వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూరత్ ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో పేలుడు... భారీగా ఎగిసిపడుతున్న మంటలు...

|
Google Oneindia TeluguNews

గుజరాత్‌లోని సూరత్‌లో ఉన్న హజీరా ఓఎన్‌జీసీ ప్లాంట్‌లో గురువారం(సెప్టెంబర్ 24) తెల్లవారుజామున 3గంటలకు భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ప్లాంట్‌లో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు తర్వాత ప్లాంట్ నుంచి దాదాపు 10కి.మీ మేర ఒక రకమైన గ్యాస్ వాసన వ్యాపించింది. పేలుడు శబ్దంతో ఉలిక్కిపడ్డ సూరత్ ప్రజలు భూకంపం సంభవించిందేమోనని మొదట అపోహ పడ్డారు.

ప్లాంట్‌లో ఒకటి కంటే ఎక్కువ పేలుళ్లు సంభవించడంతోనే భారీగా మంటలు ఎగిసిపడినట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికైతే ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది అక్కడి మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Huge blast, massive fire at ONGC plant in Surat

సూరత్ ఓన్‌జీసీలో మొత్తం 24 టెర్మినల్స్ ఉన్నాయి. ప్రమాదం తర్వాత అన్ని టెర్మినల్స్‌,ప్లాంట్స్‌ను మూసివేశారు. అలాగే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సమీపంలో ఉన్న రిలయన్స్,క్రిబ్చో,ఎన్టీపీసీ,ఆదానీ,షెల్,లార్సెన్ టర్బో,గెయిల్,జీఎస్ఈజీ,జీఎస్పీసీ సహా పలు ప్లాంట్లను సైతం తక్షణం మూసివేశారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా,ఇటీవలి కాలంలో దేశంలోని పలు పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మే నెలలో వైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనలో దాదాపు 11 మంది మృతి చెందగా... దాదాపు 200 పైచిలుకు మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన తర్వాత వైజాగ్‌లోని మరికొన్ని పరిశ్రమల్లోనూ ప్రమాదాలు సంభవించాయి. అచ్యుతాపురం సెజ్‌లోని విజయశ్రీ ఫార్మా కంపెనీలో పేలుడు సంభవించి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి.

Recommended Video

Watch Gas Leakage From ONGC’s Pipeline in AP’s East Godavari

అలాగే సాయినార్ లైఫ్ సెన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లోనూ గ్యాస్ లీకేజీ ఘటన చోటు చేసుకుంది.రాంకీ ఫార్మా సిటీ,విశాఖ సాల్వెంట్ కంపెనీలోనూ పేలుళ్లు సంభవించాయి.ఇక హిందూస్తాన్ షిప్‌యార్డులో భారీ క్రేన్ కూలి 14 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.

English summary
A According to officials, multiple blasts took place at the ONGC plant, leading to the massive fire. However, the reason for the blasts is yet to be ascertained.massive fire broke out at an Oil and Natural Gas Corporation (ONGC) plant in Surat, Gujarat, in the wee hours of Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X