వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఎన్‌యూ హింసపై హెచ్‌ఆర్‌డీ శాఖ సమావేశం: మీటింగ్‌కు గైర్హాజరైన వీసీ

|
Google Oneindia TeluguNews

ఆదివారం జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనపై వివరణ ఇచ్చేందుకు జేఎన్‌యూ ఉన్నతాధికారులు హాజరుకావాలని హెచ్‌ఆర్‌డీ శాఖ ఆదేశాలు ఇవ్వగా ఈ సమావేశానికి వైస్ ఛాన్సెలర్ జగదీశ్ కుమార్ గైర్హాజరయ్యారు. క్యాంపస్‌లో చెలరేగుతున్న అలజడులు అలర్లకు కారణం వీసీ జగదీష్ కుమార్ అని విద్యార్థులు టీచర్లు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మీటింగ్‌ హెచ్‌ఆర్‌డీ సెక్రటరీ అమిత్ ఖరే నేతృత్వంలో జరిగింది. అయితే ఈ సమావేశానికి వీసీ హాజరుకాలేదని క్యాంపస్‌కు సంబంధించిన విషయాలను రిజిస్ట్రార్ చూసుకుంటారని తనతోనే అన్ని చెప్పినట్లు హెచ్‌ఆర్‌డీ డిపార్ట్‌మెంట్ అధికారి ఒకరు తెలిపారు.

JNU Violence:వ్యతిరేక గళాన్ని నొక్కేస్తోన్న మోడీ సర్కార్: సోనియా ఫైర్JNU Violence:వ్యతిరేక గళాన్ని నొక్కేస్తోన్న మోడీ సర్కార్: సోనియా ఫైర్

జగదీష్ కుమార్‌కు ఆర్‌ఎస్ఎస్ మద్దతు ఉందని అందుకే తాను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు హాజరుకారని యూనివర్శిటీ అధికారులు మరికొంతమంది టీచర్లు చెప్పారు. మరోవైపు సోమవారం టీచర్ల కోసం నియామకాలు జరుగుతున్న నేపథ్యంలో జగదీష్ కుమార్ బిజీగా ఉండి హాజరుకాలేకపోయారని మరికొందరు చెబుతున్నారు. పెంచిన హాస్టల్ ఫీజులకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతూ... వచ్చే సెమిస్టర్ రిజిస్ట్రేషన్స్‌ను నిలిపివేశారు. ఈ క్రమంలోనే ఆదివారం రోజున కొందరు ముఖానికి ముసుగు ధరించి క్యాంపస్‌లో బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే.

HRD calls for officials meeting over JNU violence, VC skips the meet

వైస్ ఛాన్సెలర్ జగదీష్ కుమార్ పెంచిన హాస్టల్ ఫీజును తగ్గించేది లేదంటూ భీష్మించుకుని కూర్చోవడంతో క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళనకు దిగారు.ఇక అప్పటి నుంచి విద్యార్థులకు, వీసీకి మధ్య విబేధాలు పెరుగుతూ వచ్చాయి. అంతేకాదు టీచర్ నియామకాల సందర్భంగా జగదీష్ కుమార్ పై వచ్చిన ఆరోపణలపై చర్చ జరుగుతుండగా ఆర్‌ఎస్ఎస్‌కు చెందిన వ్యక్తి ఒకరు వీసీకి మద్దతుగా నిలిచారని హెచ్‌ఆర్‌డీ శాఖలో పని చేసిన మాజీ బ్యూరోక్రాట్ గుర్తుచేశారు.

నియామకాల సందర్భంగా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపణలు వస్తున్నట్లు సమావేశంలో ప్రస్తావించగా... గతంలో కూడా ఇవి జరిగాయంటూ ఆర్‌ఎస్ఎస్‌ నేత చెప్పారని ఆ బ్యూరోక్రాట్ చెప్పారు. గతంలో లెఫ్ట్ భావజాలం ఉన్న నాయకులు తమకు ఇష్టమొచ్చిన వారిని నియమించుకున్నారని ఇప్పుడు వీసీ చేయడంలో తప్పేముందని ఆ ఆర్‌ఎస్ఎస్ నేత చెప్పినట్లు గుర్తుచేశారు హెచ్‌ఆర్‌డీ శాఖలో పనిచేసిన మాజీ ఉన్నతాధికారి.

English summary
The human resource development ministry on Monday called senior JNU officials to discuss Sunday’s large-scale campus violence, allegedly led by the ABVP, but vice-chancellor M. Jagadesh Kumar was absent
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X