వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉత్తరాఖండ్ జలప్రళయం: 10 మంది మృతి, 170 మందికిపైగా గల్లంతు, 2 ప్రాజెక్టులు, 5 వంతెనలు

|
Google Oneindia TeluguNews

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఛమోలి జిల్లాలో భారీ వరదల కారణంగా ఇప్పటి వరకు 10 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో 170 మంది కార్మికులు, ప్రజలు ధౌలిగంగా, అలకనంద నదీ ప్రవాహంలో గల్లంతైనట్లు వెల్లడించారు. వారి కోసం సహాయక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి.

Recommended Video

#Uttarakhand ధౌలిగంగా నదిలో ఉన్నట్టుండి ఉధృతి.. 150 మంది గల్లంతు

జోషిమఠ్ వద్ద భారీగా వరద రావడంతో కార్మికులు గల్లంతైన విషయం తెలిసిందే. కొండచరియలు, హిమానీనదాలు విరిగిపడటంతో నదులలో పడటంతో ఒక్కసారిగా నీటిమట్టం పెరిగిర భారీ వరదలు సంభవించాయి. దీంతో రెండు విద్యుత్ ప్రాజెక్టులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఓ డ్యాం పూర్తిగా కొట్టుకుపోయింది.

 Huge Flood As Uttarakhand Glacier Breaks, 10 Dead, 170 Missing

వరదల కారణంగా నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి సహాయక బృందాలు. ఆర్మీ, ఐఏఎఫ్, ఎన్డీఆర్ఎస్, ఐటీబీపీ ఇతర సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటికే 16 మందిని సహాయక సిబ్బంది కాపాడారు.

వరదల కారణంగా అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. పలు ఇల్లు ధ్వంసమయ్యాయి. నదీ ప్రవాహం భారీగా రావడంతో ఐదు వంతెనలు కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు10 మంది మృతి చెందగా, ప్రాజెక్టుల వద్ద పనిచేస్తున్న 170 మంది వరకు కార్మికులు కొట్టుకుపోయారు.

భారీ వరద ఘటనపై ఇప్పటికే ప్రధాన నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఉత్తరాఖండ్ ప్రభుత్వంతో మాట్లాడారు. దేశం యావత్తు ఉత్తరాఖండ్ ప్రజలకు అండగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. గల్లంతైన వారంతా క్షేమంగా బయటపడాలని ఆకాంక్షించారు. కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించినట్లు అమిత్ షా తెలిపారు.

English summary
Chamoli, Uttarakhand: Seven people were killed and 170 are still missing, after a glacier break at Joshimath in Uttarakhand's Chamoli district triggered massive flooding of the Alaknanda and Dhauliganga rivers on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X