వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాది 20 సార్లు ఎస్కేప్, భార్య కోసం వచ్చి బలి అయ్యాడు, వీడు సామాన్యుడు కాదు !

లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాది అబు దుజనా అతని భార్య కోసం వచ్చి ఎన్ కౌంటర్ లో అంతం అయ్యాడని జమ్మూ కాశ్మీర్ సీనియర్ పోలీసు అధికారి ఎస్ పి. వాయిద్ చెప్పారు. అబు దుజనాతో పాటు మరో ఉగ్రవాది ఆరీఫ్ లిహారి కూ

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఉగ్రవాది అబు దుజనా అతని భార్య కోసం వచ్చి ఎన్ కౌంటర్ లో అంతం అయ్యాడని జమ్మూ కాశ్మీర్ సీనియర్ పోలీసు అధికారి ఎస్ పి. వాయిద్ చెప్పారు. అబు దుజనాతో పాటు మరో ఉగ్రవాది ఆరీఫ్ లిహారి కూడ ఎన్ కౌంటర్ లో మరణించాడని ఆయన దృవీకరించారు.

ఇప్పటి వరకూ 20 సార్లు భారత సైనికులు, స్థానిక పోలీసులకు చిక్కకుండా అబు దుజనా తప్పించుకున్నాడు. అయితే రెండు సార్లు పోలీసులు అతను తప్పించుకుంటున్న సమయంలో ఎన్ కౌంటర్ చెయ్యాలని ప్రయత్నించినా అది కుదరలేదు. అబు దుజనా తన భార్య కోసం వస్తాడని పోలీసులు పసిగట్టారు.

How Jammu and Kashmir police killed LET commander Abu Dujana

సోమవారం అర్దరాత్రి అబు దుజనా తన భార్యను కలవడానికి పుల్వామా జిల్లాలోని హక్రిపోరా ప్రాంతంలోకి తన సహచరుడు ఆరీఫ్ లిహారీతో కలిసి వచ్చాడు. ఇద్దరు ఉగ్రవాదులు ఇంటిలోకి వెళ్లిన వెంటనే సైనికులు, పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.

మంగళవారం వేకువ జామున 4.30 గంటల వరకు ఉగ్రవాదులు బయటకు వస్తారని వేచి చూశారు. అయితే అబు దుజనా, ఆరీఫ్ లిహారీ బయటకు రాకపోవడంతో తాము ఇంటిలో చొరబడి ఉగ్రవాదులను అంతం చేశామని అధికారులు తెలిపారు.

పాక్ అక్రమిత కాశ్మీర్ కు చెందిన అబు దుజనా దక్షిణ కాశ్మీర్ లో జరిగిన అనేక దాడుల ప్రధాన సూత్రదారి అని అధికారులు అంటున్నారు. అబు దుజనా ఎన్ కౌంటర్ తో ఉగ్రవాదులు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తారని పసిగట్టిన పోలీసులు స్థానికంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

English summary
The dreaded militant Abu Dujana has been killed by security forces in the Valley. The Lashkar-e-Tayiba militant, Dujana who had several miraculous escapes in the past year has finally been killed when he came to meet his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X