వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మహిళా ఆఫీసర్ స్నానం చేస్తుండగా.. రహస్య కెమెరాలతో వీడియోలు.. ఆలయ గెస్ట్‌హౌజ్‌లో అపచారం..!

|
Google Oneindia TeluguNews

చెన్నై : కొందరి పిచ్చి పరాకాష్టకు చేరుతోంది. మహిళలు స్నానం చేస్తుండగా వీడియోలు తీసి పైశాచికానందం పొందుతున్నారు కొందరు దుర్మార్గులు. మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో ఓ అటెండర్.. యువతి స్నానం చేస్తుండగా వెంటిలేటర్ నుంచి తొంగిచూసిన విషయం బయటపడింది. తాజాగా ఓ అధికారి.. ఓ మహిళా ఆఫీసర్ స్నానం చేస్తుండగా రహస్య కెమెరాలు ఫిక్స్ చేసిన ఉదంతం బయటపడింది.

ఇలా నిత్యం ఏదో చోట ఇలాంటి సంఘటనలు వెలుగుచూడటం చర్చానీయాంశమైంది. ఆడవాళ్లను గౌరవించాల్సింది పోయి వారిని ఇలా అవమానపరచడంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. అయినా కూడా ఇలాంటి అసభ్యకర ఘటనలు చోటుచేసుకోవడం గమనార్హం.

వామ్మో.. రాస 'మోహన' లీలలు.. గుంటూరు ఫారెస్ట్ అధికారి కేసులో సంచలన నిజాలువామ్మో.. రాస 'మోహన' లీలలు.. గుంటూరు ఫారెస్ట్ అధికారి కేసులో సంచలన నిజాలు

 ఇదేం పాడుబుద్ధి..!

ఇదేం పాడుబుద్ధి..!

తమిళనాడులో జరిగిన ఘటన వివాదస్పదమైంది. దేవాదాయ శాఖ అధికారి ఒకరు.. అదే శాఖకు చెందిన మహిళా ఆఫీసర్ స్నానం చేస్తుండగా వీడియోలు తీయాలని చేసిన ప్రయత్నం బయటపడింది. దాంతో ఆ శాఖ అప్రతిష్ట మూటగట్టుకున్నట్లైంది. తోటి ఉద్యోగి అని చూడకుండా.. పైగా మహిళ అధికారిని అగౌరవపరిచేలా జరిగిన ప్రయత్నం చర్చానీయాంశమైంది.

దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న మదురై చదురగిరి సుందర మహాలింగ ఆలయం బాగా ప్రసిద్ధి పొందింది. అక్కడకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుంటారు. ఆ క్రమంలో హుండీ కానుకలు కూడా బాగానే వస్తాయి. అయితే జూన్ 28వ తేదీన హుండీ కానుకలు లెక్కించేందుకు విధి నిర్వహణలో భాగంగా ఓ మహిళా అసిస్టెంట్ ఆఫీసర్ అక్కడకు వచ్చారు. మరునాడు కూడా ఉండాల్సి రావడంతో ఆ రాత్రికి అక్కడే ఉన్న వీఐపీ వసతిగృహంలో బస చేశారు.

గదిలో సెల్‌ఫోన్.. బాత్రూమ్‌లో పెన్ కెమెరా

గదిలో సెల్‌ఫోన్.. బాత్రూమ్‌లో పెన్ కెమెరా

జూన్ 29వ తేదీ ఉదయం ఆమె బాత్రూమ్‌లో స్నానం చేసి బయటకు వచ్చే సమయంలో పురుషుల వస్త్రాలు కనిపించాయి. ఆమెకు అనుమానం వచ్చి వాటిని నిశీతంగా పరిశీలిస్తే అందులో రెండు సెల్‌ఫోన్లు బయటపడ్డాయి. అందులో ఒక సెల్‌ఫోన్ ఆమెను వీడియో తీసేలా ఫిక్స్ చేసి ఉంది. తీరా ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని చూడగా కెమెరా ఆన్ చేసి ఉన్న విషయం తెలిసింది.

దాంతో ఆమె అనుమానం బలపడి బాత్రూమ్‌లోనూ చెక్ చేశారు. అక్కడ కూడా పెన్ కెమెరాలు అమర్చి ఉన్నాయి. అయితే అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయిన సదరు మహిళా అధికారి ఇంటికి వెళ్లాక తన ల్యాప్‌టాప్‌లో ఆ కెమెరాల్లోని మెమొరీ కార్డులు వేసి చూశారు. అందులో తనతో పాటు మరో మహిళా ఉద్యోగి స్నానం చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి.

 చివరకు అడ్డంగా బుక్కయ్యాడుగా..!

చివరకు అడ్డంగా బుక్కయ్యాడుగా..!

ఆ వీడియోలు చూసి షాక్ తిన్నారు ఆ ఆఫీసర్. వెంటనే చెన్నైలో ఉండే దేవాదాయ శాఖ కార్యాలయంతో పాటు మదురై డీఐజీకి ఫిర్యాదు చేశారు. ఆమె కంప్లైంట్‌తో రంగంలోకి దిగిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. సదరు మహిళా అధికారి బస చేసిన గది పక్కనే.. మరో గదిలో బస చేసిన ఉన్నతాధికారి ఆ పని చేసినట్లు గుర్తించారు. దేవాదాయ శాఖ జోనల్ జాయింట్ కమిషనర్ పచ్చయప్పన్.. ఈ పాడుపనికి పాల్పడ్డాడని తేల్చారు. దాంతో కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు.

English summary
Joint Commissioner R. Pachaippan of the Hindu Religious and Charitable Endowments Department of Madurai, was on Thursday arrested on charges of videographing women staff, including an Assistant Commissioner of the department, by leaving cameras in a bathroom at a hill top temple recently.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X