వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎలుకలను తింటున్న బీహార్ వరద బాధితులు...! ప్రభుత్వ ఏర్పాట్లపై మండిపాటు

|
Google Oneindia TeluguNews

ఉత్తరాదిన వరదలు ముంచెత్తడంతో స్థానిక ప్రజల జనజీవనం స్థంభించడంతో పాటు పూర్తిగా జనావాసాలను కోల్పోయిన వారు అనేక అవస్థలు పడుతున్నారు. కనీసం తినడానికి తిండిలేక ,ఉండడానికి ఇళ్లులేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. రోడ్లపక్కన నివాసాలు ఏర్పరచుకుని ఎలుకలతో కడుపునింపుకుంటున్నారు.

ఇటివల బీహార్‌లో కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. దీంతో అనేక ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. తినేందుకు తిండిలేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈనేపథ్యంలోనే కథీరా ప్రాంతాంలో ఇళ్లు మునిగిపోయిన స్థానిక ప్రజలు రోడ్ల వెంట గుడారాలు వేసుకుని ఉంటున్నారు. వీరికి ప్రభుత్వం నుండి ఎలాంటీ సహాయం అందక పోవడంతో ఎలకలను పట్టుకుని తింటున్నారు.

hungry flood victims are eating rats in bihar

ప్రభుత్వం ఎలాంటీ సహాయక చర్యలు చేపట్టకపోవడంతోనే ఎలుకలు తింటున్నట్టు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తగిన ఆహర పదార్థాలు అందించాలని వారు కోరుతున్నారు. కాగా ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇది ప్రభుత్వానికి చాల అవమానకరమని విమర్శలు చేశాయి. వెంటనే ఇళ్లు నీటమునిగిన కుటుంభాలను ఆదుకోవాలని డిమాండ్ చేశాయి.

English summary
hungry flood victims are eating rats in bihar as the stagnant floodwater in the village have caused acute scarity of food materials.but it was also be selling to others
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X