వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వేళ ఫడ్నవీస్‌కు చుక్కెదురు: క్రిమినల్ కేసులను విచారణ చేయమన్న సుప్రీంకోర్టు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎన్నికల వేళ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2014 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను ఈసీకి సబ్మిట్ చేసిన అఫడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారనే కేసులో బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా తీర్పును తప్పుబట్టింది అత్యున్నత న్యాయస్థానం.

అధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలుఅధికారం కోసం సెక్స్ రాకెట్.. మధ్యప్రదేశ్ స్కాండల్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

తప్పుడు తడకగా ఎన్నికల అఫిడవిట్

తప్పుడు తడకగా ఎన్నికల అఫిడవిట్

కేసును విచారణ చేసిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా , మరియు జస్టిస్ అనిరుద్ద బోస్... ప్రజాప్రాతినిథ్యం చట్టంను ఫడ్నవీస్ ఉల్లంఘించారంటూ నమోదైన కేసును విచారణ చేయాలని కిందికోర్టుకు సూచించింది. ఫడ్నవీస్‌పై రెండు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని 2014 ఎన్నికల అఫడవిట్‌లో పొందు పర్చలేదని సుప్రీంకోర్టులో సతీష్ ఊకే అనే లాయర్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణ చేసిన సుప్రీంకోర్టు పై వ్యాఖ్యలు చేసింది.

 అఫిడవిట్‌లో పెండింగ్ కేసుల ప్రస్తావన లేదు

అఫిడవిట్‌లో పెండింగ్ కేసుల ప్రస్తావన లేదు

ఇక ప్రజాప్రాతినిథ్యం చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేస్తున్న వ్యక్తి అఫడవిట్‌లో పూర్తి సమాచారం పొందుపర్చకుంటే అతనికి ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండు విధించే అవకాశం ఉందని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. అయితే ఫడ్నవీస్ తనపై పెండింగ్‌లో ఉన్న రెండు క్రిమినల్ కేసులను అఫడవిట్‌లో ప్రస్తావించలేదు. ఇదిలా ఉంటే ఫడ్నవీస్ దాఖలు చేసిన నామినేషన్ గడువు, నామినేషన్ రద్దుకు గడువు ముగిసిన తర్వాత ఈ అంశం తెరపైకి వచ్చిందని న్యాయస్థానానికి తెలిపారు ఫడ్నవీస్ తరపున వాదిస్తున్న సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీ. అయితే ఇక సమయం ముగిసినందున ఆ ప్రజాప్రతినిధిని విచారణ చేయొచ్చా లేదా అన్నదానిపై బాంబే హైకోర్టు తిరస్కరించిందని చెప్పారు.

 1996, 98లో చీటింగ్, ఫోర్జరీ కేసులు

1996, 98లో చీటింగ్, ఫోర్జరీ కేసులు

ఇక సీఎం ఫడ్నవీస్ తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేశారని అతనిపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను పొందుపర్చలేదని కేసులో పిటిషనర్ సతీష్ ఊకే తెలిపారు. దీనిపై ట్రయల్ కోర్టులో కానీ బాంబే హైకోర్టులో కానీ విచారణ జరగలేదని చెప్పారు. ఎన్నికల చట్టంను ఫడ్నవీస్ ఉల్లంఘించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు పిటిషనర్ సతీష్ ఊకే. ప్రజాప్రాతినిథ్యం చట్టంలోని సెక్షన్ 125 ఏని ఉల్లంఘించారని తెలిపారు. ఇదిలా ఉంటే ఫడ్నవీస్‌పై 1996 మరియు 1998లో చీటింగ్ మరియు ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. వీటి గురించి తన అఫడవిట్‌లో ప్రస్తావించలేదు.

English summary
Supreme court gave a shock to Maharashtra CM Fadnavis by setting a side the Bombay High Court where it had a given a clean chit in False Affidavit case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X