వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జాతీయ విద్యా విధానంపై ఆర్ఎస్ఎస్ ముద్ర - 60 శాతం సూచనలు సంఘ్ సంస్థలవే

|
Google Oneindia TeluguNews

దేశంలో 34 ఏళ్ల తర్వాత విద్యారంగంలో కీలక మార్పులు చేసేందుకు మోదీ సర్కార్ నడుం బిగించింది. విద్యార్థులు సమగ్రంగా వికాసం చెందేలా భారతీయ విలువలకు పెద్దపీట వేస్తూ కస్తూరి రంగన్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. నూతన విద్యా విధానం-2020కు సంబంధించి వెలువడిన డ్రాఫ్టును అందరికంటే ముందుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), దాని అనుబంధ సంస్థలు ఘనంగా స్వాగతించాయి. కొత్త విద్యావిధానంలో పేర్కొన్నవాటిలో 60 శాతానికి పైగా సూచనలు తాము చేసినవేనని ఆయా సంస్థలు బాహాటంగా అంగీకరించాయి.

 షాకింగ్: కరోనా సోకిన తొలి శునకం మృతి - రక్తపు వాంతులతో దారుణంగా - అమెరికాలో నిమిషానికో మరణం షాకింగ్: కరోనా సోకిన తొలి శునకం మృతి - రక్తపు వాంతులతో దారుణంగా - అమెరికాలో నిమిషానికో మరణం

60 ఏళ్ల ప్రయత్నం..

60 ఏళ్ల ప్రయత్నం..

సంఘ్ పరివార్ లో బీజేపీ రాజకీయ దళమైతే, ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక గురువుగా వ్యవహరిస్తుందన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో మోదీ సర్కార్ రెండో టర్మ్ మొదలైన తర్వాత.. బీజేపీ మాతృసంస్థలు విప్లవాత్మక మార్పులుగా భావించే ఒక్కో అంశాన్ని వరుసగా చేపడుతూ వస్తున్నారు. భారతీయ విద్యా వ్యవస్థ దేశ నిర్మాణానికి సాధనంగా ఉండాలని ఆర్ఎస్ఎస్ తొలి నుంచీ వాదిస్తోంది. 60 ఏళ్ల పోరాటం తర్వాతగానీ ఎన్ఈపీ-2020 రూపంలో దాని కల నెరవేరినట్లయింది. విద్యార్థులకు ఏం బోధించాలి? ఎలా బోధన చేయాలి? అందులో తల్లిదండ్రుల పాత్ర ఏంటి? లాంటి విషయాల్లో తాము చేసిన సూచనలకే ప్రాధాన్యం దక్కిందని పరివార్ నేతలు అంటున్నారు.

సోము వీర్రాజు vs సుజనా చౌదరి - రాజధానిపై సంచలన వ్యాఖ్యలు - బీజేపీ చీఫ్‌తో ఎంపీ విభేదంసోము వీర్రాజు vs సుజనా చౌదరి - రాజధానిపై సంచలన వ్యాఖ్యలు - బీజేపీ చీఫ్‌తో ఎంపీ విభేదం

పేరు మార్పుతో మొదలు..

పేరు మార్పుతో మొదలు..


స్వాతంత్ర్యం తరువాత ‘కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ' పేరును రాజీవ్‌ గాంధీ హయాంలో ‘మానవ వనరుల మంత్రిత్వ శాఖ'గా మార్చారు. నాటి యూఎస్ఎస్ఆర్ లో అమలైన మోడల్ ఇండియాలోనూ అనుసరణీయమన్న ఉద్దేశంతో ఆయనాపని చేశారు. ఇప్పుడు మళ్లీ దీనిని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా మార్చడం ద్వారా విదేశీ ప్రభావం వదలుకున్నట్లయిందని ఆర్ఎస్ఎస్ వర్గాలు అంటున్నాయి. గతంలో ప్రధాని నరేంద్ర మోదీ, అప్పటి హెచ్చార్డీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్న కీలక సమావేశంల్లోనూ ఈ డిమాండ్ వ్యక్తం కావడం, పేరు మార్పుపై పెద్ద ఎత్తున చర్చ జరగడం తెలిసిందే.

ఆ మూడు సంస్థలు కీలకంగా..

ఆ మూడు సంస్థలు కీలకంగా..

