
పునీత్ ఎలా చనిపోయాడు.. అంతకుముందు రాత్రి ఏం జరిగింది.
పునీత్ రాజ్ కుమార్ మృతి ప్రతీ ఒక్కరినీ కలచివేస్తోంది. అయితే ఆయన ఎలా చనిపోయాడు. ఆస్పత్రికి తీసుకెళ్లే లోపు మరణించాడా.. రకరకాలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విక్రమ్ హాస్పిటల్లో పునీత్ రాజ్‌కుమార్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించిన కార్డియాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్ నాయక్ చనిపోయే ముందు ఏం జరిగింది? అనే విషయాలను తెలియజేశారు. ఉదయం లేచిన తర్వాత పునీత్ రాజ్‌కుమార్ ఎప్పటిలాగే వర్కవుట్ కోసం జిమ్‌కి వెళ్లాడు. అక్కడ ఆరోగ్యంలో తేడాగా అనిపించింది. వెంటనే పక్కనే ఉన్న ఫ్యామిలీ డాక్టర్ రమణ వద్దకు పునీత్ వెళ్లాడు.

ఈసీజీ చేయగా..
అక్కడ ECG చేయగా.. గుండెపోటుగా తేలింది. వెంటనే పునీత్‌ని విక్రమ్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే గుండె పనిచేయలేదు. దాదాపు 3 గంటల పాటు వెంటిలేటర్‌పై ఉంచి, గుండెకు మసాజ్ చేసి, శాయశక్తులా ప్రయత్నించాము. అయితే, ఆరోగ్యం బాగుపడలేదు. చికిత్సకు పునీత్ శరీరం సహకరించలేదు. గుండెపోటు వచ్చినప్పుడు గుండె చాలా బలహీనంగా ఉంది. బిగ్ హార్ట్ ఎటాక్ కావడంతో మేము గుండె ఆపరేషన్‌కు సంబంధించిన వైద్య విధానాలను చేయలేకపోయాము. మసాజ్ చేసిన తర్వాత వెంటిలేటర్లో ఉంచి, మందులు ద్వారా శరీరంలో కదలికలు మారతాయో? లేదో? చూస్తూ ఉన్నాము. కానీ, స్పందన లేదు. అయితే, గతంలో ఎప్పుడూ కూడా పునీత్‌కి గుండెకు సంబంధించిన సమస్య రాలేదని చెబుతున్నారు.

అంతకుముందే ఛాతీలో నొప్పి
మరోవైపు పునీత్ ఆరోగ్యం గురించి ఆయన ఇంటి వాచ్ మెన్ కీలక అంశాలు వెల్లడించారు. ఆ ముందు రోజు పునీత్ డిన్నర్ కోసం తాజ్‌కు వెళ్లారని పేర్కొన్నారు. రాత్రి 12, 12.30 గంటలకు వచ్చారని వివరించారు. రాత్రే ఛాతీలో నొప్పి వచ్చిందని తెలియజేశారని వివరించారు. అలా పడుకొని.. ఉదయం వర్కవుట్ చేశారని తెలిపారు. అలా వర్కవుట్ చేసి.. జిమ్‌లోనే కుప్పకూలిపోయారని వివరించారు. ఆస్పత్రికి తరలించే సమయంలో.. మార్గమధ్యలో చనిపోయారని తెలిపారు.

నగదు ఆఫర్
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుమారుడు పునీత్. చిన్న కుమారుడు అయినా.. బాల్య నటుడిగా కూడా నటించారు. రాజ్ కుమార్ కిడ్నాప్ అయిన సమయంలో వీరప్పన్ బృందంతో పునీత్ చర్చలు జరిపారని అంటారు. పెద్ద మొత్తంలో నగదు కూడా ఆఫర్ చేసినట్టు సమాచారం.