వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాను దాటేస్తుందేమో అన్న దశ నుంచి... కరోనాతో సమర్థవంతంగా ఫైట్.. భారత్‌కు ఎలా సాధ్యపడింది?

|
Google Oneindia TeluguNews

గతేడాది భారత్‌లో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. త్వరలోనే అమెరికాను దాటిపోయే అవకాశం ఉందని చాలామంది నిపుణులు అంచనా వేశారు. కానీ ఆ అంచనాలు తలకిందులయ్యాయి. భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఎంతలా అంటే,గతేడాది సెప్టెంబర్‌లో రోజుకు లక్ష కరోనా కేసులు నమోదవగా... ఇప్పుడా సంఖ్య 10వేలకు పడిపోయింది. ప్రస్తుతం అమెరికాలో 28 మిలియన్ల కరోనా కేసులు ఉండగా... భారత్‌లో ఆ సంఖ్య 11మిలియన్లుగా ఉంది. కేసుల సంఖ్యలో అమెరికాను దాటేస్తుందేమో అన్న దశ నుంచి... ఇప్పుడు ఆ దేశం కంటే చాలా వెనకాల నిలిచింది భారత్.

హ్యూమన్ బారికేడ్...

హ్యూమన్ బారికేడ్...

భారత్‌ కరోనా వ్యాప్తిని ఇంత సమర్థవంతంగా ఎదుర్కొనడానికి కారణం 'హ్యూమన్ బారికేడ్' అని యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్‌కి చెందిన ఎపిడిమిలాజిస్ట్ భ్రమర్ ముఖర్జీ పేర్కొన్నారు. కొంతమంది పరిశోధక బృందంతో కలిసి భారత్‌లో కరోనా వ్యాప్తిపై ఆమె అధ్యయనం చేస్తున్నారు.భారత్‌లో ఈ ఏడాది మార్చి చివరి నాటికి కరోనా వ్యాప్తిలో స్థిరమైన తగ్గుదల నమోదవుతుందన్నారు.న్యూఢిల్లీ,వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ డిసీజ్ డైనమిక్స్,ఎకనమిక్స్&పాలసీ పరిశోధనా సంస్థకి చెందిన ఎపిడిమిలాజిస్ట్ రామణన్ లక్ష్మీనారాయణ్ మాట్లాడుతూ... ఒకానొక దశలో భారత్ కరోనా వ్యాప్తితో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నదని చెప్పారు. కానీ ఇప్పుడు మరో దశలోకి భారత్ ప్రవేశించిందన్నారు. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ వచ్చిందని తాను భావించట్లేదని... ఒకవేళ వచ్చినా దాని తీవ్రత మామూలుగానే ఉంటుందని తెలిపారు.

ఇవీ కారణాలు...

ఇవీ కారణాలు...


ఇటీవలి సీరోలాజికల్ సర్వేలో 21.5శాతం మంది భారతీయులు ఇప్పటికే కరోనా బారినపడి ఉండొచ్చునని వెల్లడైంది. అదే సమయంలో మరో డయాగ్నోస్టిక్ కంపెనీ చేపట్టిన యాంటీబాడీ టెస్టుల్లో 55శాతం మంది ఇప్పటికే కరోనా బారినపడినట్లు తేలింది. భారత జనాభాలో యువత ఎక్కువగా ఉండటం... ఆదిలోనే కరోనా కట్టడికి లాక్‌డౌన్ వంటి చర్యలు చేపట్టడం,ఎక్కువమందిలో అంతర్గత రోగ నిరోధక శక్తి మెండుగా ఉండటం కారణంగా దేశంలో కరోనా వ్యాప్తి తగ్గిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను చురుగ్గా చేపడితే భారత్ ఇంకా మెరుగైన స్థితికి చేరుకుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుందని నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని,మరింత అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా కరోనా నుంచి బయటపడవచ్చునని అంటున్నారు.

ఆ రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు...

ఆ రెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు...


ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల్లో మాత్రం ఆ సంఖ్య మళ్లీ పెరుగుతోంది. దీంతో ముంబై లాంటి నగరాల్లో మళ్లీ లాక్ డౌన్ విధించే దిశగా అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. దేశంలో ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనే 70శాతం కేసులు ఉండటం గమనార్హం. ఇటీవల కేరళలో స్కూళ్లు పున:ప్రారంభం కావడంతో కేసుల సంఖ్య పెరిగినట్లు చెప్తున్నారు. ముంబైలో లోకల్ ట్రైన్స్‌ను పునరుద్దరించడం అక్కడ కేసుల సంఖ్య పెరుగుదలకు కారణంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాలు మళ్లీ కట్టుదిట్టమైన చర్యలపై ఫోకస్ చేశాయి.

English summary
There is a human barricade for the virus," said Bhramar Mukherjee, an epidemiologist at the University of Michigan, who with a team of researchers, has been modelling the trajectory of the outbreak in India."By the end of March, we should see a very slow, steady decline (in cases)," she added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X