కేంద్ర కేబినెట్ ఆమోదించిన నూతన విద్యా విధానానికి సంబంధించి ఆర్ఎస్ఎస్ అనుబంధంగా పని చేసే మూడు సంస్థలు భారతీయ శిక్షణ్ మండల్(బీఎస్ఎం), శిక్షా సంస్కృతి ఉథ్థన్ న్యాస్(ఎస్ఎస్‌యూఎన్), భారతీయ భాషా మంచ్(బీబీఎం) కీలక భూమిక పోషించాయి. విద్యా విధానంలో మార్పులకు సంబంధించి ఈ మూడు సంస్థలు దేశ వ్యాప్తంగా వేల కొద్దీ సెమినార్లు, చర్చలు నిర్వహించాయి. విద్యావేత్తలు, తల్లిదండ్రులతోనూ వందల సంఖ్యలో సభలు, సమావేశాలు నిర్వహించాయి. ఎన్ఈపీ డ్రాఫ్టింగ్ కోసం ఏర్పాటైన కస్తూరి రంగన్, సుబ్రమణ్యం కమిటీలకు ప్రతి చిన్న అంశంలో రిప్రెజెంటేషన్లు ఇచ్చాయీ సంస్థలు. అంతేకాదు, ప్రస్తుత, మాజీ హెచ్చార్డీ మంత్రులైన పోఖ్రియాల, జవదేకర్ లు నిత్యం ఆర్ఎస్ఎస్ కార్యనిర్వాహకులతో టచ్ లో ఉంటూ, బీజేపీ పాలిత రాష్ట్రాల విద్యా శాఖ మంత్రుల నుంచి ఎప్పటికప్పుడు ఇన్ పుట్స్ తెప్పించుకుంటూ కీలకంగా వ్యవహరించారని వెల్లడైంది.

భారతీయ విలువలకు పట్టం..

భారతీయ విలువలకు పట్టం..

అమ్మ భాషకు అధిక ప్రాధాన్యం కల్పించాలన్నది నూతన జాతీయ విద్యా విధానంలో సంఘ్ సాధించిన గొప్ప విజయమని, ఈ పరిణామంతో భారతీయ విలువలకు పట్టం కట్టినట్లవుతుందని శిక్షా సంస్కృతి ఉథ్థన్ న్యాస్(ఎస్ఎస్ యూఎన్) జాతీయ కార్యదర్శి అతుల్ కొఠారియా అన్నారు. 1984 నాటి విద్యావిధానం పెద్ద అగాధానని సృష్టించిందని, కరికులంలో భారతీయ విలువలను పూర్తిగా విస్మరించి, ఎక్స్‌ట్రా కరికులర్ అంశాలను జొప్పించారని ఆక్షేపించారు. ఎన్ఈపీ-2020లో భారతీయ విలువలు, కళలు, భాషలు, సంస్కృతికి పట్టం కట్టడం ద్వారా పాత పద్ధతులు రూపుమాసిపోనున్నాయని కొఠారియా వ్యాఖ్యానించారు.

నైతిక విలువలే ప్రధానంగా..

నైతిక విలువలే ప్రధానంగా..

‘‘నైతిక విలువలు లేకుండా ఏ విద్యావ్యవస్థ విజయవంతం కాదు. కొత్త విధానం భారతదేశ స్వాభావికమైన నైతిక విలువలపై నిర్మితమవుతుంది. పురాతన గ్రంథాలు, సాంస్కృతిక పద్ధతులను నేర్చుకుంటారు. అన్నింటికంటే ప్రధానంగా విద్యార్థులు.. ప్రాథమిక హక్కులతోపాటు నైతిక విధులూ అలవర్చుకోవాల్సి ఉంటుంది. భారతీయత కేంద్రంగా కొత్త విధానం ఉంటుంది'' అని అతుల్ కొఠారియా అంటారు. ఆసక్తికరంగా, ఆర్ఎస్ఎస్ అధికారిక వెబ్ సైట్ లో ఉండే ‘విజన్ అండ్ మిషన్' లోనూ దాదాపు ఇవే అంశాలుంటాయి. ‘‘మన విద్యా వ్యవస్థ ఎంతగా పరాయీకరణకు లేదా జాతీయవాద స్పృహ లేకుండా తయారయిందంటే.. కనీసం దేశ విభజన లాంటి మహోత్పాతాన్ని కూడా ఇక్కడి ఉన్నతవర్గాలు తేలికగా తీసుకునేంతగా''అని విజన్ అండ్ మిషన్ లో రాసుంటుంది.

పాఠ్యాంశాలపైనా ప్రభావం..

