వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ చెర నుంచి అభినందన్ ను విడిపించడం ఎలా ? మన ముందు ఉన్న ఆప్షన్లు ఏంటీ ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : పాక్ చెరలో చిక్కిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను సురక్షితంగా కాపాడటం ఎలా ? రాజకీయంగా జరిపే చర్చలతో సాధ్యమవుతోందా ? దౌత్యం ద్వారా సమస్య కొలిక్కి వచ్చే అవకాశం ఉందా ? అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా రంగంలోకి దిగితే భరతమాత ముద్దుబిడ్డకు స్వేచ్చ వాయువులు సాధ్యమవుతాయా అనే ప్రశ్నలు సామాన్యుడి మదిలో మెదులుతున్నాయి. ఇంతకీ వర్ధమాన్ ను పాకిస్థాన్ నుంచి విడిపిచండం ఎలా ? వన్ ఇండియా ప్రత్యేక కథనం.

దౌత్యమే మార్గం

దౌత్యమే మార్గం

ఉగ్ర మూకల దాడుల వెనుక ఉన్నది పాకిస్థానేనని ప్రపంచం నమ్ముతుంది. పాకిస్థాన్ భూభాగంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుందని విశ్వసిస్తోంది. పుల్వామాలో ఉగ్ర దాడి తర్వాత అంతర్జాతీయ సమాజం పాకిస్థాన్ చెబుతున్న కట్టుకథలను నమ్మేస్థితిలో లేదు. దాడికి కౌంటర్ గా భారత్ చేసిన అటాక్ ను ప్రపంచ దేశాలు సమర్థిస్తున్నాయి. అమెరికా, రష్యా, కెనడా తదితర దేశాలు భారత్ కు అండగా నిలిశాయి. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి మద్దతు ఇస్తున్నట్టు తెలిపాయి. ఎప్పుడూ పాకిస్థాన్ ను సపోర్ట్ చేసే అమెరికా కూడా ఖండించడం కలిసొచ్చే అంశం. అలాగే డ్రాగన్ చైనా కూడా ఇండియా చర్యనే సమర్థించింది. పాకిస్థాన్ కు ఆర్థిక సహకారం చేస్తున్న డ్రాగన్ వైఖరి ఇండియాకు అనుకూలంగా మరింది. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం ద్వారా చర్చలు జరిపి .. దౌత్యం ద్వారా అభినందన్ ను విడిపించేందుకు దారులు తెరిచే ఉన్నాయి.

జెనీవా ఒప్పందం

జెనీవా ఒప్పందం

మన ముందు ఉన్న మరో ఆప్షన్ జెనీవా ఒప్పందం. ఇదివరలో జరిగిన యుద్ధం నేపథ్యంలో ఇరుదేశాల మధ్య జెనీవాలో ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ఓ దేశ జవాను మరో దేశానికి చిక్కితే వారం రోజుల్లో అప్పగించాలనే నియమం విధించారు. యుద్ధం జరగడం, యుద్ధం కోసం సన్నద్ధమయ్యే పరిస్థితిలో ఈ నిబంధన వర్తిస్తోంది. అలా అప్పగించని పక్షంలో యుద్ధం ప్రారంభమైనట్టు భావించాల్సి ఉంటుందని .. ఈ ఒప్పందంలో పొందుపరిచారు. అభినందన్ ను విడిపించేందుకు జెనీవా ఒప్పందం మరో అవకాశం అనే వాదనలు వినిసిస్తున్నాయి. ఈ ఒప్పందంలో ఉన్న చివర నియమాల వల్ల పాకిస్థాన్ తలొగ్గే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

రంగంలోకి రష్యా, ఐక్యరాజ్యసమితి ?

రంగంలోకి రష్యా, ఐక్యరాజ్యసమితి ?

