వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Ayodhya verdict: ఊహాజనితం కాదు! అయోధ్య తీర్పులో ఆర్కియాలజీ నివేదిక ఎలా కీలకమైందంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడంలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) ఇచ్చిన నివేదకలు కీలకంగా వ్యవహరించిందని చెప్పవచ్చు. ఏఎస్ఐ ఇచ్చిన నివేదికలను ఊహాజనితమంటూ కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.

అక్కడ మరో నిర్మాణం..

అక్కడ మరో నిర్మాణం..

వివాదాస్పద భూమిలో బాబ్రీ మసీదు నిర్మాణం కంటే ముందు, ఆ అడుగు భూ భాగంలో ఒక నిర్మాణం ఉండేదని ఏఎస్ఐ కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొంది. ఆ నిర్మాణానికి సంబంధించిన ఆధారాలు కూడా లభ్యమయ్యాయని, అవి ముస్లింలకు సంబంధించిన నిర్మాణాలకు చెందినవి కావని వెల్లడించింది.

ముస్లింలకు సంబంధించినది కాదు..

ముస్లింలకు సంబంధించినది కాదు..

బాబ్రీ మసీదును మాత్రం ఖాళీ స్థలంలో కట్టలేదని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఆ మసీదు నిర్మాణం కింద మరో నిర్మాణం ఉందని తెలిపింది. ఆ నిర్మాణపు ఆనవాళ్లు ముస్లింలకు సంబంధించినవి కావని వెల్లడించింది. భూమిలో ఉన్న ఆ నిర్మాణం 12వ శతాబ్ధంనకు చెందినదిని తెలిపింది. అది ఏ మందిరానికి చెందినదనే విషయం మాత్రం స్పష్టం కాలేదని చెప్పింది. ఏఎస్ఐ ఇచ్చిన నివేదికలోని అంశాలను సుప్రీంకోర్టు తీర్పు సమయంలో పరిగణలోకి తీసుకుంది. బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించలేదని, అంతకుముందు అక్కడ ఓ నిర్మాణం కూడా ఉందని వెల్లడించింది. అక్కడ ఉన్న నిర్మాణంపైనే మరో నిర్మాణం జరిగిందని తెలిపింది.

సాధారణ అభిప్రాయాలు తీసుకోలేం..

సాధారణ అభిప్రాయాలు తీసుకోలేం..

ఏఎస్ఐ నివేదికను సందేహించాల్సిన అవసరం లేదని, నివేదికలను అంశాలను కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలహాబాద్ హైకోర్టు తరపున 2003లో రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూమిపై పురవాస్తు శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చారని, వాటిని సాధారణ అభిప్రాయాలుగా తీసుకోలేమని స్పష్టం చేసింది. హిందూ మందిరాన్ని పడగొట్టి బాబ్రీ మసీదును నిర్మించారనే ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు కోర్టు కమిషనర్ ద్వారా ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపాలని ఆర్కియాలజీ ఆఫ్ ఇండియాకు 2202లో ఆదేశాలు జారీ చేసింది. నిజానిజాలు తేల్చాలని కోర్టు ఏఎస్ఐకి స్పష్టం చేసింది.

బయటపడిన విగ్రహాలు.. స్తంభాలు..

బయటపడిన విగ్రహాలు.. స్తంభాలు..

ఈ నేపథ్యంలోనే ఏఎస్ఐ వివాదాస్పద భూమిలో తవ్వకాలు జరిపింది. బాబ్రీ మసీదు కింద ప్రాంతంలో విగ్రహాలు, స్తంభాలు, ఇతర భారీ నిర్మాణాలు బయటపడ్డాయని ఏఎస్ఐ కోర్టుకు తెలిపింది. కాగా, ఓ ముస్లిం వర్గం మాత్రం ఏఎస్ఐది ఒక సాధారాణ అభిప్రాయంగా తీసుకోవాలని కోరింది. అయితే, పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోధించి వాస్తవాలను బయటికి తీశారని, వారిచ్చిన నివేదకలను సాధారణ అభిప్రాయాలుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది. ఆ ధర్మాసనంతో ప్రధాన న్యాయమూర్తితోపాటు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, డీవై చంద్రఛూడ్, అశోక్ భూషణ్, ఎస్ అబ్దుల్ నజీర్ ఉన్నారు. హైకోర్టు నియమించిన కమిషన్ పర్యవేక్షణలోనే పురవాస్తు నిపుణులు తవ్వకాలు జరిపారని ధర్మాసనం తెలిపింది.

సాధారణ అభిప్రాయమేనంటూ.. వాదనలు

సాధారణ అభిప్రాయమేనంటూ.. వాదనలు

అయోధ్య భూ వివాదం కేసులో ఇరువర్గాల సంబంధించిన ఆరోపణలకు, వాదనలకు ఆధారాలు లేవని, సాక్ష్యాధారాలు కూడా లేవని సుప్రీంకోర్టు పేర్కొంది. సున్నీ వక్ప్ బోర్డ్ తరపున వాదించిన సీనియర్ అడ్వోకేట్ మీనాక్షి అరోరా.. ఏఎస్ఐ నివేదిక బలహీనమైన సాక్ష్యమని, అది ఓ సాధారణ అభిప్రాయమని పేర్కొంది. వివాదాస్పద భూమిలో రామ మందిరం ఉందనడానికి ఆధారాలు లేవని, నివేదికను ఆధారంగా తీసుకోవద్దని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు తుది తీర్పు..

సుప్రీంకోర్టు తుది తీర్పు..

కాగా, అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2.77 ఎకరాల వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని ఆదేశించింది. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తీర్పు చెప్పింది. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ వేర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.

మసీదు నిర్మాణానికి సున్నీ వక్ఫ్ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నిర్మోహి అఖారా వ్యాజ్యాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని తెలిపారు. నిర్ణయానికి ముందు రెండు మతాల విశ్వాసాలను పరిగణలోకి తీసుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ చెప్పారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురవాస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని పేర్కొన్నారు.

English summary
The Supreme Court while delivering the Ayodhya Verdict relied heavily on the findings by the ASI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X