• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇదెక్కడి చోద్యం: ఈ భర్త విడాకులు కోరాడు... కారణం చాలా సిల్లీగా ఉంది..!

|

ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు ఎక్కువగా చూస్తున్నాం. ఓ జంటకు పెళ్లి అయి ఆరునెలలు గడవకముందే పంచాయితీ కోర్టులకు చేరుతోంది. చిన్న చిన్న కారణాలతో పండంటి కాపురాన్ని మధ్యలోనే కూల్చేసుకుంటున్నారు. ఎవరో ఒకరు సర్దుకుపోతే సమిసిపోయే సమస్యను చాలా కాంప్లికేటెడ్‌గా తయారు చేసుకుంటున్నారు. మన దేశంలో వివాహ వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒకరు మరొకరిని దైవసాక్షిగా పెళ్లాడారంటే ఇక జీవితాంతం వారితోనే కలిసి ఉండేలా ప్రమాణం చేస్తారు. కానీ చిన్న చిన్న గొడవల కారణంగా భార్యా భర్తలు విడిపోతున్నారు. తాజాగా బీహార్‌లో కూడా ఓ భర్త తమకు విడాకులు మంజూరు చేయాలంటూ మహిళా కమిషన్‌ ముందు తెలిపాడు. ఇందుకు అతను చెప్పిన సిల్లీ కారణం ఏమిటో తెలిస్తే నవ్వాలో లేక ఏడవాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది.

భర్త ఇంట్లోనుంచి గెంటివేశాడని మహిళా కమిషన్‌లో భార్య ఫిర్యాదు

భర్త ఇంట్లోనుంచి గెంటివేశాడని మహిళా కమిషన్‌లో భార్య ఫిర్యాదు

బీహార్ రాజధాని పాట్నాలోని మహిళా కమిషన్ ఓ విచిత్రమైన కేసును ఎదుర్కొంది. ఇప్పటి వరకు ఎన్నో కేసులకు పరిష్కారం చూపిన మహిళా కమిషన్ ఈ కేసులో మాత్రం ఎలా రియాక్ట్ అవ్వాలో వారికే అర్థం కాని పరిస్థితి. ఇంతకీ విషయం ఏమిటంటే ఓ భార్య మహిళా కమిషన్‌ను సంప్రదించింది. తనను తన భర్త ఇంట్లోనుంచి గెంటివేశారని మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. అసలు గొడవ ఎక్కడ మొదలైంది.. భర్త ఎందుకు బయటకు పంపారు అనేదానిపై ఎంక్వైరీ చేసింది మహిళా కమిషన్. విచారణ సందర్భంగా అక్కడి సభ్యులకు భర్త చెప్పిన వివరణతో మైండ్ బ్లాక్ అయ్యింది.

భర్తకు నోటీసులు పంపిన మహిళా కమిషన్

భర్తకు నోటీసులు పంపిన మహిళా కమిషన్

ఒక ఏడాది క్రితం ఈ జంటకు వివాహమైంది. కాపురం బాగానే సాగుతోంది. సంతోషంగానే ఇద్దరూ ఉన్నారు. కానీ భర్త మాత్రం భార్యతో విసుగెత్తిపోయాడు. అంటే ఇక్కడ భార్య చేసిన తప్పు ఏమీ లేదు. అయినప్పటికీ భర్త ఆమెను ఇంట్లో నుంచి బయటకు గెంటివేశాడు. మహిళా కమిషన్‌ను న్యాయంచేయాల్సిందిగా ఆశ్రయించింది మహిళ. వెంటనే ఫిర్యాదు స్వీకరించిన కమిషన్ భర్త హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న భార్యను బయటకు ఎందుకు పంపించావని సభ్యులు ప్రశ్నించగా ఆయన ఏమీ మాట్లాడలేదు. వెంటనే మాకు విడాకులు మంజూరు అయ్యేలా చూడండి అంటూ కమిషన్‌ను వేడుకున్నాడు. ఇంతకీ తన భార్య నుంచి విడాకులు పొందేందుకు ఆ భర్త చెప్పిన కారణం ఏమిటో తెలుసా..?

నాభార్య స్నానం చేయదు..దుర్వాసన వస్తోంది

నాభార్య స్నానం చేయదు..దుర్వాసన వస్తోంది

"నా భార్య అసలు స్నానం చేయదు. ఆమె నుంచి దుర్వాసన వస్తోంది. ఆమెతో కాపురం చేయలేకపోతున్నాను. పడకపై పడుకుంటే ఆమె జుట్టునుంచి వచ్చే వాసన భరించలేకపోతున్నాను. తల స్నానం చేయాల్సిందిగా పలుమార్లు షాంపూ తీసుకొచ్చి వచ్చినప్పటికీ షాంపూతో పాత్రలు తోముతుంది తప్పితే తలస్నానం మాత్రం చేయడం లేదు. ఇక నన్నేమి చేయమంటారు. రోజూ ఇదే అంశంపై ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. ఆమెలో మార్పు తీసుకురావాలని పలుమార్లు ప్రయత్నించాను. సహనం కోల్పోయి ఆమెపై చేయి కూడా చేసుకున్నాను. అయినప్పటికీ మార్పు రాలేదు. ఇక విడాకలు తీసుకోవాలని డిసైడ్ అయ్యాను" అని భర్త సమాధానం చెప్పగానే ఒక్కసారి షాక్‌కు గురయ్యారు సభ్యులు.

ఇద్దరి వాదనలు విన్న సభ్యులు మహిళకు ఒక నెల సమయం ఇచ్చారు. నిర్ణయం మార్చుకుంటే తమకు తెలియజేయాలని చెప్పారు. ఎలాంటి మార్పు లేకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి పంపించేశారు. ఇప్పటి వరకు ఎన్నో సమస్యలను చూశాం కానీ ఇలా స్నానం చేయడం లేదని విడాకులు కోరే భర్తను ఇప్పుడే చూశామని వారు తెలిపారు.

English summary
“I want divorce from my wife because she never takes a bath” – a young man from Bihar has argued with such a strange reason to get divorce from his wife. As per reports, the couple was married a year ago. Post marriage the young man noticed that his wife never takes a bath and hence smells awfully. He tried his best to make the wife change her habit and maintain hygiene but in vain. Being irritated he started beating his wife at times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more