వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కో కరోనా రోగికి అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే షాక్ అవటం ఖాయం .. ఇది లెక్క!!

|
Google Oneindia TeluguNews

కరోనా బారిన పది దేశంలో లక్షల మంది చికిత్స పొందుతున్నారు. వీరి చికిత్స దేశానికి ఎంత ఆర్ధిక భారమో తెలిస్తే కచ్చితంగా షాక్ అవుతారు . కరోనా బారిన పడిన రోగులు దాదాపు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. కరోనా బారిన పడిన ఒక రోగికి చికిత్స చేయడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలిస్తే మీరు అవాక్కవ్వటం ఖాయం . మందులు, ఆహారం , పీపీఈ కిట్లు , ప్రత్యేక గదులు, వెంటిలేటర్లు వెరసి తడిసి మోపెడు అవుతుంది ఒక్క రోగికి అయ్యే మొత్తం ఖర్చు .

corona India update : మహమ్మారి పంజా ..గత 24 గంటల్లో 9,304 కొత్త కేసులతో బిగ్గెస్ట్ జంప్corona India update : మహమ్మారి పంజా ..గత 24 గంటల్లో 9,304 కొత్త కేసులతో బిగ్గెస్ట్ జంప్

కరోనా పాజిటివ్ రోగికి ట్రీట్మెంట్ కు ఒక రోజు అయ్యే ఖర్చు రూ .20 వేల నుంచి 25 వేలు

కరోనా పాజిటివ్ రోగికి ట్రీట్మెంట్ కు ఒక రోజు అయ్యే ఖర్చు రూ .20 వేల నుంచి 25 వేలు

కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన రోగి చికిత్సకు రోజూ రూ .20,000 నుంచి 25 వేల వరకు ఖర్చవుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు .అంటే రోగికి 14 రోజుల చికిత్సకు రూ .2,80,000 నుంచి 3,50,000 మధ్య ఖర్చవుతుందని అంచనా . సాధారణంగా, వరుసగా మూడు నుండి ఐదు పరీక్షలు చేసి ఆ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే రోగులను డిశ్చార్జ్ చేస్తారు . కొన్ని సందర్భాల్లో, ఖచ్చితమైన ఫలితం పొందడానికి ఎనిమిది నుండి పది సార్లు కూడా పరీక్షలు చెయ్యాల్సి వచ్చిందని వైద్యులు అంటున్నారు.

కరోనా లక్షణాలు కనిపించిన నాటి నుండి రోగికి వైద్యానికి ఖర్చు

కరోనా లక్షణాలు కనిపించిన నాటి నుండి రోగికి వైద్యానికి ఖర్చు

బాలీవుడ్ గాయని కనికా కపూర్ కు వరుసగా ఆరు సార్లు పరీక్షలు చేశారు. చివరి పరీక్షలో ఆమెకు నెగెటివ్ వచ్చింది. ఇక కరోనా వైరస్ కు సంబంధించిన పరీక్షకు రూ .4,500 ఖర్చవుతుంది. ఇక ఈ రేటును ప్రైవేట్ ల్యాబ్‌ల నిపుణులు మరియు ఇతరుల అభిప్రాయం విన్న తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయించింది. టెస్ట్ కిట్ ధర ఒక్కటే రూ .3,000. ఒక వ్యక్తి కరోనా పాజిటివ్ గా అనుమానం , లేదా నిర్ధారణ అయితే అతను అంబులెన్స్‌లో మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. సాధారణంగా హాస్పిటల్ అంబులెన్స్ లేదా ఒక ప్రైవేట్ వాహనంలో ప్రభుత్వ ఖర్చుతో ఆసుపత్రికి తీసుకువెళుతుంది.

వ్యక్తిగత శ్రద్ధ పెట్టి ట్రీట్మెంట్ చెయ్యాల్సిన పరిస్థితిలో ఖర్చు తడిసి మోపెడు

వ్యక్తిగత శ్రద్ధ పెట్టి ట్రీట్మెంట్ చెయ్యాల్సిన పరిస్థితిలో ఖర్చు తడిసి మోపెడు

ఐసోలేషన్ వార్డుకు తరలించిన తర్వాత, అటువంటి రోగులకు ప్రతి గదికి ప్రత్యేక మరుగుదొడ్డి ఉండాలి మరియు సాధారణంగా ఇతర పడకలు ఆ గదిలో అనుమతించబడవు. ఇక ఎంత తక్కువ లెక్క చేసినా గది అద్దె 1000 నుండి 1500వరకు ఉంటుంది . ఇక అంతే కాదు రోజూ ఆ గదిని శానిటైజ్ చెయ్యాలి . దానికి ఖర్చవుతుంది . రోగి వయస్సుతో పాటు వచ్చిన అనారోగ్యం, అలాగే బీపీ, షుగర్ , ఆస్తమా వంటి ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే, వెంటిలేటర్ అవసరం అవుతుంది. దానికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో అయితే రోజుకు 25 వేల నుండి 50 వేల రూపాయల వరకు చార్జ్ చేస్తారు.

Recommended Video

COVID-19 : 198 Types Of Corona Viruses Found In India!
ఒక్క రోగి పూర్తి ట్రీట్మెంట్ అయ్యే సరికి రూ.3.5 లక్షల రూపాయలు

ఒక్క రోగి పూర్తి ట్రీట్మెంట్ అయ్యే సరికి రూ.3.5 లక్షల రూపాయలు

ఇక వారికి పీపీఈ కిట్లు ఇవ్వాలి .ఒక ప్రామాణిక పిపిఇ కిట్ల ధర రూ .750 నుండి 1,000 మధ్య ఉంటుంది. ఇక వారికి ఇచ్చే మందుల ధర వ్యక్తికి వ్యక్తికి మారుతుంది. యాంటీబయాటిక్స్, యాంటీ విట్రియోల్ మరియు ఇతర మందులకు రోగికి పౌష్టికాహారంతో కలిపి రోజుకు 500 నుండి 1,000 రూపాయలు ఖర్చవుతుంది. ఇలా కరోనా పేషెంట్ కు ట్రీట్మెంట్ అందించటానికి రోజుకు 20నుండి 25వేల రూపాయల ఖర్చు అవుతుందని, మొత్తం ట్రీట్మెంట్ పూర్తయ్యే సరికి ఒక కరోనా రోగికి కనీసం రూ.3.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక లెక్క . అదే ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అయితే ఈ ఖర్చు 7, 50,000 రూపాయలు ఉంటుందని అంచనా . అత్యధిక వ్యయంతో కూడుకున్న వైద్యం కాబట్టే ప్రభుత్వమే కరోనా వైద్యాన్ని అందిస్తుంది.

English summary
On an average, treatment of a normal Covid-19 carrier, without ventilators or other life-saving equipment, costs between Rs 20,000 and 25,000 daily, a medical experts says.That means a 14-day treatment of a patient costs between Rs 2,80,000 to 3,50,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X