వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేపే అరుదైన ‘బ్లడ్ మూన్’: మనదేశంలో ఏ టైంలోనంటే?, శాస్త్రవేత్తల మాట ఇది

|
Google Oneindia TeluguNews

Recommended Video

27th July Lunar Eclipse's Day Do's & Dont's చంద్ర గ్రహణ రోజు చేయవలసిన పనులు

న్యూఢిల్లీ: జులై 27న ఏర్పడనున్న అరుదైన చంద్రగహణం నేపథ్యంలో అనేక వాదనలు వినిపిస్తున్నాయి. చంద్ర గ్రహణాన్ని ప్రత్యేక కళ్లద్దాలతో చూడాలని, లేదంటే కంటి చూపు దెబ్బతింటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు అసలు చంద్ర గ్రహణాన్ని చూసేందుకు ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు అవసరం లేదని చెబుతుంటారు. అయితే వీటిలో ఏది నిజమనేదానిపై శాస్త్రవేత్తలు, నిపుణులు వివరణ ఇస్తున్నారు.

కళ్లద్దాల అవసరం లేకుండానే..

కళ్లద్దాల అవసరం లేకుండానే..

జులై 27న రాత్రి ఏర్పడే సంపూర్ణ అరుణవర్ణ చంద్రగ్రహణాన్ని(బ్లడ్ మూన్ ఎక్లిప్స్) ఎలాంటి ప్రత్యేకమైన కళ్లద్దాలు అవసరం లేకుండానే ఆస్వాదించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

రెండు దశల్లో గ్రహణం

రెండు దశల్లో గ్రహణం

చంద్ర గ్రహణంలో సాధారణంగా రెండు దశలుంటాయనీ, తొలి దశలో చంద్రుడిలోని కొంత భాగం భూమి నీడలోకి వస్తుందని.. ఆ తర్వాత చంద్రుడు భూమి నీడలోకి పూర్తి రావడంతో సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడుతుందని వివరించారు.

తొలిసారి సుదీర్ఘ గ్రహణం

తొలిసారి సుదీర్ఘ గ్రహణం

శుక్రవారం ఏర్పడనున్న ఈ గ్రహణం 1.43గంటలపాటు కొనసాగుతుంది. ఇంతసేపు చంద్ర గహణం సంభవించడం చాలా అరుదైన విషయమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంగాకరకుడు భూమికి దగ్గరగా రావడం వల్ల గ్రహణం సమయంలో మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడని తెలిపారు.

. బ్లడ్ మూన్ ఇలా..

. బ్లడ్ మూన్ ఇలా..

గ్రహణం సందర్భంగా భూమిపై పడ్డ సూర్య కిరణాలు పరావర్తనం చెంది చంద్రుడిపై పడటంతో చందమామ అరుణ వర్ణంలో కనిపిస్తాడని, దీన్నే బ్లడ్ మూన్‌గా పిలుస్తారని చెప్పారు. శుక్రవారం గ్రహణం సందర్భంగా చంద్రుడు బ్లడ్ మూన్ రూపంలో దర్శనమిస్తాడని తెలిపారు.

భారత్‌లో చంద్రగ్రహణ సమయం: జులై 27న లైవ్

చంద్రగ్రహణం శుక్రవారం రాత్రి 10.44 గంటలకు ప్రారంభమవుతుంది. అయితే సంపూర్ణ గ్రహణాన్ని మాత్రం అర్ధరాత్రి 1 గంట సమయంలో వీక్షించవచ్చు. బ్లడ్‌ మూన్‌ను దేశవ్యాప్తంగా ఎక్కడినుంచైనా వీక్షించవచ్చు.

English summary
On July 27, the moon will turn red and darken as it passes through the shadow of Earth blocking the sun. Then, it will stay dark longer than it will during any other eclipse that will happen in the 21st century.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X