వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కశ్మీర్‌పై చర్చలకు హురియత్ రెడీ .. మరోసారి కశ్మీర్ గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్ : ఏళ్లుగా నలుగుతున్న కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఆ రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ చొరవ తీసుకున్నారు. ఇటీవల ఉగ్రవాదులు తుపాకీ వీడి చర్చలు జరుపాలని కోరిన మాలిక్ .. తాజాగా కశ్మీర్ అంశంపై చర్చించేందుకు హురియత్ కాన్ఫరెన్స్ సిద్ధంగా ఉందని మరో సంచలన ప్రకటన చేశారు.

 Hurriyat Conference ready for dialogue, J&K Governor

మారిన పరిస్థితి ..
గత ఏడాది కశ్మీర్ లోయలో పరిస్థితి మారిపోయిందని ఈ సందర్భంగా ప్రస్తావించారు మాలిక్. ఇది హురియత్ కాన్ఫరెన్స్ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్యపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు హురియత్ నేతలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిపారు. ఇదివరకు కశ్మీర్ సమస్యపై ఎల్జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్ చొరవ తీసుకున్నారని గుర్తుచేశారు. 2016లో చర్చల కోసం వెళ్లిన .. హురియత్ నేతలు అంగీకరించలేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. ఎప్పుడు ఒకసారి సిచుయేషన్ మారుతూ ఉంటుందని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

పూల బోకే ఇవ్వరుగా ...
గత ఏడాది కశ్మీర్‌లో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నారు. ఆగస్టు నుంచి ఉగ్రవాదుల నియామక ప్రక్రియ నిలిచిపోయిందని తెలిపారు. అంతేకాదు శుక్రవారం ప్రార్థనల తర్వాత రాళ్లతో దాడిచేసే ఘటనలు కూడా లేవని చెప్పారు. ప్రస్తుత ఈ పరిస్థితికి ఆ దేవుడే కారణమై ఉంటారని పేర్కొన్నారు. తన హయాంలో పరిస్థితి మెరుగ్గా ఉండటం సంతోషం కలిగిస్తోందని చెప్పారు. అయితే కొన్ని ఘటనల్లో యువత చనిపోవడం బాధ కలిగించిందని చెప్పారు. అవతల వైపు నుంచి కాల్పులు జరిపితే భద్రతాదళాలు విధిగా ఫైర్ చేయాల్సి వస్తుందని గుర్తుచేశారు. అలాంటప్పుడు వారికి పూలతో ఉన్న బోకే ఇవ్వరుగా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

English summary
Jammu and Kashmir Governor Satya Pal Malik said on Saturday that the situation in the Valley had vastly improved over the past year and the Hurriyat Conference was willing to enter into a dialogue with the government. "The Hurriyat Conference was not willing to talk. Ram Vilas Paswan was standing at their door [in 2016], but they were not ready to talk," Satya Pal Malik said at a funtion. "Today, they are ready for talks and want to hold dialogue. There is a change in everyone," Satya Pal Malik added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X