వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విభజన బాధించింది: బ్రహ్మ, భార్యాభర్తలు కారని..

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశం తనను బాధించిందని ఎన్నికల కమిషనర్ హెచ్ఎస్ బ్రహ్మ అన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన హెచ్ఎస్ బ్రహ్మ శుక్రవారం మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఈ మేరకు స్పందించారు.

కొద్ది రోజుల్లోనే తన ఆంధ్రప్రదేశ్ రెండు విడిపోనుందని చెప్పిన ఆయన, ఎంతో శ్రమకోర్చి తాము నిర్చించుకున్న అందమైన రాష్ట్రం విభజనకు గురవుతండటం తనకు బాధగా ఉందని బ్రహ్మ తెలిపారు.
ఎవరైనా దంపతులకు ఒక్కసారిగా మీరు భార్యాభర్తలు కారని చెబితే ఎలా ఉంటుందో ప్రస్తుత పరిస్థితి కాడా అలాగే ఉందని హెచ్ఎస్ బ్రహ్మ అభిప్రాయపడ్డారు.

HS Brahma expresses opinion on the division of AP

ఇది ఇలా ఉండగా ఇతర విషయాలపై మాట్లాడిన ఆయన, భారతీయ జనతా పార్టీ నేత అమిత్ షా ప్రసంగంలో ప్రత్యేకంగా తప్పుపట్టాల్సిందేమి లేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. అజంగఢ్‌ను ఉగ్రవాదుల స్థావరమన్నారని ఆరోపణలు రావడంతో ఈసి ఆయన ప్రసంగాన్ని పరిశీలించింది. అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన వీడియోలను తాము చూశామని, ఆయన ‘అజంగఢ్' అని మాత్రమే అన్నారని బ్రహ్మ తెలిపారు.

ఆ విషయంలో అంతకుమించి ఆయనేమీ మాట్లాడలేదని చెప్పారు. ఆయన గత వ్యాఖ్యలపై పశ్చాత్తాం వ్యక్తం చేసిన తర్వాతే మళ్లీ ప్రచారంలో పాల్గొనేందుకు అనుమతించినట్లు బ్రహ్మ చెప్పారు. ఇది ఇలా ఉండగా కార్గిల్ యుద్ధంలో ముస్లిం సైనికుల వల్లే విజయం సాధించామన్న అజంఖాన్ వ్యాఖ్యలు అతను సమర్థించుకున్నందువల్లే అతనిపై వేటు వేశామని ఈసి తెలిపింది.

English summary
Election commissioner HS Brahma on on Friday expressed his opinion on Andhra Pradesh state bifurcation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X