బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడీ ఎఫెక్ట్: సీఎంకే సమాచారం లేదు, చేతులు ఎత్తేశారు, అందుకే ఐటీ సోదాలు, ఏం చేస్తారు !

కర్ణాటక హోం శాఖ, ఇంటిలిజెన్స్ వర్గాలు చేతులు ఎత్తేయడంతోనే ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు కష్టాలు ఎదురైనాయని తెలిసింది. కర్ణాటకలో పవర్ ఫుల్ మంత్రి అనే పేరు ఉన్న డీకే.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక హోం శాఖ, ఇంటిలిజెన్స్ వర్గాలు చేతులు ఎత్తేయడంతోనే ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డీకే. శివకుమార్ కు కష్టాలు ఎదురైనాయని తెలిసింది. కర్ణాటకలో పవర్ ఫుల్ మంత్రి అనే పేరు ఉన్న డీకే. శివకుమార్ తన ఇంటి మీద ఐటీ శాఖ అధికారులు దాడి చేస్తారని కనీసం పసిగట్టలేకపోయారు.

రాజ్యసభ ఎన్నికల దెబ్బ: కర్ణాటక మంత్రి ఇంటిలో రూ. 11 కోట్లు సీజ్, గుజరాత్ ఎమ్మెల్యేలు !రాజ్యసభ ఎన్నికల దెబ్బ: కర్ణాటక మంత్రి ఇంటిలో రూ. 11 కోట్లు సీజ్, గుజరాత్ ఎమ్మెల్యేలు !

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. హోం శాఖ, ఇంటిజెన్స్ శాఖలు సైతం సీఎం సిద్దరామయ్య చేతుల్లో ఉన్నాయి. అయితే డీకే. శివకుమార్ ఇంటి మీద ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తారు అనే విషయం ఇంటిలిజెన్స్ వర్గాలు పసిగట్టలేకపోయాయి.

How IT dept sprung a surprise on guj MLAs lodged in Bengaluru resort

ఇంటిలిజెన్స్ వర్గాల వైఫల్యం వలనే డీకే. శివకుమార్ కు సినిమా కష్టాలు మొదలైనాయని తెలిసింది. డీకే. శివకుమార్ ఇంటి మీద ఐటీ శాఖ దాడులు చేసిన నేపథ్యంలో కర్ణాటక సీఎం సోషల్ మీడియాలో స్పందించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అధికార దుర్వినియోగం చేసిందని ఆరోపించారు.

మోడీ షాక్: రిసార్ట్ కు రూ. 982 కోట్లు ఫైన్, అంతలోనే కాంగ్రెస్ కు ప్రేమ, ఆంధ్రా వ్యాపారి ఎవరు ?మోడీ షాక్: రిసార్ట్ కు రూ. 982 కోట్లు ఫైన్, అంతలోనే కాంగ్రెస్ కు ప్రేమ, ఆంధ్రా వ్యాపారి ఎవరు ?

ఐటీ శాఖ దాడులు చేసే సమయంలో స్థానిక పోలీసుల సహకారం తీసుకోవాలని, ఆ నియమాలు పక్కన పెట్టి సీఆర్ పీఎఫ్ సిబ్బందిని భద్రతా ఏర్పాట్లకు నియమించుకుని నియమాలు ఉల్లంఘించారని సీఎం సిద్దరామయ్య సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు.

English summary
The Income Tax raids being conducted at the resort near Bengaluru housing the 40 odd Gujarat MLAs was carried out with the help of the Central Reserve Police Force. It was a high profile operation and it was decided that the sleuths would also raid the residences of Karnataka minister D K Shivakumar and hence the department did not want the information to leak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X