వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎట్ట‌కేల‌కు పెద‌వి విప్పిన పాక్..! ఎఫ్-16 పై నిజం ఒప్పుకున్న ఇమ్రాన్ ప్ర‌భుత్వం..!!

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్/హైద‌రాబాద్ : నిజాన్ని మాట్ల‌డ‌కుండా ద‌బాయింపు ధోర‌ణి చూపించే పాకిస్తాన్ ఎట్ట‌కేల‌కు ఓ నిజాన్ని అంగీక‌రించింది. నిజం నిప్పులాంటిద‌ని గ్ర‌హించి, అది ద‌హించి వేయ‌క‌ముందే అప్ర‌మ‌త్తం అయ్యింది. ఇక త‌ప్పించుకోవ‌డానికి గాని, మ‌సిపూసి మారేడు కాయ చేయ‌డానికి గాని దారులు లేక‌పోవ‌డంతో వాస్తవాన్ని ప్రపంచానికి చెప్పేసింది. ఇప్పటి వరకు పదేపదే చెప్పిన అబద్ధాలు, భారత్ అప్పగించిన సాక్ష్యాల ముందు నిలబడవన్న సంగతి గుర్తించి ఇక లాభం లేదని నిజం చెప్పేసింది. భారత్ దాడిలో తాము కోల్పోయింది ఎఫ్-16 విమానమేనని అంగీకరించింది.

<strong>కాంగ్రెస్ మానిఫెస్టో అత్యంత భ‌యాన‌కం..! ప్ర‌మాద‌క‌ర వాగ్దానాలను పొందుప‌రిచార‌న్న జైట్లీ..!!</strong>కాంగ్రెస్ మానిఫెస్టో అత్యంత భ‌యాన‌కం..! ప్ర‌మాద‌క‌ర వాగ్దానాలను పొందుప‌రిచార‌న్న జైట్లీ..!!

తునాతుక‌లైంది ఎఫ్-16..! ఒప్పుకున్న పాకిస్తాన్..!!

తునాతుక‌లైంది ఎఫ్-16..! ఒప్పుకున్న పాకిస్తాన్..!!

పుల్వామా ఆత్మాహుతి దాడి తర్వాత బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. దీనికి ప్రతీకారంగా భారత భూభాగంలోకి పాక్ యుద్ధవిమానాలు ప్రవేశించే ప్రయత్నం చేశాయి. దీనిని పసిగట్టిన భారత వాయుసేన మరోమారు పాక్‌కు ముచ్చెమటలు పట్టించింది. మిగ్-21తో వెళ్లిన ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ పాక్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చేశాడు.

త‌ప్పించుకోలేక పోయిన పాక్..! భార‌త్ కూల్చింది ఎఫ్మా-16 అని అమెరికాకు వివ‌క‌ర‌ణ‌..!!

త‌ప్పించుకోలేక పోయిన పాక్..! భార‌త్ కూల్చింది ఎఫ్మా-16 అని అమెరికాకు వివ‌క‌ర‌ణ‌..!!

ఎఫ్-16 యుద్ధ విమానాలను పలు షరతులతో పాక్‌కు విక్రయించిన అమెరికా ఉగ్రవాద నిరోధానికి తప్ప, మరో దేశంపై దాడికి వీటిని ఉపయోగించరాదని స్పష్టం చేసింది. భారత్ దాడిలో ఎఫ్-16 కుప్పకూలిన విషయం తెలిసిన అమెరికా వివరణ కోరింది. బారత్‌పై దాడికి ఆ విమానాన్ని ఎందుకు ఉపయోగించాల్సి వచ్చిందో చెప్పాలని నిలదీసింది.

 బుకాయించ‌డానికి దారి లేదు..! నిజం చెప్ప‌క త‌ప్ప‌లేదు..!!

బుకాయించ‌డానికి దారి లేదు..! నిజం చెప్ప‌క త‌ప్ప‌లేదు..!!

దీంతో చెమటలు పట్టిన పాక్, తాము వాడింది ఎఫ్-16 కాదని, చైనాతో కలిసి తాము తయారుచేసుకున్న జేఎఫ్-17 విమానమని పేర్కొంది. ఇదే విషయాన్ని పలుమార్లు పేర్కొంది. అయితే, తాము కూల్చింది ఎఫ్-16 విమానాన్నేనని భారత్ స్పష్టమైన ఆధారాలను అమెరికాకు సమర్పించింది. దీంతో తప్పించుకునే మార్గం లేని పాక్, బుకాయింపులకు స్వ‌స్తి ప‌లికి నిజాన్ని ఒప్పుకుంది.

 గ‌ఫూర్ గంద‌ళ‌గోళం..! ఎట్ట‌కేల‌కు నిజం వెళ్ల‌డి..!!

గ‌ఫూర్ గంద‌ళ‌గోళం..! ఎట్ట‌కేల‌కు నిజం వెళ్ల‌డి..!!

పాక్ సైన్యాధికార ప్రతినిధి మేజేర్ జనరల్ అసిఫ్ గఫూర్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేస్తూ.. తమ ఎఫ్-16 యుద్ధ విమానాలే భారత మిగ్‌ను కూల్చివేశాయని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 27న నియంత్రణ రేఖ వెంబడి తమ గగన తలం నుంచే దాడులు చేశామని, తాము మోహరించిన విమానాల్లో ఎఫ్-16 విమానాలు కూడా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. కాగా, అప్పట్లో ఇదే గఫూర్ తాము ఎఫ్-16 యుద్ధ విమానాలను వాడలేదని, జేఎఫ్-17 విమానాలను వాడామని పలుమార్లు స్పష్టం చేయడం తెలిసిందే..!!

English summary
The F-16 warplanes have made it clear that they should not be used for any attack on the country, except for the US terrorist resistance that has been sold to Pakistan. The US explanation for the F-16 collapses in India's attack. The reason for the explosion was to use the aircraft to attack Barat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X