వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పోప్‌పై వ్యాఖ్యలు: మరో వివాదంలో హృతిక్ రోషన్

|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. భార్యతో విడాకులు, అనంతరం మరో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కోర్టు నోటీసులతో సతమతమవుతున్న హృతిక్‌.. తాజాగా మరోసారి నోటీసులు అందుకున్నాడు.

ఈసారి హృతిక్‌ ట్వీట్‌ క్రైస్తవుల మనోభావాలను గాయపరిచిందని ఆరోపణలు వినిపిస్తు్నాయి. 'మీడియా పేర్కొంటున్న అందమైన మహిళలకన్నా నాకు పోప్‌తో ఎఫైర్‌ కలిగివుండే అవకాశాలే ఎక్కువ' అని హృతిక్‌ రోషన్ ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్య వివాదానికి దారితీసింది.

క్రైస్తవుల మతగురువైన పోప్‌ను, క్రైస్తవ మతాన్ని అగౌరవ పరిచినందుకు ఇండియన్‌ క్రిస్టియన్‌ వాయిస్‌ అధ్యక్షుడు అబ్రహం మథాయ్‌ హృతిక్‌కు నోటీసులు పంపారు.

Hrithik Roshan's tweet on Pope lands him in legal soup

హృతిక్‌ పోప్‌కు రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని నోటీస్‌లో పేర్కొన్నారు. తన జీవిత భాగస్వామిగా ఎవరినైనా ఎంచుకునే హక్కు హృతిక్‌కు ఉంది కానీ, ఇలా పోప్‌ పేరును వాడుకుని మతాన్ని కించపరుస్తున్నట్లు మాట్లాడితే సహించబోమని అబ్రహం వెల్లడించారు.

సెక్షన్‌ 295ఏ కింద హృతిక్‌కు క్రిమినల్‌ నోటీసులు పంపినట్లు అబ్రహం తరపు వకీలు రిజ్వాన్‌ సిద్దిఖి తెలిపారు. హృతిక్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మరి హృతిక్ రోషన్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి.

English summary
Bollywood actor Hrithik Roshan's woes do not seem to end anytime soon. Recently caught in a legal battle with actor Kangana Ranaut over their alleged affair, Roshan has been slapped with a notice by a minority community group for his tweet on Pope Francis.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X