వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరుణానిధి వర్సెస్ ఎమ్జీఆర్: ఒక్కటిగా ఉన్న ఇద్దరు...ఎలా విడిపోయారు..?

|
Google Oneindia TeluguNews

తమిళనాడు రాజకీయాలను ఏలిన ముగ్గురు ఉద్దండులకు ఎక్కడో ఏదో సంబంధం ఉందనే చెప్పాలి. ఇందులో కలైంజ్ఞర్ కరుణానిధి కాగా, ఇంకొకరు ఎమ్.జీ.రామచంద్రన్. మరొకరు జయలలిత. ఈ ముగ్గురూ తమిళ రాజకీయాలను అత్యధికంగా నడిపారు. ముగ్గురూ సినీరంగం నుంచే వచ్చి రాజకీయ ఉద్దండులుగా ఎదిగారు. తమిళ ప్రజలకు సేవ చేశారు. అంతేకాదు ముగ్గురు ఒకే పార్టీలో ఉన్నారు.. ఆ తర్వాత కరుణానిధితో విబేధాలు వచ్చి మరో కుంపటి పెట్టారు.

Recommended Video

Why Karunanidhi is Called 'Kalaignar'? ' కలైంజ్ఞర్ ' అంటే అర్ధం ఏమిటో తెలుసా??

డిసెంబర్ 2016లో జయలలిత మృతితో కరుణానిధికి రాజకీయంగా శతృవులు లేకుండా పోయారు. ఇక ఎవరిపైనా తాను యుద్ధం చేయదలుచుకోలేదు. తన రాజకీయ ప్రస్థానం ఎమ్జీఆర్‌ స్నేహంతో ప్రారంభంకాగా... ఆ తర్వాత ఇద్దరి మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్కడి నుంచి అదే విబేధాలు జయలలితతో కూడా కరుణానిధికి వచ్చాయి.

ఎమ్జీఆర్ కోసమే అన్నట్లుగా కథలు రాశారు

ఎమ్జీఆర్ కోసమే అన్నట్లుగా కథలు రాశారు

కరుణానిధి ఒక అధ్భుతమైన రచయిత. తాను సినిమాలకు రాసినంతగా బహుశా తన చరిత్రను కూడా అంత గొప్పగా రాసుకుని ఉండేవాడు కాదేమో. ఒక్కసారి 1947కు వెళితే.. ఎమ్జీర్ నటించిన రాజకుమారి చిత్రానికి కథ రాశారు కరుణానిధి. ఆ తర్వాత మూడేళ్లకు కేవలం ఎమ్జీఆర్ కోసమే మంత్రి కుమారి అనే కథను రాశారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టాయి. రచయితగా కరుణానిధికి, నటుడిగా ఎమ్జీఆర్‌కు ఘనకీర్తిని తీసుకొచ్చాయి.

ఒకే గూటి పక్షులు ఎమ్జీఆర్, కరుణానిధి

ఒకే గూటి పక్షులు ఎమ్జీఆర్, కరుణానిధి


అన్నాదురై స్థాపించిన డీఎంకే పార్టీలో కరుణానిధి, ఎంజీఆర్ ఇద్దరూ చేరారు. అయితే అప్పటికే ఎమ్జీఆర్‌కు ప్రజల్లో ఓ గొప్పనటుడిగా స్థానం సంపాదించుకున్నారు. పార్టీలో డీఎంకేకు స్టార్ క్యాంపెయినర్‌గా ఎదిగారు. ఇది కరుణానిధికి రుచించలేదు. దీంతో ఎమ్జీఆర్‌కు రీప్లేస్‌మెంట్‌గా కరుణానిధి తన పెద్దకొడుకు ముత్తును తమిళసినిమా రంగంలో ప్రమోట్ చేశాడు. అయితే ముత్తు సక్సెస్ కావడంలో విఫలమయ్యాడు. దీంతో ఎమ్జీఆర్‌కు వస్తున్న పాపులారిటీతో కరుణానిధికి ఏమి చేయాలో పాలుపోలేదు. ఎమ్జీఆర్ ఆ స్థాయి హీరో అయ్యేందుకు కరుణానిధి పాత్ర కూడా ఉంది. ఇక ఎమ్జీఆర్‌కు ప్రజల్లో పెరిగిపోతున్న పాపులారిటీ కరుణానిధి రాజకీయ కెరీర్‌ను ఇరుకున పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య విబేధాలు ప్రారంభమయ్యాయి. ఎమ్జీఆర్ డీఎంకే నుంచి తన సొంత పార్టీ అన్నాడీఎంకేను స్థాపించారు.

