చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

న్యూడ్ ఫోటోలు ఇస్తేనే.. రిసెప్షనిస్టు ఉద్యోగం... సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మోసం... పట్టించిన హైదరాబాద్

|
Google Oneindia TeluguNews

సాఫ్టవేర్ కంపనీల్లో ఉద్యోగాలంటూ ఒకరు ఇద్దరు కాదు ఏకంగా 16 రాష్ట్రాల్లోని 2000 మంది యువతులను మోసగించాడు ఓ ఫేక్ సాఫ్ట్‌వేర్ కేటుగాడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కావాలంటే తనకు కావాల్సిన విధంగా ఫోటోలు కావాలంటూ అమ్మాయిలను వేధించాడు. ఉద్యోగాల్లో ఎక్కువ కాలం ఉండాలంటే ఆకర్షణీయంగా ఉండాలని యువతులను నమ్మించాడు. ఇందుకోసం యువతుల అందాలు కనబడాలే ఫోటోలు ఇవ్వాలని షరతు విధించాడు. అయితే జీవీతంలో ఉద్యోగం చేయడమే లక్ష్యంగా ఉండే కొంతమంది యువతులు మోసగాడు చెప్పినట్టు ఫోటోలో కూడ పంపించారు. దీంతో ఉద్యగం మాట అటుంచి వారిని వేధింపులకు గురి చేశాడు ఓ ఘరాణ మోసగాడు.

Hundreds of young girls cheated for jobs by a man

బెంగళూర్‌కి చెందిన ఓ ఘరాణ మోసగాడి వలలో వేలమంది యువతులు చిక్కారు. ఇలా ఒకటి కాదు రెండు దేశంలోని పదహారు రాష్ట్రాల్లోని యువతులను తన వెబ్‌సైట్ ద్వార ఆకర్షించి మోసం చేశాడు. బెంగళూరుకు చెందిన ప్రదీప్‌ అనే వ్యక్తి చెన్నైలోని టీసీఎస్‌ కంపెనీలో పని చేస్తున్నాడు. యువతులకు సంబంధించిన నగ్న చిత్రాలను సేకరించేందుకు పథకం పన్నాడు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో రిసెప్షనిస్టు ఉద్యోగాలున్నాయంటూ ఓ నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి ప్రకటనలు గుప్పించాడు.

దీంతో ఉద్యోగాలు కావాలనుకునే వారు అందంగా ఉండాలని, ఇందుకోసం ఎక్స్‌పోజ్ చేస్తూ ఫోటోలు పంపాలని ప్రకటనలు చేశాడు..దీంతో రెండువేల మంది మోసగాడికి ఫోటోలు పంపించారు. అయితే ఉద్యోగం కోసం ఇలాంటీ ఫోటోలు ఎందుకని మియాపూర్‌కి చెందిన ఓ బాధితురాలికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు చివరకు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని దగ్గర వేల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

English summary
Hundreds of young girls cheated. Hoping to find jobs in reputed companies if girls need job and then Harassed to send photos to make the whole body look attractive.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X