వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భార్య చివరి కోరిక తీర్చిన భర్త .. జార్ఖండ్ నుండి ఉజ్జయిని వెళ్లి, భార్య బంగారం అమ్మవారికి సమర్పణ !!

|
Google Oneindia TeluguNews

భార్య మీద వల్లమాలిన ప్రేమ ఉన్న ఓ భర్త ఆమె చివరి కోరిక తీర్చడానికి చేసిన పని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రతికున్న భార్యలనే పట్టించుకోని భర్తలు ఉన్న నేటి రోజుల్లో, చనిపోయిన భార్య కోసం ఓ భర్త ఆమె కోరిక మేరకు ఆమె బంగారాన్ని అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు.

ఉజ్జయిని మహా కాళేశ్వర్ భక్తిలో జార్ఖండ్ మహిళ
వివరాల్లోకి వెళితే జార్ఖండ్ రాష్ట్రంలో బొకారో అనే ప్రాంతంలో నివాసం ఉంటున్న సంజీవ్ కుమార్, రష్మీ ప్రభ భార్యాభర్తలు. రష్మీ ప్రభకు దేవుళ్ళు అంటే వల్లమాలిన భక్తి. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ దేవాలయానికి రష్మీ ప్రభ వెళ్లి మహంకాళీ అమ్మవారిని దర్శించుకునే వారు. ఆమెకు ఉజ్జయినీ మహంకాళి అమ్మవారు అంటే విపరీతమైన భక్తి. గత కొంత కాలంగా రష్మీ ప్రభ అనారోగ్యంతో బాధ పడుతుంది. వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. రష్మీ ప్రభ మరణించింది.

Husband fulfills wifes last wish .. Goes to Ujjain from Jharkhand and donated wifes gold !!

మరణానికి ముందు భర్తను చివరి కోరిక తీర్చమన్న భార్య
మరణానికి ముందు రష్మీ ప్రభ తన చివరి కోరికను తీర్చాల్సిన భర్తను అడిగింది. తన బంగారు నగలను అమ్మవారికి సమర్పించాలని రష్మి ప్రభ భర్త సంజీవ్ కుమార్ కు తెలిపింది. దీంతో భార్య చివరి కోరిక తీర్చడం కోసం సంజీవ్ కుమార్ తన తల్లితో కలిసి మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయానికి వెళ్లి, అక్కడ ఆలయ అధికారులకు బంగారాన్ని అప్పగించి తన భార్య చివరి కోరికగా ఆ బంగారాన్ని ఇస్తున్నట్టు వెల్లడించారు. మొత్తం మూడు వందల పది గ్రాముల బరువు ఉన్న నెక్లెస్ లు, గాజులు, చెవి పోగులతో సహా సుమారు 17 లక్షల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను భార్య చివరి కోరిక తీర్చడం కోసం అమ్మవారి ఆలయానికి అందజేశాడు భర్త సంజీవ్ కుమార్.

17 లక్షలు విలువ చేసే బంగారం ఆలయానికి అందజేత .. భార్య చివరి కోరిక తీర్చిన భర్త
ఇక ఈ విషయాన్ని ఆలయ అధికారులు మీడియాకు వెల్లడించారు. భార్య చివరి కోరిక తీర్చటం కోసం భర్త చేసిన పనిని పలువురు ప్రశంసిస్తున్నారు. చనిపోయిన వెంటనే ఒంటి మీద ఉండే నగలను సైతం మాయం చేసే మనుషులు ఉన్న నేటి రోజుల్లో, బతికున్న వాళ్ళ కోసమే ఏమీ చెయ్యని వాళ్ళున్న సమాజంలో మరణించిన భార్య కోసం ఆమె నగలను మొత్తాన్ని ఉజ్జయిని మహంకాళి దేవాలయానికి విరాళంగా నివేదించడం చాలా గొప్ప కార్యం అని కొనియాడుతున్నారు. ఈ చర్యతో ఆ భర్తకు భార్య మీద ఉన్న ప్రేమ అర్ధం అవుతుందని పలువురు అంటున్నారు. భార్యాభర్తలకు అర్ధం మరచిపోతున్న వారున్న నేటి రోజుల్లో భార్య కోసం భర్త ఆమె లేని సమయంలో కూడా ఇంత పని చేశాడంటే నిజంగా అభినందించాల్సిన విషయమే.

Recommended Video

YS Jagan's Bail - Shocking Turn |Raghu Rama Krishnam Raju | CBI Court | Oneindia Telugu

జ్యోతిర్లింగాలలో ఒక్కటైన ఉజ్జయిని మహాకాళేశ్వర్ దేవాలయం
ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో రెండున్నర నెలల పాటు ఉజ్జయిని మహాకాళ్ దేవాలయాన్ని మూసి ఉంచారు. ఆ తర్వాత జూన్ 28 వ తేదీ నుండి దేవాలయాన్ని తిరిగి భక్తుల సందర్శన కోసం తెరిచి ఉంచారు. ఇక అప్పటి నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు 23.03 కోట్ల రూపాయలు దర్శనం టిక్కెట్లు, ప్రసాద విక్రయాల ద్వారా వచ్చినట్లు దేవాలయ అధికారులు చెబుతున్నారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ దేవాలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ప్రసిద్ధ జ్యోతిర్లింగం.

English summary
husband who fulfilled the wife's last wish. He went to Ujjain from Jharkhand and presented his wife gold worth Rs 17 lakh to the ujjaini mahankaleshwar temple. Everyone is praising that husband’s love for his wife.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X