో భారత్ సముద్ర మార్గాల్ని కూడా కట్టుదిట్టం చేస్తోంది.

English summary
after taliban takeover of afghanistan, illegal transport of heroin has been increased in to india as intel reports suggested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X