బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పిల్లల ఎదుటే ప్రియుడితో.. కన్నతల్లి నిర్వాకం.. చివరికిలా..

|
Google Oneindia TeluguNews

ఆమె ఓ వివాహిత. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ఆమె మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. ఫోన్‌లో తరుచూ చాటింగ్‌, గంటల తరబడి సంభాషణలు జరిపేది. అప్పుడప్పుడు అతన్ని కలుస్తుండేది. ఆ క్రమంలో కొన్నిసార్లు పిల్లలను కూడా వెంట తీసుకెళ్లేది. పిల్లలను కాస్త దూరంలో కూర్చోబెట్టి.. వెళ్లి ప్రియుడితో ముచ్చటించేది. ఆ సమయంలో ప్రియుడికి ముద్దులు,కౌగిలింతలు ఇచ్చేది. ఇటీవల ఈ విషయాన్ని పిల్లలు వారి తండ్రితో చెప్పారు. దీంతో విడాకుల కోసం సదరు భర్త కోర్టును ఆశ్రయించాడు. ఎట్టకేలకు ఇటీవల కోర్టు అతనికి విడాకులు మంజూరు చేసింది.

అసలేం జరిగింది :

అసలేం జరిగింది :

కర్ణాటకలోని అంకోలాకు చెందిన సురేష్,దీప్తి(పేర్లు మార్చబడ్డాయిల)కు డిసెంబర్‌ 1993లో వివాహమైంది.
పెళ్లి తర్వాత ఇద్దరు కలిసి వేరు కాపురం పెట్టారు. కొన్నాళ్లకు ఒక పాప,బాబు పుట్టారు. కొన్నాళ్లు సాఫీగా సాగిన కాపురంలో అనుకోని అలజడి మొదలైంది. దీప్తికి మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి భర్తను వదిలించుకోవాలనుకుంది. ఈ క్రమంలో ఓరోజు నిద్రలో ఉన్న అతనిపై కిరోసిన్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేసింది. అయితే అతను అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది.

అప్పటినుంచి అదే పద్దతి..:

అప్పటినుంచి అదే పద్దతి..:

2005లో దీప్తి చేతికి సెల్‌ఫోన్ వచ్చింది. అప్పటినుంచి ఓ వ్యక్తితో గంటల తరబడి మాట్లాడేది. భర్త ప్రశ్నిస్తే.. ఎదురు సమాధానం చెప్పేది. ఓరోజు ఆమె సెల్‌ఫోన్‌లో 'ఐలవ్యూ,గుడ్‌నైట్ డార్లింగ్' అన్న మెసేజ్ చూసి భర్త ఉలిక్కిపడ్డాడు. గట్టిగా నిలదీశాడు. అయినప్పటికీ ఆమె ప్రవర్తనలో మార్పు రాలేదు.

పిల్లల ఎదుటే..

పిల్లల ఎదుటే..

పిల్లలు పెద్దవాళ్లవుతున్నారని కూడా ఆమె ఆలోచించలేదు. యుక్త వయసులో ఉన్న కొడుకు,బిడ్డను వెంటపెట్టుకునే ప్రియుడిని కలవడానికి వెళ్లేది. వాళ్లను కొద్ది దూరంలో కూర్చోమని చెప్పేది. ఆ సమయంలో అతనితో రొమాన్స్‌లో మునిగి తేలేది. పిల్లలు చూస్తారేమోనన్న భయం కూడా లేకుండా అతనితో నిస్సిగ్గుగా ప్రవర్తించేది.

విడాకులు మంజూరు

విడాకులు మంజూరు

పిల్లలు తండ్రితో అసలు విషయం చెప్పడంతో.. 2013లో అతను కోర్టును ఆశ్రయించాడు. విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశాడు. ఇటీవల పిల్లల వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఎట్టకేలకు అతనికి విడాకులు మంజూరు చేసింది.పిల్లల సంరక్షణను అతనికే అప్పగించింది. కమల కోర్టు తీర్పును సవాల్ చేస్తూ మరో పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది.

English summary
A womans affair was revealed to her husband by children,after that he approached court to get divorce. Recently he got divorce in this case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X