వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుర్మీత్‌కు కళ్లు చెదిరే ఆస్తులు, సిర్సాలో 1,400 కోట్లు: ఇదీ ఆస్తుల లెక్క, హనీప్రీత్ ఎత్తుకెళ్లారా

అత్యాచారం కేసులో జైల్లో ఉన్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌‌కు కళ్లు చెదిరే ఆస్తులు ఉన్నాయి. అక్రమంగా కోట్లలో ఆస్తులు కూడబెట్టినట్లు హర్యానా ప్రభుత్వం బుధవారం తెలిపింది.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: అత్యాచారం కేసులో జైల్లో ఉన్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ సింగ్‌‌కు కళ్లు చెదిరే ఆస్తులు ఉన్నాయి. అక్రమంగా కోట్లలో ఆస్తులు కూడబెట్టినట్లు హర్యానా ప్రభుత్వం బుధవారం తెలిపింది.

చదవండి: 'లొంగిపోవడమే బెట్టర్': డేరాబాబా రూంలో నగ్నంగా తిరుగుతూ వీడియో తీయించిన హనీప్రీత్?

సిర్సాలోనే రూ.1453 కోట్ల ఆస్తి

సిర్సాలోనే రూ.1453 కోట్ల ఆస్తి

డేరా బాబా ఆస్తులకు సంబంధించిన వివరాలను రాష్ట్ర ప్రభుత్వం నివేదిక రూపంలో బుధవారం హర్యానా, పంజాబ్‌ హైకోర్టుకు సమర్పించింది. ఆయనకు సిర్సా ప్రాంతంలోనే దాదాపు రూ.1,453 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు నిర్ధారించింది.

అనుకున్న దానికంటే ఎక్కువే

అనుకున్న దానికంటే ఎక్కువే

హర్యానా వ్యాప్తంగా డేరాకు చెందిన ఆస్తులు రూ.1,600కోట్లకు పైగా ఉండవచ్చునని అంచనా వేసింది. ప్రభుత్వ అంచనాలకు మించి డేరా బాబా ఆస్తులున్నాయి. వాటి విలువ అనుకున్న దాని కంటే 1.5రెట్లు అధికంగా ఉన్నాయి. మార్కెట్ వ్యాల్యూ చూసుకుంటే చాలా ఎక్కువ ఆస్తులు ఉంటాయి.

ఎక్కడెక్కడ ఎంత అంటే..

ఎక్కడెక్కడ ఎంత అంటే..

డేరా బాబా ఆస్తులు సిర్సాలో రూ.1453 కోట్లు, అంబాలాలో రూ.32.20 కోట్లు, జజ్జర్‌లో రూ.29.11 కోట్లు, ఫతేబాద్‌లో రూ.20.70 కోట్లు, జింద్‌లో రు.19.33 కోట్లు, సోనిపట్‌లో రూ.17.65 కోట్లు, కైతాల్‌లో రూ.11.16 కోట్లు, కురుక్షేత్రలో రూ.7.42 కోట్లు, హిసార్‌లో రూ.7.03 కోట్లు, కర్నాల్‌లో రూ.6 కోట్లు, బివానిలో రూ.3.87 కోట్లు, యమునా నగర్‌లో రూ.3.14 కోట్లు, పానిపట్‌లో రూ.2.82 కోట్లు, ఫరీదాబాద్‌లో రూ.1.56 కోట్లు, రోహతక్‌లో రూ.0.47 కోట్లు, రేవారిలో రూ.0.37 కోట్లు ఉన్నట్లుగా ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.

504 బ్యాంకుల్లో ఖాతాలు

504 బ్యాంకుల్లో ఖాతాలు

గుర్మీత్‌కు 504 బ్యాంకు ఖాతాలలో రూ.75కోట్లు ఉన్నట్లు అధికారులు గతంలో గుర్తించారు. 504 బ్యాంకు ఖాతాల్లో ఒక్క సిర్సా జిల్లాలోనే 495 ఉన్నాయి.

చరాస్తులు తరలించారా?

చరాస్తులు తరలించారా?

డేరాబాబా వద్ద పెద్ద ఎత్తున అక్రమాస్తులు ఉన్న నేపథ్యంలో మనీ లాండరింగ్ కోణంలో దర్యాఫ్తు చేయాలని ఈడీ, ఇన్‌కం ట్యాక్స్ డిపార్టుమెంట్లకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, సిర్సా నుంచి చరాస్తులను ఏమైనా తీసుకు వెళ్లారా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హనీప్రీత్ ఆధ్వర్యంలో ఎత్తుకెళ్లారా?

హనీప్రీత్ ఆధ్వర్యంలో ఎత్తుకెళ్లారా?

కాగా, డేరా బాబాకు శిక్ష పడిన అనంతరం సిర్సా నుంచి పెద్ద ఎత్తున ఆస్తులను హనీప్రీత్ ఆధ్వర్యంలో దొంగచాటున తీసుకెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. సోదాలకు ముందే ఏమైనా తీసుకు వెళ్లారో తేల్చాలని చెప్పింది.

English summary
Gurmeet Ram Rahim Singh was not just a (self-confessed) godman, he was also a millionaire, the Haryana government has revealed. In a report that the ML Khattar government submitted to the Haryana and Punjab High Court today, the Dera Sacha Sauda, the controversial sect run by Ram Rahim, has been valued at Rs 1,453 crore.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X