వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏడాదికి 2సార్లే స్నానం: భర్తపై పోలీసులకు ఫిర్యాదు!

|
Google Oneindia TeluguNews

లక్నో: తన భర్త స్నానం చేయడం లేదంటూ ఓ వివాహిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వింతగా అనిపించినప్పటికీ ఆ భర్త ఏడాదికి రెండుసార్లే స్నానం చేస్తాడట. ఇక ఆ భర్తను బరించలేక పోలీసులకు ఫిర్యాదు చేసిందా మహిళ.

ఒక్కరోజు స్నానం చేయకపోతేనే ఒళ్ళంతా చిరాగ్గా ఉంటుంది. చెమట కంపు కొడుతుంది. అలాంటిది తన భర్త మాత్రం సంవత్సరంలో కేవలం రెండు రోజులు మాత్రమే స్నానం చేస్తాడని పేర్కొంది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బాగ్‌పత్‌ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో దీపావళి, హోలీ పండగ రోజుల్లో మాత్రమే స్నానం చేస్తాడు. ఎంత చెప్పినా అతడీ అలవాటు మార్చుకోకపోవడంతో విసిగిపోయిన భార్య.. భర్తమీద, అతని కుటుంబసభ్యుల మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Husband showers only on Holi and Diwali; wife goes to police

అతని ఇంట్లో వారందరూ ఇలాగే ప్రవర్తిస్తుంటారని.. శుభ్రత అనేదే ఉండదని ఎంత చెప్పినా 'మాకు తెలుసు.. నీ పని నువ్వు చూసుకుంటే మంచిది' అంటూ తన నోరు మూయిస్తున్నారని మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసులు ఈ కేసును మహిళా పోలీస్‌స్టేషన్‌కి అప్పగించారు. కాగా, త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎస్పీ శంకర్ తెలిపారు.

English summary
A woman has filed a complaint with police against her husband on the grounds that he has not showered since months, according to reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X