వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అదే జరిగితే ఫలితం తారుమారు!: మధ్యప్రదేశ్‌లో బీజేపీని నోటా ఎలా దెబ్బతీసిందంటే?

|
Google Oneindia TeluguNews

భోపాల్: మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అత్యంత స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది. వరుసగా మూడుసార్లు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వం అయినా నాలుగోసారి గెలుపొందడం కష్టమే. గెలుపే కాదు.. గట్టి పోటీనివ్వడం కూడా చాలా అరుదు. కానీ బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీకి మంచి పోటీ ఇచ్చింది.

మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఓటమి ఓటమే.. కానీ దాని వెనుక కారణాలను కూడా విశ్లేషిస్తుంటారు. ముఖ్యంగా రైతుల ఆందోళనలు బీజేపీని దెబ్బతీశాయి. ఈ ఒక్కకారణంతో అయితే బీజేపీ కష్టంగా అయినా గట్టెక్కేదే. వరుసగా మూడోసారి అధికారం, కొంతమంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వంటి కొన్ని ఇతర కారణాలూ ఉన్నాయి.

<strong>కమల్ నాథ్Xజ్యోతిరాదిత్య సింధియా: సీఎం అభ్యర్థిని తేల్చనున్న రాహుల్ గాంధీ</strong>కమల్ నాథ్Xజ్యోతిరాదిత్య సింధియా: సీఎం అభ్యర్థిని తేల్చనున్న రాహుల్ గాంధీ

 22 చోట్ల ప్రభావం చూపిన నోటా

22 చోట్ల ప్రభావం చూపిన నోటా

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకే ఎక్కువ శాతం ఓట్లు రావడం గమనార్హం. బీజేపీ ఓటమికి కారణాల్లో నోటా కూడా ఒకటి అని చెబుతున్నారు. రాష్ట్రంలో పోలైన ఓట్లలో 1.4 శాతం.. 5,42,295 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇది అయిదో అత్యధికం. అంటే బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, జీజీపీ ఇలా వీటి తర్వాత ఎక్కువ ఓట్లు పడింది నోటాకే. నోటా 22 నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపింది. ఈ ఎన్నికల్లో 230 సీట్లున్న మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 114, బీజేపీ 109 సీట్లలో గెలిచింది. మేజిక్ ఫిగర్ ఏ పార్టీకి రాలేదు. దీంతో బీఎస్పీతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అదే నోటా 22 చోట్ల ప్రభావం చూపడం గమనార్హం.

అదే జరిగితే ఫలితం తారుమారయ్యేది

అదే జరిగితే ఫలితం తారుమారయ్యేది

మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 41 శాతానికి పైగా ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు అంతకంటే తక్కువ 40.9 శాతం వచ్చాయి. ఆ తర్వాత బీఎస్పీకి 5 శాతం, జీజీపీకి 1.8 శాతం వచ్చాయి. ఆ తర్వాత నోటాకు 1.4 శాతం ఓట్లు వచ్చాయి. చాలా చోట్ల బీజేపీ అభ్యర్థులు తక్కువ మెజార్టీతో ఓడిపోయారు. ఉదారహణకు గ్వాలియర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కేవలం 121 ఓట్లతో ఓడిపోయారు. కానీ ఇక్కడ నోటాకు 1550 ఓట్లు పడ్డాయి. ఇందులో కనీసం యాభై నుంచి వంద బీజేపీకి పడినా ఫలితం తారుమారయ్యేది.

మరిన్ని ఉదాహరణలు

మరిన్ని ఉదాహరణలు

మరిన్ని ఉదాహరణలు చూస్తే... దామోహ్ నియోజకవర్గంలో మాజీ ఆర్థిక మంత్రి జయంత్ మలైయ్యా 799 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ నోటాకు 1300 ఓట్లు పోలయ్యాయి. జబల్బూర్ నుంచి పోటీ చేసిన శరద్ జైన్ 578 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ కూడా నోటాకు 1300 ఓట్ల వరకు పడ్డాయి. బుర్హన్‌పూర్ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి అర్చనా చిట్నిస్ 5000 పై చిలుకు మెజార్టీతో ఓడిపోయారు. ఇక్కడ నోటాకు 5700 ఓట్లు పోలయ్యాయి.

కొందరు కాంగ్రెస్ అభ్యర్థుల పైనా దెబ్బ

కొందరు కాంగ్రెస్ అభ్యర్థుల పైనా దెబ్బ


22 స్థానాల్లో నోటా అభ్యర్థుల గెలుపోటములపై దాదాపుగా ప్రభావం చూపింది. ఇందులో ఎక్కువ మంది దెబ్బతిన్నది బీజేపీ అభ్యర్థులే. అలాగే కొన్ని చోట్ల కాంగ్రెస్ నేతలు కూడా దెబ్బతిన్నారు. తిమర్ని నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అభిజిత్ సాహా 2,213 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ నోటాకు నాలుగువేలు వచ్చాయి. నాగోడ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి యాదవేంద్ర సింగ్ 1234 ఓట్లతో ఓడిపోయారు. ఇక్కడ నోటాకు 2301 ఓట్లు వచ్చాయి.

English summary
In the hard-fought Madhya Pradesh assembly elections, which the Congress went on to win eventually, NOTA had the fifth largest tally. As per the statistics available, NOTA crossed the victory margins in 22 constituencies in MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X