వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ ఎఫెక్ట్: 2019 ఎన్నికలపై ప్రభావం, కాంగ్రెస్ ప్లాన్ ఇదే

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

గుజరాత్ BJP ఎఫెక్ట్ : 2018, 2019 ఎన్నికలపై ప్రభావం, జగన్ కి కలిసొచ్చే అంశమే !

న్యూఢిల్లీ: గుజరాత్ ఎన్నికలు 2019 పార్లమెంట్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కూడ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపుతోంది.అయితే వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో బిజెపితో కాంగ్రెస్ పోటా పోటీగా నిలిచే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు కూడ వ్యక్తమౌతున్నాయి.

గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. బిజెపి మాత్రం మరోసారి అధికారాన్ని కైవసం చేసుకొంది. కానీ, ఈ దఫా అధికారాన్ని కైవసం చేసుకోవడానికి బిజెపి తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

గుజరాత్ ఎన్నికల ప్రభావం వచ్చే ఏడాదిలో జరిగే పలు రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. దీనికి తోడు రాజకీయ పునరేకీకకరణకు కూడ అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గుజరాత్ ఎన్నికల ప్రభావం 2019 ఎన్నికలపై

గుజరాత్ ఎన్నికల ప్రభావం 2019 ఎన్నికలపై

గుజరాత్ ఎన్నికల ప్రభావం 2019 లోక్‌సభ ఎన్నికలపై కన్పించే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.ప్రధానమంత్రి మోడీ స్వంత రాష్ట్రంలో బిజెపి విజయం సాధించేందుకు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. స్వంత రాష్ట్రంలో మోడీ 15 రోజుల పాటు 31 ర్యాలీల్లో ప్రచారం నిర్వహించారు. అయితే గుజరాత్ రాష్ట్రంలో సుమారు 28 వేల కి.మీ. ప్రయాణం చేశారు.అయితే గుజరాత్ ఎన్నికల ప్రభావం 2019 ఎన్నికలపై చూపే అవకాశం ఉండనుంది.

వ్యవసాయ సమస్యలపై పోరాటాలు

వ్యవసాయ సమస్యలపై పోరాటాలు

గుజరాత్ రాష్ట్రంలో వ్యవసాయ సమస్యలపై పోరాటం ఫలితంగా గుజరాత్ ఎన్నికలపై ప్రభావం చూపుతోంది. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలో కూడ వ్యవసాయ సమస్యలను ప్రస్తావించాల్సిన అనివార్య పరిస్థితులు కూడ నెలకొన్నాయి. గుజరాత్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి దోహదపడ్డాయి.మరో వైపు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో రాజకీయాలకు అతీతంగా సినీనటులు రైతుల సమస్యలకు మద్దతునుప్రకటించారు. అయితే 2019 ఎన్నికల్లో ఈ సమస్యలు బిజెపికి ఇబ్బంది కల్గించే అవకాశం లేకపోలేదు.

2018 అసెంబ్లీ ఎన్నికలు 2019 సెమీ ఫైనల్

2018 అసెంబ్లీ ఎన్నికలు 2019 సెమీ ఫైనల్

2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ‌ఘడ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు 2019 పార్లమెంట్ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికల్లో వచ్చే ఫలితాలు 2019లో కేంద్రంలో ఏ ,పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాలనే విషయమై ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఆ రాష్ట్రాల్లో బిజెపికి ఇబ్బందేనా

ఆ రాష్ట్రాల్లో బిజెపికి ఇబ్బందేనా

2018లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో బిజెపికి వ్యతిరేక పవనాలు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభించే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ ఏ మేరకు వినియోగించుకొంటుందనే అంశం కూడ ఆధారపడనుంది.

ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ సయోధ్య

ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ సయోధ్య

బిజెపిని దెబ్బకొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ బిజెపి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో సయోధ్య కుదుర్చుకొనే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బలమైన ప్రాంతీయ పార్టీలతో బిజెపి దోస్తీ చేసుకోవడం రాజకీయంగా బిజెపికి ఇబ్బంది కల్గించే అవకాశాలు లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

English summary
The results for the Gujarat Assembly elections are in and after a see-saw battle, the BJP managed to retain its western bastion for the sixth time. But the Gujarat election is said to be bigger than just a simple state election and will have national ramifications.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X