• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పెళ్లి రోజు: భార్యకు బహుమతిగా ఏకంగా చంద్రుడిపై స్థలం కొనిచ్చిన భర్త

By BBC News తెలుగు
|

రాజస్తాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ధర్మేంద్ర అనీజా ఇటీవల వార్తల్లోకి ఎక్కారు.

తన భార్య సప్నా కోసం చంద్రుని మీద భూమిని కొనాలన్న తన స్వప్నాన్ని ఆయన నిజం చేసుకున్నారు.

చంద్రునిపై స్థలం కొన్న ధర్మేంద్ర అనీజా, డిసెంబర్ 24న తమ ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా భార్యకు బహుమతిగా ఇచ్చారు.

“వచ్చే వెడ్డింగ్ యానివర్సరీకి చంద్రుడి మీద స్థలం కొని నా భార్యకు బహుమతిగా ఇవ్వాలని గత ఏడాదే నిర్ణయించుకున్నా. కానీ ఇది అంత ఈజీ కాదు. చాలా అడ్డంకులు ఎదురయ్యాయి. ఎలైగైతేనేం నా కల నెరవేరింది” అన్నారు ధర్మేంద్ర.

“చంద్రుడి మీద స్థలం కొనడం సులభమైతే అందరూ కొనేవారు’’ అన్నారాయన.

చంద్రునిపై ఎక్కడ కొన్నారు?

“మా వారు నా కోసం చంద్రుడి మీద స్థలం కొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. విషయం తెలిశాక నాకు ఏడుపు ఆగలేదు. బహుశా ఈ ప్రపంచంలో ఈ బహుమతి పొందిన అదృష్టవంతురాలిని నేనే కావచ్చు” అన్నారు సప్నా అనీజా.

“సర్‌ప్రైజ్‌ గిఫ్ట్ ఏంటో ఊహించి చెప్పమని మా యానివర్సరీ కార్యక్రమంలో నన్ను అడిగినప్పుడు ఏ కారో, నగలో అనుకున్నా. కానీ చంద్రుడి మీద భూమిని కొనిస్తారని నేను ఊహించలేదు'' అన్నారు సప్నా

14.3 ఉత్తరఅక్షాంశం, 5.6 తూర్పు రేఖాంశాలలో 377, 378, 379 నంబర్ల పేరుతో చంద్రుడిపై మూడు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు ధర్మేంద్ర.

ఎవరీ ధర్మేంద్ర అనీజా?

ధర్మేంద్ర, సప్నా ఇద్దరూ అజ్మీర్‌ జిల్లాకు చెందినవారే. ఇద్దరూ ఇదే జిల్లాలో చదువుకున్నారు. కాలేజీలో కలుసుకున్న వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ధర్మేంద్ర బ్రెజిల్‌లో టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ బిజినెస్‌ చేస్తుంటారు.

ఆయన తల్లిదండ్రులు అజ్మీర్‌లో ఉంటారు. ధర్మేంద్ర గత పది నెలలుగా అజ్మీర్‌లోనే ఉంటున్నారు.

చంద్రుడు

అప్లికేషన్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ వరకు

“భూమి మీద స్థలం కొనడానికి ఒక పద్దతి ఉన్నట్లే, చంద్రుని మీద కొనడానికి కూడా ఒక విధానం ఉంటుంది. అది కాస్త సుదీర్ఘ ప్రక్రియ కూడా’’ అన్నారు ధర్మేంద్ర.

చంద్రుని మీద భూమిని కొనడానికి ఏడాది కిందటే అమెరికాకు చెందిన ఒక సంస్థ దగ్గర అప్లికేషన్‌ పెట్టుకున్నారు ధర్మేంద్ర.

ఆ సంస్థ దరఖాస్తును ఓకే చేసిన తర్వాత ఆయన చాలాసార్లు వీడియో కాన్ఫరెన్స్‌ లో పాల్గొనాల్సి వచ్చింది.

ఈ సందర్భంగా ఆయన కుటుంబం, ఆస్తిపాస్తుల వివరాలను సంబంధిత సంస్థ అధికారులు ఆధారాలతో సహా అడిగి తెలుసుకున్నారు.

ఈ ప్రక్రియకు దాదాపు సంవత్సరం పట్టింది.

“చంద్రునిపై స్థలం అమ్ముతామని చెప్పి అనేక నకిలీ కంపెనీలు నన్ను సంప్రదించాయి.

అయితే చంద్రునిపై దిగే అధికారం ఉన్న ఏకైక సంస్థ 'లూనా సొసైటీ ఇంటర్నేషనల్' మాత్రమే’’ అన్నారు ధర్మేంద్ర.

చంద్రునిపై అనేక రకాల భూములు ఉన్నాయని, అక్కడ కొనే భూమికి 1 ఏడాది నుంచి 49 ఏళ్ల వరకు యాజమాన్య హక్కులు ఉంటాయని, తాను 49 సంవత్సరాలకు ఓనర్‌ షిప్‌ రైట్స్‌ తీసుకున్నానని ధర్మేంద్ర వివరించారు.

చంద్రునిపై కొనుగోలు చేసిన భూమి మీద ఏదైనా పరిశోధన జరిగితే రాయల్టీ అందుతుందని ధర్మేంద్ర వెల్లడించారు.

ఈ భూమిని తాను ఎవరికైనా అమ్ముకోవడం, బదిలీలాంటివి చేయవచ్చునని కూడా ఆయన వివరించారు.

'వార్షికోత్సవం చంద్రుని మీదే జరిగినట్లు అనిపించింది’

వివాహ వార్షికోత్సవం చంద్రుని మీదే జరిగినట్లు తాను ఫీలయ్యానని ధర్మేంద్ర భార్య సప్నా అన్నారు.

“చంద్రుడి మీదే రిజిస్ట్రేషన్‌ పేపర్లు అందుకుంటున్నట్లు అనిపించింది. నేను చాలా అదృష్టవంతురాలిని’’ అన్నారామె.

ఈ బహుమతిని ప్రజెంట్‌ చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ధర్మేంద్ర. ఈ బాధ్యతను అజ్మీర్‌కు చెందిన ఓ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్‌ ఈవెంట్స్‌ సంస్థకు అప్పగించారు.

కార్యక్రమమంతా చంద్రుడి వాతావరణంలో జరిగినట్లు ఉండాలని ఆయన ఈవెంట్స్‌ సంస్థను కోరారు.

“చంద్రునిపై భూమిని కొన్నానని ధర్మేంద్ర చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఆయన నాకు 17 పేజీల పత్రాలను చూపించారు.

మేం ఆశ్చర్యపోతూనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం’’ అని ఈవెంట్స్‌ నిర్వాహకుడు కోసినాక్‌ జైన్ అన్నారు. “కార్యక్రమం చంద్రుని మీద ఉన్నట్లే అనిపించేలా ఉండేందుకు చాలా శ్రమపడ్డాం” అన్నారు జైన్‌.

ఎల్‌ఈడీ లైట్లతో నాలుగు అడుగులమేర మేఘాలను, చంద్రుడిని, నక్షత్రాలను రూపొందించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులు కూడా తాము చంద్రుడి మీద ఉన్న ఫీలింగ్‌ను అనుభవించారట.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Husband gifts wife land on moon on wedding day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X