వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెళ్లాయ్యాక చదువు,గిదువు జాంతానై...! చదువుతూ... తనని పట్టించుకోవడం లేదని విడాకులు కోరిన భార్య

|
Google Oneindia TeluguNews

పెళ్లాయ్యాక తన భర్త ప్రభుత్వ ఉద్యోగ మోజులో పడి నిరంతరం చుదువు పేరుతో తనని పట్టించుకోవడం లేదని, కనీసం తన బంధువులు ఎవరో కూడ తన భర్తకు తెలియదని , ఓ భార్య ఆరోపణ చేసింది... యూపిఎస్సీ పరీక్షల్లో విజయం సాధించేందుకు, పుస్తకాలే సర్వస్వంగా భావించే భర్తతో తాను సంసారం చేయలేనని భార్య కోర్టు మెట్లెక్కింది.

న్యాయ వ్యవస్థలోకి పాకిన కులగజ్జి..! ఆవేదన వ్యక్తం చేస్తున్న పాట్నా న్యాయమూర్తి ..!!న్యాయ వ్యవస్థలోకి పాకిన కులగజ్జి..! ఆవేదన వ్యక్తం చేస్తున్న పాట్నా న్యాయమూర్తి ..!!

పెళ్లయితే చదువు బంద్..!

పెళ్లయితే చదువు బంద్..!

జీవితంలో పెళ్లి చేసుకున్నాక తనకు ఇష్టం వచ్చినట్టు వ్వవహరిస్తానంటే అటు భార్యతో పాటు ఇటు సమాజం కూడ అంగీకరించని పరిస్థితి. పెళ్లి అయిన అయిన తర్వాత యువకులు అటు భార్యకు ఇటు బయటి ప్రపంచానికి మధ్య బాలన్స్‌గా వ్యవహరించాల్సి అవసరం ఉంటుంది. పెళ్లి తర్వాత ఒంటరిగా తిరుగుతానంటే కుదరదు. అందుకే పెళ్లాయ్యాక జీవితంలో ఇక ఏది సాధించలేమని ముందే తెలుసుకున్న యువత ,జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లిలు చేసుకుంటున్నారు. ఒకవేళ జీవితంలో స్థిరపడక ముందే పెళ్లి చేసుకున్న యువకులు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. సంసారంతో పాటు భవిష్యత్తును కూడ వెతుక్కోవాల్సి ఉంటుంది. అన్ని కలిసి వస్తే.. ఉద్యోగం వస్తుంది. లేదంటే మాత్రం కుటుంభపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటీ పరిస్థితే ఓ బీహార్ యువకుడికి ఎదురయింది.

చదువుతూ భార్యను పట్టించుకోవడం లేదు..

చదువుతూ భార్యను పట్టించుకోవడం లేదు..

భోపాల్‌కు చెందిన ఓ యువకుని జీవితంలో ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా , చిన్నప్పటి నుండి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో కొనసాగాలనేది ఆయన పట్టుదల, అందుకే తనకు పుస్తకాలే సర్వస్వంగా భావించి యూపిఎస్సీ ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. అయితే ఇటివల ఆయువకుని పెళ్లి కూడ అయింది. అయినప్పటికి ఉద్యోగమే లక్ష్యంగా చదువును కొనసాగిస్తున్నాడు. అయితే చదువే యువకుడికి శాపం అయింది. కట్టుకున్న భార్య విడిచి వెళ్లిపోతానని చెబుతోంది. ఇందులో భాగంగానే పరీక్షల కోసం ఎప్పుడు పుస్తకాలతోనే కుస్తిపడుతూ, ఇంట్లో ఉన్న భార్యను పట్టించుకోవడం లేదని యువకుడి భార్య ఆవేదన వ్యక్తం చేసింది. చదువులో పడి బిజీగా మారాడని విడాకులకు అప్లై చేసింది.

భార్యభర్తలకు మరింత సమయం ఇచ్చిన కోర్టు

భార్యభర్తలకు మరింత సమయం ఇచ్చిన కోర్టు

దీంతో కౌన్సిలింగ్‌కు పిలిచిన న్యాయమూర్తులకు ఇదే అంశాన్ని యువతి వివరించింది. యూపిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న భర్త పట్టించుకోవడం లేదని తెలిపింది. తనకు సంబంధించిన బంధువులు ఎవరో కూడ ఆయన తెలియదని చెప్పింది. అందుకే విడాకులు కోరుకుంటున్నానని కోర్టుకు తెలిపింది. ఇక యువకున్ని కూడ కౌన్సిలింగ్ పిలవడంతో తనకు చిన్నప్పటి నుండి ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే లక్ష్యం ఉందని భర్త చెప్పాడు. ఈ విషయంలో భార్యను ఇబ్బందిపెట్టాలని భావించడం లేదని అన్నారు. ఈ సమస్యను ఇంకా పెద్దది చేయాలని తాను భావించడం లేదని తెలిపాడు.. దీంతో ఇద్దరి వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు ఇద్దరికి మరోసారి అవకాశం కల్పిస్తూ కొంత సమయాన్ని ఇచ్చింది.

English summary
a woman in Bhopal has moved the local family court seeking divorce on the grounds that her husband is preparing for UPSC examination and has no time for her. The woman has alleged that her husband spends his entire day preparing for the coveted exam and doesn't seem to care about her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X