వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియాంక గాంధీ వాద్రా: యూపీ నుంచి రాజస్థాన్‌కు కఫీల్ ఖాన్ ఫ్యామిలీ, ఇక అంతా కాంగ్రెస్ పార్టీనే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జైలు నుంచి విడుదలైన డాక్టర్ కఫీల్ ఖాన్, అతని కుటుంబాన్ని రాజస్థాన్ రాష్ట్రానికి క్షేమంగా చేరేందుకు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాగ్రా స్వయంగా పర్యవేక్షించారు. తమ పార్టీ ప్రభుత్వం వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు.

Recommended Video

Facebook : BJPతో బంధంపై ఫేస్ బుక్ వివరణ | ఫేస్ బుక్ VS బీజేపీ VS కాంగ్రెస్ || Oneindia Telugu
యూపీ టూ రాజస్థాన్..

యూపీ టూ రాజస్థాన్..


గురువారం రాజస్థాన్ రాజధాని జైపూర్ చేరుకున్న కఫీల్ ఖాన్ కుటుంబం ప్రియాంక వాద్రాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాజస్థాన్ రాష్ట్రంలో తాను క్షేమంగా ఉన్నట్లు భావిస్తున్నానని కఫీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చారు. మథుర నుంచి తన ప్రయాణాన్ని వివరించారు. గత డిసెంబర్‌లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో జరిగిన యాంటీ సిటిజన్ షిప్(సవరణ) చట్టంకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే విధంగా ప్రసంగం చేశారనే ఆరోపణలతో కఫీల్ ఖాన్‌ను జనవరి 29న అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం మథుర జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. కొన్ని రోజుల తరువాత, అతనిపై కఠినమైన జాతీయ భద్రతా చట్టం కింద అభియోగాలు మోపారు, కానీ, అతని ప్రసంగంఎంపిక పఠనం ఆధారంగా.. అలహాబాద్ హైకోర్టు అతని అరెస్టును "చట్టవిరుద్ధం" గా భావించింది. దీంతో జైలు నుంచి విడుదలైన కఫీల్ ఖాన్ మథుర జైలు నుంచి జైపూర్ హోటల్ వరకు సాగిన ప్రయాణాన్ని వివరించారు.

కఫీల్ ఖాన్ కోసం యూపీ సీఎంకు ప్రియాంక లేఖ..

కఫీల్ ఖాన్ కోసం యూపీ సీఎంకు ప్రియాంక లేఖ..

కఫీల్ ఖాన్.. ప్రజలకు నిస్వార్థంగా సేవ చేశారంటూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రియాంక గాంధీ వాద్రా లేఖ రాశారు. అతనికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. అంతేగాక, ఖాన్ ను విడుదల చేయాలంటూ పలు జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు కూడా చేశారు. సంతకాల సేకరణ, నిరాహార దీక్షలు, దర్గాల సందర్శన, రక్తదాన కార్యక్రమాలు చేపట్టారు.

జైలు నుంచి విడుదలైన కఫీల్ ఖాన్‌కు కాంగ్రెస్ స్వాగతం

జైలు నుంచి విడుదలైన కఫీల్ ఖాన్‌కు కాంగ్రెస్ స్వాగతం

మంగళవారం మథుర జైలు నుంచి విడులైన కఫీల్ ఖాన్‌కు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ప్రదీప్ మాథూర్ స్వాగతం పలికారు. ప్రియాంక గాంధీ వాద్రా ఆదేశాల ప్రకారం తాము ఖాన్‌కు స్వాగతం పలికి, రాజస్థాన్ సరిహద్దు వరకు ఎస్కార్టుగా వెళ్లామని తెలిపారు.
ఆ తర్వాత రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖాన్ కుటుంబానికి స్వాగతం పలికి జైపూర్ హోటల్ తీసుకెళ్లారు. ఈ హోటల్‌లో కఫీల్ ఖాన్ కుటుంబం తమకు నచ్చినంత కాలంపాటు ఉండవచ్చని యూపీ కాంగ్రస్ నేతలు తెలిపారు. యూపీలో కఫీల్ ఖాన్ క్షేమంగా ఉండలేరనే ఇక్కడికి తరలించామని యూపీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ చీఫ్ షానవాజ్ ఆలమ్ చెప్పారు. ఖాన్ ఇక్కడ ఉండటానికి కాంగ్రెస్ పార్టీనే ఖర్చంతా భరిస్తుందని చెప్పారు.

60 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యారంటూ..

60 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యారంటూ..

గోరఖ్‌పూర్ బీఆర్డీ మెడికల్ కాలేజీలో పీడియాట్రిషియన్ అయిన కఫీల్ ఖాన్‌ను 60 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యారంటూ 2017 ఆగస్టులో అరెస్ట్ చేశారు. 2018 ఏప్రిల్‌లో ఆయన జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. 2019 సెప్టెంబర్‌లో యూపీ సర్కారు ఛార్జీషీటులో ఆయనకు క్లియరెన్స్ ఇచ్చింది. దీంతో తనను వైద్య సేవలో తిరిగి నియమించాలని కోరారు. లేదంటే తాను అస్సాంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మెడికల్ క్యాంపు నిర్వహిస్తానని యూపీ సీఎంకు లేఖ రాశారు.

English summary
Congress general secretary Priyanka Gandhi Vadra has been in constant touch with Dr Kafeel Khan and his family, and helped them move to Rajasthan after his release from an Uttar Pradesh jail, also assuring them of safety under her party’s state government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X