• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

45 ఏళ్లు దాటాయా ? కరోనా వ్యాక్సిన్‌ కావాలా ? అర్హులా కాదా తెలుసుకోండిలా...

|

దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి కరోనా వ్యాక్సినేషన్ రెండో దశకు చేరుకుంది. ఇప్పటికే ఆరోగ్య కార్యకర్తలు, డాక్టర్లు, ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చిన కేంద్రం.. ఇవాళ్టి నుంచి వృద్ధులతో పాటు తీవ్ర వ్యాధులతో బాధపడుతూ, కరోనా సోకిన వారికి కూడా ఇవ్వబోతోంది. ఇప్పటికే వీరి వివరాలను నమోదు చేయించుకుని లబ్ది దారులను కూడా తేల్చింది. ఈ సంఖ్య 27 కోట్లుగా తేలింది. అయితే ఇందులో తమ పేరు ఉందా లేదా అనేది తెలుసుకునే విషయంలో కొన్ని ఏర్పాట్లు చేసింది. అవేంటో తెలుసుకుంటే 45 ఏళ్లు దాటిన వారు అర్హులా కాదా సులువుగా తెలుసుకోవచ్చు.

ఈ 20 కేటగిరీల్లో ఉన్నారా?

ఈ 20 కేటగిరీల్లో ఉన్నారా?

కేంద్ర ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన వారికి వారి వయస్సు నిర్ధారణ ఆధారంగా కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు ఎంపిక చేసింది. కానీ 45 ఏళ్లు దాటిన వారు తీవ్ర వ్యాధులతో బాధపడుతూ కరోనా కూడా సోకితే వారిని అర్హులుగా నిర్ణయించేందుకు కొన్ని కేటగిరీలను ప్రకటించింది. ఇందులో ఏదో ఒక కేటగిరీలో ఉంటే వ్యాక్సిన్‌ పొందవచ్చు. ఇందులో 1.గతేడాది కాలంలో హార్ట్‌ ఫెయిల్యూర్‌ అయి ఆస్పత్రి పాలైన వారికి, 2. గుండె వ్యాధుల చికిత్స తీసుకుని లెఫ్ట్‌ వెంట్రాక్యులర్‌ అసిస్ట్‌ డివైజ్‌ (ఎల్వీఏడీ) వాడుతున్న వారు, 3. ముఖ్యమైన ఎడమ జఠరిక సిస్టోలిక్ పనిచేయకపోవడం (LVEF <40%). 4. ఓ మోస్తరు లేదా తీవ్రమైన వాల్యులర్ గుండె జబ్బులు. 5. తీవ్రమైన PAH లేదా ఇడియోపతిక్ PAH తో పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు.

6. గత CABG / PTCA / MI మరియు చికిత్సపై రక్తపోటు / మధుమేహంతో కరోనరీ ఆర్టరీ వ్యాధి. 7. ఆంజినా మరియు రక్తపోటు / డయాబెటిస్ చికిత్స. 8. చికిత్సపై CT / MRI డాక్యుమెంట్ చేసిన స్ట్రోక్ మరియు రక్తపోటు / మధుమేహం. 9. చికిత్సపై పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ మరియు హైపర్‌టెన్షన్ / డయాబెటిస్ 10. డయాబెటిస్ (> 10 సంవత్సరాలు లేదా సమస్యతో) మరియు చికిత్స తీసుకుంటూ రక్తపోటు కలిగిన వారికి ఈసారి వ్యాక్సిన్‌ ఇవ్వబోతున్నారు.

 ఈ వ్యాధులున్న వారికీ వ్యాక్సిన్‌

ఈ వ్యాధులున్న వారికీ వ్యాక్సిన్‌

మరికొన్ని తీవ్ర వ్యాధులకు కూడా ఈసారి వ్యాక్సినేషన్ జాబితాలో చోటు కల్పించారు. వీరిలో 11. కిడ్నీ / లివర్ / హెమటోపోయిటిక్ స్టెమ్ సెల్ మార్పిడి చేయించుకుని స్వీకర్త / వేచి జాబితాలో ఉన్న వారికి, 12.కిడ్నీ జబ్బులతో చివరి దశలో ఉన్న వారికి, 13. నోటి కార్టికోస్టెరాయిడ్స్ / రోగనిరోధక మందులు ప్రస్తుతం వాడుతున్న వారు, 14. కణజాలాల సమస్యలతో బాధపడుతున్న వారు, 15. తీవ్ర శ్వాససంబందిత సమస్యలతో బాధపడుతూ రెండేళ్లుగా చికిత్స తీసుకుంటున్న వారు,

16. లింఫోమా, లుకేమియా, మైలోమాతో బాధపడుతున్న వారు, 17. గతేడాది జూలై తర్వాత క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న వారు, వివిధ ధెరపీలు తీసుకుంటున్న వారు, 18. సికిల్‌సెల్ వ్యాధి, బోన్‌మ్యారో సమస్యలు, అప్లాస్టిక్‌ ఎనీమియా, తలసీమియా మేజర్‌ సమస్యలు కలిగిన వారు, 19. ప్రాథమిక రోగనిరోధక శక్తి వ్యాధులు / హెచ్ఐవి బాధితులు, 20.మేధో వైకల్యం కారణంగా వైకల్యాలున్న వ్యక్తులు / శ్వాసకోశ వ్యవస్థ ప్రమేయంతో కండరాల డిస్ట్రోఫీ / యాసిడ్ దాడి / అధిక మద్దతు అవసరాలు కలిగిన వికలాంగులు / చెవిటి-అంధత్వంతో సహా బహుళ వైకల్యాలు కలిగిన వారికి ఈసారి వ్యాక్సిన్‌ ఇవ్వబోతున్నారు.

వ్యాక్సిన్‌ కావాలంటే ఇవి తప్పనిసరి

వ్యాక్సిన్‌ కావాలంటే ఇవి తప్పనిసరి

45 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ సంతకం చేసిన) మరియు ఉపాధి సర్టిఫికేట్ / అధికారిక గుర్తింపు కార్డు (ఫోటో మరియు పుట్టిన తేదీతో) కోమోర్బిడిటీ యొక్క సర్టిఫికేట్ అందించాల్సి ఉంటుంది. కోవిన్ యాప్‌లో నమోదు అయితే -విన్ 2.0 పోర్టల్ లేదా ఆరోగ్య సేతు వంటి ఇతర ఐటి అప్లికేషన్లు / లేదా భౌతికంగా పత్రాన్ని కోవిడ్ -19 టీకా కేంద్రానికి తీసుకెళితే సరిపోతుంది. లబ్ధిదారులకు తమకు నచ్చిన కేంద్రానికి వెళ్లేందుకు ఆన్-సైట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉంటుంది.

English summary
The COVID-19 vaccination drive opens up for 27 crore eligible beneficiaries for the next phase from Monday as part of which people over 60 years and those above 45 years of age with comorbidities can get the vaccine from March 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X