వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హౌడీ మోడీ తర్వాత సవాస్‌దీ.. బ్యాంకాగ్ వేదికగా సభ, ఇవాళ సాయంత్రమే..

|
Google Oneindia TeluguNews

హ్యుస్టాన్‌లో ప్రధాని మోడీ నిర్వహించిన సభకు విశేష స్పందన వచ్చింది. దానిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకాక్‌లో 'సవాస్‌‌దీ పీఎం మోడీ' కార్యక్రమానికి చేపడుతున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రదాని మోడీ ప్రసంగించారు. సవాస్‌దీ పీఎం మోడీ సభ కోసం ప్రవాస భారతీయులకు ఇండియన్ ఎంబసీ కూడా సహకారం అందజేసింది.

థాయ్‌లాండ్ మూడురోజుల పర్యటన కోసం ప్రధాని మోడీ శనివారం ఉదయమే బయల్దేరి వెళ్లారు. ఆగ్నేయ ఆసియా దేశాల (ఏసియాన్) సమావేశంలో మోడీ పాల్గొంటారు. దీంతోపాటు తూర్పు ఆసియా ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)లో పాల్గొంటారు. తొలుత స్వదేశీ పీఎంతో థాయ్‌లాండ్ మోడీ పర్యటన ప్రారంభమవుతుంది.

howdy modi after ‘sawasdee pm modi’ in bangkok

థాయ్‌లాండ్‌లో ఉన్న భారతీయులు, భారత రాయబార కార్యాలయం సహయం తీసుకొని 'సవాస్‌దీ పీఎం' కార్యక్రమం చేపడుతున్నారు. సవాస్‌దీ అంటే థాయ్‌లో శుభాకాంక్షలు, వీడ్కోలు అని రెండు అర్థాలు ఉన్నాయి. సవా‌స్‌దీ అనే పదం సంస్కృత పదం.. సవా‌స్‌దీ అంటే సంస్కృతంలో శ్రేయస్సు అని అర్థం వస్తోంది. సవాస్‌దీ పీఎం సభలో మోడీ గురునానాక్ దేవ్ 550వ జయంతి సందర్భంగా స్మారక నాణెం ఆవిష్కరిస్తారు.

ఆదివారం థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ వో చాతో సమావేశమవుతారు. ఏసియాన్ సదస్సులో భేటీ అవుతారని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. దౌత్యపరమైన అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వాణిజ్య సంబంధాలు, సాంస్కృతిక అంశాలు, సంబంధాల బలోపేతంపై సదస్సులో చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది.

English summary
Prime Minister Narendra Modi to address the Indian community in Bangkok at an event titled ‘Sawasdee PM Modi’ at 6pm in today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X