సినిమా సోరు పోదుమా..?

సినిమా సోరు పోదుమా..?

అన్నాడీఎంకే పార్టీ నడిగార్ కచ్చి అని కరుణానిధి సంబోధించారు. అంటే ఒక నటుడి పార్టీ అని అర్థం. అంతేకాదు ఎమ్జీఆర్ ఒక నటుడని , నటన వేరు రాజకీయం వేరని ప్రజల్లో బలంగా తీసుకెళ్లేందుకు కరుణానిధి గట్టి ప్రయత్నమే చేశారు. అంతేకాదు నటులు రాజకీయాలు చేయలేరనే అర్థం వచ్చేలా కరుణానిధి పాటలు కూడా రాయించారు. ఇందులో భాగంగానే "సినిమా సోరు పోదుమా..?" అంటే సినిమా మనకు బతుకునిస్తుందా..? అనే అర్థంతో పాటల పుస్తకాలు విడుదల చేశారు.

కరుణానిధి ఎమ్జీఆర్‌ల మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు

కరుణానిధి ఎమ్జీఆర్‌ల మధ్య తారాస్థాయికి చేరిన విభేదాలు

ఇక దీనిపై తీవ్రంగా స్పందించారు ఎమ్జీఆర్. కరుణానిధి ప్రభుత్వం అవినీతిపై ఓ నివేదికను తయారు చేసి కేంద్రానికి సమర్పించారు. 1976 జనవరిలో కరుణానిధి ప్రభుత్వాన్ని కేంద్ర రద్దు చేసింది. అవినీతి ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా కేంద్రం జస్టిస్ సర్కారియా కమిషన్‌ను వేసింది. ఇక 1976 నుంచి 1989వరకు కరుణానిధికి అత్యంత గడ్డుకాలం అని చెప్పొచ్చు. దాదాపు 13 ఏళ్ల వరకు అధికారానికి దూరంగా ఉన్నారు. అదే సమయంలో డీఎంకే క్యాడర్‌లో నిస్తేజానికి గురికాకుండా వారిని కాపాడుకునే ప్రయత్నం చేశారు. 1984లో కరుణానిధి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. అసలు కరుణానిధి గొంతు వినపడకూడదని... శాసనమండలితో పెద్దగా ఉపయోగం ఉండదని చెబుతూ మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశారు.

సన్నిహితులే మోసం చేశారనే బాధ

సన్నిహితులే మోసం చేశారనే బాధ


ఇద్దరు సన్నిహితంగా ఉన్న వ్యక్తులే తనకు బద్ద శతృవులుగా మారారని .. ఆ ఇద్దరూ కూడా రాజకీయాల్లో తనకు జూనియర్లేనని ఎమ్జీఆర్, జయలలితలను గురించి ఎప్పుడూ చెబుతారు కరుణానిధి. ఆ ఘటన తనను వేధిస్తూఉండేదని చెబుతారు. ఇక 1976లో కరుణానిధి ప్రభుత్వం రద్దు తర్వాత ఎమ్జీఆర్ మరణాంతం వరకు కరుణానిధి అధికారం రుచిచూడలేదు. 1987లో ఎమ్జీఆర్ మరణం తర్వాతే కరుణానిధి మళ్లీ అధికారాన్ని రుచిచూశారు. ఆ తర్వాత 2016లో చివరి సారిగా కరుణానిధి సీఎం అయ్యే అవకాశాలకు జయలలిత గండికొట్టింది.

English summary
Call it a quirk of destiny or anything else but M Karunanidhi's health took a turn for the worse just days before Jayalalithaa's demise in December 2016. It was as if it were a signal for Karunanidhi that with his principal adversary gone, he had no big battles left to fight. His political career had been marked by a friendship with MG Ramachandran that turned sour, followed by the bitterness of his relationship with Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X