మూడురోజుల నుంచి సరిహద్దులో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో యుద్ధ వాతావరణం నెలకొంది. శాస్త్ర, సాంకేతిక పరిజానం విశేషంగా పెరిగి .. అణుబాంబుల తయారీ నేపథ్యంలో యుద్ధం వస్తే ఆపారనష్టం వాటిల్లుతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం రష్యా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పాకిస్థాన్ తో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించింది. అమెరికా తర్వాత బలమైన రష్యా .. చర్చలకు తాము సిద్ధమని తెలుపడం ఊరట కలిగించే అంశం. అన్నీ అనుకూలించి పాకిస్థాన్ తో రష్యా .. చర్చలు జరిపితే ఫలప్రదమయ్యే అవకాశాలు ఉన్నాయి. రష్యా తర్వాత ఐక్యరాజ్యసమితి కూడా ఎంట్రీ ఇచ్చింది. పాక్ కు చిక్కిన అభినందన్ ను విడిపించేందకు చర్చలు జరుపుతామని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో ప్రకటించారు. యూఎన్ లో సభ్యదేశమైనా పాకిస్థాన్ .. చీఫ్ సెక్రటరీ ముందుకొచ్చి చర్చలు జరిపితే తప్పకుండా వినాలి. లేదంటే అంతర్జాతీయ సమాజంలో ఆ దేశాన్ని ఏకాకి చేసి .. అన్నివిధాలుగా ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా, యూఎన్ రంగంలోకి దిగి చర్చలు జరిపితే అభినందన్ విడుదల తేలికే అనే చర్చ జరుగుతోంది.

లోకేషన్ గుర్తించి దాడి చేయడం ?

లోకేషన్ గుర్తించి దాడి చేయడం ?

ఇది చివరి ఆప్షన్. దౌత్య, జెనివా, రష్యా, యూఎన్ చర్చలు జరిపినా పాకిస్థాన్ వైఖరిలో మార్పు రాదనుకుంటే భారత్ యుద్ధ క్షేత్రంలోకి అడుగిడాల్సిందే. భింబేర్ జిల్లాలోని హోరాన్ గ్రామంలో దిగిన అభినందన్ ను .. పాక్ మిలిటరీ అరెస్ట్ చేసింది. యుద్ధ ఖైదీగా చూస్తోందని .. అభినందన్ ఉన్న వీడియోలు పంపిస్తోంది. ఆ లోకేషన్ గుర్తించాల్సి ఉంటుంది. జీపీఎస్ పరిజానం ద్వారా సులభమే అవుతోంది. కానీ అతను ఉండే ప్రాంతాన్ని తరచూ మారుస్తూ ఉంటే మాత్రం ఇబ్బందులు ఏర్పడుతాయి. పకడ్బందీగా అభినందన్ ఉన్న ప్రాంతాన్ని గుర్తిస్తే చాలు .. వెంటనే వాయుసేన రంగంలోకి దిగి క్షేమంగా కాపాడొచ్చు. ఆ తర్వాత దయాది పాకిస్థాన్ ఎలాగూ ఊరుకోదు కాబట్టి .. అప్పటికే అసేతు హిమాచలంపై మొహరించిన భారత సైనికులు తమ అస్త్రాలతో సిద్ధమైతే ... రక్షణపరంగా తమతో ఏ మాత్రం పోటీకిరాని పాకిస్థాన్ నిమిషాల్లో తోకముడవాల్సిందే. కానీ అమెరికా, రష్యా సహా ఐక్యరాజ్యసమితి అలాంటి పరిస్థితి తీసుకురాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

English summary
Is it possible that the IAF Wing Commander, who has been caught in Pakistani politics, Is there a chance to come to Calicut due to diplomacy? The world believes that behind Pakistani attacks. It believes that terrorists will be trained in Pakistan territory. After the terrorist attack in Pulwama, international community does not believe in Pakistan. World nations are defending India's attack as counter to the attack. America, Russia, Canada and other countries have come to India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X