వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కనీస అదాయ పథకం ఎలా అమలు చేస్తారు ?

|
Google Oneindia TeluguNews

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అటు కేంద్ర పార్టీలు ఇటు రాష్ట్ర పార్టీలు హమీల మీద హమీలు గుప్పిస్తున్నారు.అయితే వాటిని ప్రజలు నమ్ముతారా లేదా అనేది ఎన్నికల తర్వాత తేలనుంది.అంతకంటేముందుగా పార్టలు ఇస్తున్న హమీలు ఎలా సాధ్యమవుతుందనే చర్చలు కూడ ప్రజల్లో మొదలయ్యాయి.

రాహుల్ కోత్త స్కీం

రాహుల్ కోత్త స్కీం

ఈనేపథ్యంలోనే ప్రధాని మోడి కిసాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి దాన్ని అమలులోకి తీసుకువస్తే దానికి అనుగుణాంగానే కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధి మరో పథకాన్ని తీసుకువచ్చారు. ఈనేపథ్యంలోనే కనీస ఆదాయ పథకం ప్రకటించారు. దీంతో ఈ పథకం సాధ్యాసాద్యాలపై పలు చర్చలు జరుగుతున్నాయి..దీని అమలుకు సంబంధించి బీజేపి ప్రశ్నలు వేస్తూంటే..దీని పై వస్తున్న అనుమానాలపై కాంగ్రెస్ పార్టీ నివృత్తి చేస్తోంది.

5 కోట్ల కుటుంభాలకు కనీస అదాయ పథకం

5 కోట్ల కుటుంభాలకు కనీస అదాయ పథకం

దేశంలో ఉన్న నిరుపేదలను ఒక స్టేజీమీదకు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ కనీస ఆదాయ పథకాన్ని తీసుకువచ్చింది.ఈ నేపథ్యంలో దేశంలోని సుమారు 5 కోట్ల కుటుంభాలకు ప్రతినెల కనీసం ఆరువేల రుపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమచేస్తామని చెప్పారు.ఈ విధంగా ప్రతి సంవత్సరం ఓక్కో కుటుంభానికి సరాసరిన 76 వేల రుపాయలు ఇచ్చే స్కీంను తీసుకువచ్చింది..ప్రధానంగా ప్రతి కుటుంభం జీవించేందుకు కనీసం 12వేల రుపాయలు కావాలనే సూత్రం తో దీన్ని అమలు చేస్తున్నారు.దీంతో రాహుల్ చెబుతున్న 5 కోట్ల కుటుంభాల్లో మొత్తం 25 కోట్ల మందికి లబ్ది చేకూరుతుందని వారి అంచన .

ఎంతమంది పేదలు ఉన్నారు,

ఎంతమంది పేదలు ఉన్నారు,

అంతా బాగానే ఉన్నా దీనిపై పలు ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. దేశంలో 20 శాతం మంది పేదలు ఉన్నారని వారు కనీసం ఆరువేలు సంపాదిస్తున్నారని ఎలా అంచనా వేస్తారనేది ప్రశ్నగా మిగిలిపోయింది. మరోవైపు ప్రతి ఒక్క కుటుంభం యొక్క కనీస ఆదాయం ఎలా నిర్ణయిస్తారనే దానిపై కూడ పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

 మన బడ్జెట్ ప్రకారం సాధ్యమేనా ?

మన బడ్జెట్ ప్రకారం సాధ్యమేనా ?

రాహుల్ ప్రకటించిన స్కీం ప్రకారం ఓక్కో కుటుంభానికి సరాసరిగా సంవత్సరానికి 72 వేల రుపాయలు ఇవ్వాలి, దీంతో మొత్తం అయిదు కోట్ల కుటుంభాలకు గాను 3.6 లక్షల కోట్ల రుపాయాలు అవుతోంది. ఇది ఏడాది కేంద్రబడ్జెట్ లో 13 శాతం ,జాతియ స్థూల ఉత్పత్తిలో రెండు శాతం వాటకు సమానం .దీంతో ఇన్ని కోట్ల రుపాయలు ఎక్కడ నుండి తెస్తారనే ప్రశ్నలకు రాహుల్ వద్ద నుండి సమాధానం రావడం లేదు.

నిపుణుల అనుమానాలు

నిపుణుల అనుమానాలు

రాహుల్ గాంధీ కనీస ఆదాయ పథకం హామీని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు రాజీవ్ కుమార్ తప్పుపట్టారు. ఇది పని సంస్కృతికి వ్యతిరేకమని, ద్రవ్య క్రమ శిక్షణను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎన్నికల్లో నెగ్గేందుకు చందమామను తెచ్చిస్తానని చెప్పడం కాంగ్రెస్‌కు అలవాటేనని, అందులో భాగంగానే రాహుల్‌ ఇప్పుడు ఈ పథకాన్ని ప్రకటించారని, అది ఎప్పటికీ అమలుకాదని, ఈ పథకానికి జీడీపీలో 2 శాతం, బడ్జెట్‌లో 13 శాతం నిధులు అవసరమవుతుందనుకున్నా ప్రజల వాస్తవ అవసరాలు అపరిష్కృతంగానే ఉండిపోతాయన్నారు.

గతంలో ఇలాంటి ప్రకటనలు చేసిన నేతలు

గతంలో ఇలాంటి ప్రకటనలు చేసిన నేతలు

ప్రధాని నరేంద్రమోడి రైతులకు స్కీం ప్రకటించి డబ్బులు మొదటి మాత్రమే వేశారు.ఆయన అంతకు ముందే దేశవిదేశాల్లో పేరుకుపోయిన నల్లధనాన్ని వెలికి తీసి, జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షల రుపాయలు వేస్తానంటూ మోదీ ఇచ్చిన హమీ అలాగే ఉంది.మరి రాహుల్ గాంధి ప్రకటించిన స్కీం ఎమేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.

English summary
For Congress’s Rs 12k poll promise, fixing household income could be big hurdle,Experts say It will be difficult to determine household incomes. Policymakers now use household consumption expenses as a proxy for income data.Household income data at the national level doesn’t exist. Such data do exist at the state level compiled by state statistical bureaus, which then have to be cleaned up by Central Statistics Office
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X