పాఠ్యాంశాలపైనా ప్రభావం..


జాతీయ విద్యా విధానం-2020 డ్రాఫ్టులో పేర్కొన్న 60 శాతానికిపైగా అంశాలు తాము సూచించినవేనని సంఘీయులు అంగీకరిస్తున్నారు. ఇంతటిలో పని ముగిసినట్లుకాదని, రాబోయే కాలంలో బోధించబోయే పాఠ్యాంశాలు, బోధనా పద్ధతులు, అభ్యాసనా ప్రక్రియలపైనా తాము దృష్టి పెట్టామని, కేంద్రం ఫైనల్ బిల్లును రూపొందించే నాటికి రిప్రెజెంటేషన్లు ఇస్తామని సంఘ్ సంస్థలు తెలిపాయి. పౌరులకు హక్కుల కంటే విధుల పట్ల, దేశం పట్ల మరింత బాధ్యత పెంపొందించేలా సిలబస్‌లో మార్పులపై సలహాలు ఇస్తామని కొఠారియా లాంటి నేతలు అంటున్నారు.

భగవత్ మాటా అదే..

భగవత్ మాటా అదే..


భారతదేశమే కేంద్రీకృతంగా విద్యా విధానం ఉండాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొంటుండగా, పాత విద్యా విధానం రెజిమెంటలైజేషన్(మూస పద్ధతుల్ని) ప్రోత్సహించిందని, దాని స్థానంలో రాబోయే కొత్త విద్యా విధానంలో ఫ్లెక్సిబులిటీ వల్ల పిల్లలు భవిష్యత్తులో ఉపాధి పొదడానికి వీలుంటుందని ఆర్ఎస్ఎస్ కే చెందిన సీనియర్ నేత సునీల్ అంబేద్కర్ చెబుతున్నారు. ఇప్పటిదాకా కొనసాగిన హెచ్చార్డీ శాఖ.. సర్వశిక్ష అభియాన్, విద్యా హక్కు లాంటి కార్యక్రమాలు చేపట్టగా, రాబోయే కాలంలో ‘కేంద్ర విద్యా శాఖ'.. ‘భారతీయ జాతీయ విలువలు, అందులో విద్యార్థుల నిర్మాణాత్మక పాత్ర'ను హైలైట్ చేయబోతోందనే వాదన వినిపిస్తోంది.

Recommended Video

Pawan Kalyan Responds On Nagababu Controversial Comments On Nathuram Godse
ఆచితూచి మోదీ అడుగులు..

ఆచితూచి మోదీ అడుగులు..

విద్యా విధానంలో మార్పులకు సంబంధించి మాతృ సంస్థ, దాని అనుబంధ సంఘాల నుంచి వెల్లువలా వచ్చిన వినతుల విషయంలో మోదీ సర్కారు ఆచితూచి వ్యవహరించింది. అచ్చుగుద్దినట్లు అన్నిటినీ అంగీకరించుకుండా, సంఘ్ కు ఇష్టంలేని కొన్ని అంశాల్లో ధైర్యంగా ముందడుగు వేసింది. ప్రధానంగా విదేశీ విశ్వవిద్యాలయాలకు దేశంలో అవకాశం కల్పించరాదని స్వదేశీ జాగరణ్ మంచ్ లాంటి సంస్థలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా, కేంద్రం పట్టించుకోలేదు. తప్పనిసరి హిందీ భాషపై చాలా రాష్ట్రాల్లో ఆగ్రహావేశాలు, నిరసనలు వ్యక్తం కావడంతో దాన్ని తెలివిగా తప్పించేసింది. ‘‘నూతన విద్యా విధానం ద్వారా మోదీ సర్కార్ ఆర్ఎస్ఎస్ అజెండాను అమలు చేస్తోంది'' అని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తుండగా.. ‘‘ఆర్ఎస్ఎస్ అజెండా ఏమిటి? దేశంలో విద్యా వ్యవస్థ ప్రయోజనకరంగా ఉండాలని ఆ సంస్థ కోరడం లేదా? దేశానికి జరిగే మంచి గురించి మాట్లాడటం తప్పు కాదే?'' అంటూ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఎదురు ప్రశ్నించారు.

English summary
The RSS, ideological parent of the BJP, has finally had its say in formulation of a new education policy. From the name change of the ministry to emphasis on culture, morals, citizenship and regional languages, the RSS influence can be seen all over the NEP 2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X