• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మైనస్ 70 డిగ్రీలో చలిలో వంట, వార్పు : సియాచిన్‌లో సైనికుల పాట్లు,

|

న్యూఢిల్లీ : మనం ఎండను తట్టుకోలేం. వర్షమొచ్చినా అదే పరిస్థితి. ఇక చలి సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సాధారణ చలికే మనం గజగజ వణికిపోతాం. అదే సియాచిన్ హిమానీనదం అయితే .. ఇక పరిస్థితి చెప్పక్కర్లేదు. కశ్మీర్‌లా మైనస్ డిగ్రీలు కాదు .. ఏకంగా 40 నుంచి 70 మైనస్ డిగ్రీల చలిలో కూడా మన సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంతకీ మన సైనికులు ఏమేం ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకుందాం. పదండి.

మంచుదుప్పటి ..

మంచుదుప్పటి ..

సియాచిన్ హిమానీనదం. మంచుపర్వతంలో మంచుదుప్పటి కప్పుకొని ఉంటుంది. సముద్రానికి ఎత్తైన పర్వతం .. అందులో మంచ కప్పబడి ఉంటుంది. ఈ ప్రాంతంపై కూడా ఉగ్రవాదులు దాడులకు తెగబడుతుంటారు. దీంతో భారత సైన్యం కంటికి రెప్పాలా ఈ ప్రాంతాన్ని కాపాడుతుంది. కానీ ఇక్కడ అసాధారణంగా ఉష్ణోగ్రతలు ఉంటాయి. సాధారణంగానే మైనస్ డిగ్రీలు .. అవీ శీతకాలం నాటికి మైనస్ 40 నుంచి 70 డిగ్రీలకు చేరుకుంటుంది. అంటే సాధారణ దుస్తులు వేసుకుంటే మనిషి గడ్డకట్టే పరిస్థితి. మన సైనికులు శత్రువులతోనే కాదు .. తమతో తాము కూడా యుద్ధం చేస్తున్నారు.

మమూలు చలి కాదు ...

మమూలు చలి కాదు ...

అంతటి శీతల పరిస్థితుల్లో విధుల నిర్వహణ అంటే మాటలు కాదు. ఆ ప్రాంతాన్ని కాపాడేందుకు ప్రతి సెకను కూడా అప్రత్తంగా ఉండాల్సిన పరిస్థితి. దీనికితోడు చలిగాలులు వీయడంతో .. ఆహారం తవండుకునే సమయంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సియాచిన్‌లో తాము ఎలాంటి పరిస్థితులో ఉన్నామనే తెలిపే వీడియో ఒకటి బయటకొచ్చింంది. ఇంకేముంది ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. అత్యంత చలిలో అక్కడున్న సైనికులు వంట వండేందుకు పాట్లు పడుతున్న పరిస్థితి వీడియోలో స్పష్టంగా కనిపించింది. ముగ్గురు సైనికులు కత్తి పట్టుకొని .. పొట్ట కూటి కోసం పాడుతున్న పాట్లు హృదయవిదారకంగా ఉంది.

సైనికుల పాట్లు ...

సైనికుల పాట్లు ...

అక్కడున్న ఓ ఫ్రూట్ జ్యూస్‌ను తెరిచేందుకు కూడా కష్టమైంది. తమ వద్ద ఉన్న సుత్తితో కష్టపడి మరీ తెరిచారు. అంతేకాదు ఆ జ్యూస్ అంతటిని ఓ పాత్రలో పెట్టి వేడి చేశాక .. సేవించారు. లేదంటే గడ్డకట్టి జ్యూస్ వచ్చేది కాదు. అంతేకాదు తమ వద్ద ఉన్న కోడిగుడ్డు ఎలా గడ్డకట్టిందో కూడా చూపించారు. ఇది సియాచిన్ ఎగ్ అని వీడియోలో చూపించారు. కోడిగుడ్డును కూడా ఉడకబెట్టాక .. కత్తిరించేందుకు ఇబ్బందిపడ్డారు. అంతేకాదు ఆలుగడ్డ, టమాట, కూరగాయాలను వేడినీళ్లలో కాసేపు ఉడకబెట్టాకే వండుకుంటామని స్పష్టంచేశారు. ఈ వీడియో బయటకొచ్చాక .. చాలామంది ప్రజలు జవాన్లు సెల్యూట్ చేశారు. సరిహద్దుల్లో కాపాలా కాస్తున్నా వీరులారా అని కీర్తిస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The thought of battling extremely cold temperatures ranging from minus 40-70 degrees scares most people but the same does not apply to Indian Army soldiers posted in the Siachen glacier area. Survival, for them, is no less than a war: From facing extremely chilly winds to making food-everything is a challenge for these army men posted along the Siachen glacier. In a video that has gone viral, a few soldiers posted in Siachen demonstrate how hard it is for them to cook or consume food in the extremely cold weather conditions. Using a hammer and knife, the three soldiers featured in the video show the difficult procedure involved in consuming food. After the video went viral on social media, many people have come out in support of the soldiers and thanked them for the hardships they go through to protect the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more