వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దారుణం:వెంటాడి గొంతు కోసి, ఛాతీలో పొడిచి చంపాడు, మరికాసేపట్లో పుట్టింట్లోనే!

భార్య, భర్తల మధ్య ఏర్పడిన వివాదాలు ఓ నిండుప్రాణాన్ని బలిగొన్నాయి. పుట్టింటికి వెళ్తోన్న భార్యను వెంటాడి గొంతుకోసి చంపాడు ఓ కిరాతకుడు. అయితే తొలుత ఈ దాడి ఎవరు చేశారనే విషయాన్ని గుర్తించలేకపోయారు. అయితే

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:వైవాహిక జీవితంతో మనస్పర్థల కారణంగా ఓ వివాహితను భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఆటోలో పుట్టింటికి వెళ్తోన్న ఆమెను వెంటాడి హత్య చేశాడు. ఈ ఘటన ముంబాయిలో చోటుచేసుకొంది.

ముంబాయికి చెందిన ప్రసాద్ రావత్, గీతా దూబేలు భార్య, భర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు కూడ ఉన్నారు. ఇటీవల కాలంలో భార్య,భర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకొన్నాయి.

దీంతో ఏదో విషయమై ఇద్దరూ తరచూ గొడవ పడేవారు. భర్తతో వేగలేనని ఆమె తన పుట్టింటికి వెళ్ళాలని నిర్ణయించుకొంది. మలాడ్ లోని తన పుట్టింటికి ఆమె గీతా దూబే ఆటోలో సోమవారం రాత్రి బయలుదేరింది.

Husband Slit Woman's Throat As She Got Into Auto In Mumbai, Say Police

అయితే రాత్రిపూట 9.15 గంటల ప్రాంతంలో గోరెగావ్ లో టోమాటో లైన్ వద్దకు చేరుకుంటుండగనే అక్కడికి వచ్చిన ఆమె భర్త రావత్ ఆమెపై నేరుగా దాడికి దిగాడు.

తొలుత ఆమె గొంతు కోశాడు. అనంతరం ఆమె చాతిలో పొడిచాడు. వెంటనే పారిపోయాడు. అయితే ఆటోడ్రైవర్ ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించాడు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

అయితే దాడి చేసింది ఎవరనే విషయం తొలుత అర్థంకాలేదు. సిసి టీవి పుటేజ్ ఆదారంగా పోలీసులు బంధువులను విచారించారు.అయితే ఈ ఘటన జరిగిన నాటి నుండి భర్త ఆచూకీ కూడ లేకుండా పోయింది. సిసి టీవి దృశ్యాలు కూడ భర్త కన్పించారు.పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొన్నారు.

English summary
Geeta Dubey’s relatives at Siddharth Hospital. But Rawat had gone missing following the incident which took place at 9.15 pm at Tomato Lane near Goregaon station when Geeta had boarded an auto to reach her mother's residence in Malad West. Santosh Uphadhya
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X