వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పట్టాలు తప్పిన హౌరా-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్... పలువురికి గాయాలు

|
Google Oneindia TeluguNews

కాన్పూర్: ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్‌లో హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. 12 బోగీలు పట్టాలు తప్పడంతో పలువురికి గాయాలయ్యాయి. రూమా రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఈ ఘటన జరిగింది. అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో రైలు పట్టాలు తప్పినట్లు అధికారులు వెల్లడించారు.

హౌరా నుంచి ఢిల్లీ వెళుతున్న పూర్వా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో 13 మంది గాయపడినట్లు నార్త్ సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ అమిత్ మాల్వియా అధికారికంగా ప్రకటించారు. వారందరినీ చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఘటన జరిగిన తర్వాత వెంటనే మరో రైలును ఏర్పాటు చేసి దాదాపు 900 మంది ప్రయాణికులను తరలించినట్లు రైల్వే శాఖ తెలిపింది. రైలులోని ఎస్ 8, ఎస్ 9, బీ 1, బీ5, హెచ్ 1, ఏ1, ఏ2, ప్యాంట్రీ కార్, ఎస్ఎల్ఆర్ బోగీలు పట్టాలు తప్పినట్లు అధికారులు తెలిపారు.

Howrah-New Delhi Poorva Express derails in Kanpur,several injured

ఘటన జరిగాక సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్, సీనియర్ ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. వెంటనే రిలీఫ్ ట్రైన్‌, వైద్య సిబ్బందిని అలహాబాదు, కాన్పూరుల నుంచి రప్పించారు. మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. 1072, 9454403738, 9454401463, 9454401075, 9454400384 , 0512-23333111/112/113. పూర్వా ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పడంతో ఒక రైలును రద్దు చేయగా మరో 13 రైళ్లను దారి మళ్లించింది రైల్వే శాఖ.

English summary
Twelve coaches of the Howrah-New Delhi Poorva Express derailed near Kanpur in Uttar Pradesh early on Saturday, injuring at least 13 people, railway officials said.The train was going to New Delhi when the incident occurred near Rooma railway station under Maharajpur police station in Kanpur Nagar district around 12.50 am.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X