వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్న పార్టీకి పెద్ద ఛాన్స్.. సీఎం కుర్చీ ఆఫర్ వచ్చేనా.. కాంగ్రెస్ వ్యూహం ఏంటి?

|
Google Oneindia TeluguNews

చండీఘర్ : మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కూటమి ఆధిక్యంలో దూసుకు వెళుతుండగా.. హర్యానాలో మాత్రం వెనుకంజ వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక మహారాష్ట్రలో బీజేపీ కూటమిదే అధికారం అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తుండటంతో శివసేన సీఎం కుర్చీ మీద కన్నేసింది. ఇక హర్యానాలో మాత్రం హంగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈసారి అధికార పీఠం దక్కించుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ దిగొచ్చి.. చిన్న పార్టీకి సీఎం కుర్చీ బంపర్ ఆఫర్ ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.

హంగ్ తప్పదా.. హర్యానాలో కింగ్ మేకర్ ఎవరు

హంగ్ తప్పదా.. హర్యానాలో కింగ్ మేకర్ ఎవరు

అదలావుంటే హర్యానా పోలింగ్ ఫలితాల సరళి చూస్తే హంగ్ తప్పేలా లేదు. 90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ 46. అధికారం చేపట్టాలంటే కచ్చితంగా 46 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అయితే బీజేపీ కూటమి ప్రస్తుతం 41 స్థానాల్లో మాత్రమే లీడింగ్‌లో ఉంది. అటు కాంగ్రెస్ కూటమి 29 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అదలావుంటే ఇతరులు మరో 20 స్థానాల్లో దూసుకెళుతున్నారు. ఈ క్రమంలో హర్యానాలో హంగ్ ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

వంటేరు లక్కీ : ఆనాడు కేసీఆర్‌ను ఢీకొట్టి.. ఈనాడు పదవిని చేపట్టి..!వంటేరు లక్కీ : ఆనాడు కేసీఆర్‌ను ఢీకొట్టి.. ఈనాడు పదవిని చేపట్టి..!

మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి కష్టమేనా.. ఇతరులపై ఆధారపడటం తప్పదా?

మ్యాజిక్ ఫిగర్ బీజేపీకి కష్టమేనా.. ఇతరులపై ఆధారపడటం తప్పదా?

మ్యాజిక్ ఫిగర్ 46కు చేరువలో బీజేపీ కూటమి నిలిచిపోవడంతో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారనేది ఉత్కంఠగా మారింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చాలా తక్కువ మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఆ క్రమంలో చిన్న పార్టీల నుంచి రెబెల్స్‌గా పోటీ చేసి గెలిచినవారినో లేదంటే ఇండిపెండెంట్లుగా గెలిచినవారినో బుజ్జగించి దారిలోకి తెచ్చుకోవాలని బీజేపీ పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సరికొత్త వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. బీజేపీని కట్టడి చేయడానికి కాంగ్రెస్ పెద్దలు పావులు కదుపుతున్నారు.

జేజేపీ వైపు కాంగ్రెస్ చూపు.. సీఎం కుర్చీ బంపర్ ఆఫర్..!

జేజేపీ వైపు కాంగ్రెస్ చూపు.. సీఎం కుర్చీ బంపర్ ఆఫర్..!

మరోవైపు చిన్న పార్టీ జేజేపీని తనవైపు తిప్పుకుని.. ఆ పార్టీకి బంపర్ ఆఫర్ ప్రకటించాలని కాంగ్రెస్ భావించే అవకాశాలు లేకపోలేదు. ఆ క్రమంలో ఆ పార్టీకి ముఖ్యమంత్రి కుర్చీ ఆఫర్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఏది ఎలా ఉన్నా.. ఏ ప్రభుత్వం కొలువుదీరనున్నా.. ఇండిపెండెంట్లుగా గెలిచినవారు కీలకంగా మారనున్నారు. అయితే పూర్తి ఫలితాలు వెల్లడైతే గానీ హర్యానాలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందనే క్లారిటీ వస్తుంది.

50 ఏళ్ల హిస్టరీ మహారాష్ట్రలో రిపీట్ కానుందా.. రెండోసారి ముఖ్యమంత్రిగా..!50 ఏళ్ల హిస్టరీ మహారాష్ట్రలో రిపీట్ కానుందా.. రెండోసారి ముఖ్యమంత్రిగా..!

పోలింగ్ పర్సంటేజీ బీజేపీ కొంపం ముంచిదా

పోలింగ్ పర్సంటేజీ బీజేపీ కొంపం ముంచిదా

90 అసెంబ్లీ స్థానాలున్న హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు. అయితే ఈ నెంబర్ ఏ పార్టీకి దక్కేలా లేదు. ఫలితాల సరళి చూస్తుంటే ఏ పార్టీకైనా మ్యాజిక్ ఫిగర్ కష్టమేనన్నట్లుగా కనిపిస్తోంది తాజా పరిస్థితి. 2014 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చి చూస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్లస్ అయ్యే పరిస్థితులున్నాయి. కొన్ని సీట్లు పెరిగే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు జన్ నాయక్ జనతా పార్టీ కూడా గతంలో కంటే తన స్థానం మెరుగు పరుచుకోనుంది. 2014 ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాలు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం 15 స్థానాలకే పరిమితమైంది. మొత్తానికి ఈసారి పోలింగ్ పర్సంటేజీ తగ్గడంతోనే బీజేపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయనే టాక్ వినిపిస్తోంది.

English summary
Haryana assembly election results 2019, Hung government will be form. Then Congress trying to take over cm chair with samll party support.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X