వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూడ్ ఆఫ్ ది నేషన్: కరోనాపై భారత్‌దే పైచేయి, మోడీ సర్కారు సక్సెస్, లాక్‌డౌన్ ఎఫెక్ట్, వ్యాక్సిన్‌కే మొగ్గు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ 2021లో కరోనాకు సంబంధించిన కీలక విషయాలు వెల్లడయ్యాయి. కరోనా మహమ్మారిని భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని, నరేంద్ర మోడీ సర్కారు కరోనాపై పోరులో విజయం సాధించిందని మెజార్టీ ప్రజలు పేర్కొన్నారు. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎంతో మెరుగ్గా ఉందని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటాం..

కరోనా వ్యాక్సిన్ తీసుకుంటాం..

ఇక కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు దేశంలోని 76 శాతం మంది ప్రజలు మొగ్గుచూపుతున్నారు. 21 శాతం మంది వ్యాక్సిన్ తీసుకునేందుకు ఇష్టపడటం లేదు. 3 శాతం మంది ఎటే తేల్చుకోలేదు. మరోవైపు, 92 శాతం మంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వాలని కోరుకుంటున్నారు. 7 శాతం మంది ఉచితంగా వద్దంటున్నారు. 1 శాతం మంది ఏమీ చెప్పలేదు.

లాక్‌డౌన్ కరోనాను అడ్డుకుంది.. కానీ,

లాక్‌డౌన్ కరోనాను అడ్డుకుంది.. కానీ,

కరోనా మహమ్మారి నియంత్రణకు లాక్‌డౌన్ ఎంతగానో దోహదపడిందిన 39 శాతం మంది ప్రజలు చెప్పారు. మరో 28 శాతం మంది కరోనా వ్యాప్తిని అడ్డుకున్నప్పటికీ.. ఇతర సమస్యలకు కారణమైందన్నారు. 13 శాతం మంది ప్రభావం చూపలేదన్నారు. 10 శాతం మంది ఆర్థిక నష్టం జరిగిందన్నారు. మరో 7 శాతం మంది కరోనా వ్యాప్తిని అడ్డుకున్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందన్నారు.

ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ఓకే..

ఆస్పత్రుల్లో కరోనా చికిత్స ఓకే..

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికత్స పట్ల 76 శాతం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. 22 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరో 2 శాతం మంది ఏమీ చెప్పలేదు. మీరు కరోనా బారినపడ్డారా? అని ప్రశ్నించగా.. 92 శాతం మంది ప్రజలు లేదనే సమాధానమిచ్చారు. 7 శాతం మంది అవునని చెప్పారు. కరోనా బారినపడినప్పుడు మీ కుటుంబాన్ని ఎక్కిడికి తీసుకెళ్లారని ప్రశ్నించగా.. 61 శాతం మంది ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రికేనని చెప్పారు. మరో 24 శాతం ప్రైవేట్ ఆస్పత్రి అని తెలిపారు. 12 శాతం మంది ఆస్పత్రికి వెళ్లలేదని వెల్లడించారు.

Recommended Video

Covid-19 Vaccination Drive : ఇది ఎన్నో యుద్ధాలతో సమానం.. PM Modi స్పీచ్ హైలైట్స్..!
కరోనాపై భారత్ పైచేయి.. మోడీ సర్కారు సక్సెస్

కరోనాపై భారత్ పైచేయి.. మోడీ సర్కారు సక్సెస్

కాగా, కరోనాను సమర్థంగా ఎదుర్కొన్న నాలుగో దేశంగా భారత్ నిలిచింది. 94 శాతంతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, 88 శాతంంతో జర్మనీ, 74 శాతంతో ఇటలీ, 73 శాతంతో భారత్ వరుసగా రెండు, మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాత యూకే, యూఎస్, జపాన్, ఫ్రాన్స్ దేశాలున్నాయి. కరోనాను ఎదుర్కొవడంలో ప్రధాని నరేంద్ర మోడీ విజయవంతమయ్యారా? అనే ప్రశ్నకు మెజార్టీ ప్రజలు అవుననే సమాధానమిచ్చారు. 2021 జనవరి నాటికి.. కరోనా కట్టడిలో మోడీ పనితీరు 23 శాతం మంది ప్రజలు అద్భుతమని చెప్పగా.. 50 శాతం మంది ప్రజలు బాగా చేశారని చెప్పారు. 18 శాతం మంది సాధారణంగా ఉందన్నారు. 7 శాతం మంది బాగాలేదన్నారు. 2 శాతం మంది ఏమీ చెప్పలేదు. ఇక, ఆగస్టు 2020 నాటికి 29 శాతం మంది అద్భుతమని, 48 శాతం బాగా చేశారని చెప్పారు. 18 శాతం మంది సాధారణమని, 5శాతం మంది బాగాలదేన్నారు. కాగా, కాగా, మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ జనవరి 2021 ఎడిషన్ కోవిడ్ -19 సంక్షోభం, మహమ్మారితో దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థపై దృష్టి పెట్టింది. సర్వే ప్రతి ఒక్కరి మనస్సులో ఉన్న ప్రశ్నను అడిగింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన తర్వాత, మీరు షాట్ తీయడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ పలు ప్రశ్నలు వేసింది.

English summary
How people's view on PM Modi's handling of pandemic changed since Aug 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X