హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

క్రిస్టియన్ పాట్రిక్, ముస్లీం ఖైరున్నీసా: బీబీసీలో హైదరాబాద్ విషాద ప్రేమకథ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదారాబాద్: నిర్భయ డాక్యుమెంటరీతో భారత్‌లో ఓ కుదుపు కుదిపిన బీబీసీ మరో డాక్యుమెంటరీకి ప్లాన్ చేస్తోంది. ఈసారి హైదరాబాదులోని ఓ ప్రేమకథను ఎంచుకుంది. సెప్టెంబర్ నెలలో ది వైట్ మొఘల్స్ పేరిట హైదరాబాద్ స్టేటి మొదటి బ్రిటిష్ రెసిడెంట్ క్రిక్ పాట్రిక్, హైదరాబాద్ నగరం రాజకుటుంబానికి చెందిన ఖైరున్నీసా బేగం ప్రేమకథను ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేసేందుకు డాక్యుమెంటరీ నిర్మాణం సాగుతోంది.

ప్రముఖ స్కాటిష్ రచయిత విలియం డాల్రింపుల్ రచన ది వైట్ మొఘల్స్ ఆధారంగా చిత్రీకరిస్తున్న ఈ డాక్యుమెంటరీ హైదరాబాద్ స్టేట్ రాజకీయాలకు అంతర్జాతీయంగా ప్రాధాన్యం తీసుకు రానుంది. వివిధ రాచరిక వ్యవస్థల పాలనలో ఉన్న హైదరాబాద్ స్టేట్ నిజాం పాలకుల కాలంలో బ్రిటీష్ సామ్రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది.

హైదరాబాద్ స్టేట్ వ్యవహారాలను పర్యవేక్షిస్తూ స్థానికంగా మిలటరీ వ్యూహాలను అమలు చేసేందుకు తొలి రెసిడెంట్‌గా జేమ్స్ ఆషిలెస్ క్రిక్ పాట్రిక్‌ను 1798లో నియమించారు. పాట్రిక్ ఫోర్ట్ సెయింట్ జార్జ్ చెన్నైలో పుట్టి పెరిగాడు. అక్కడి నుంచి హైదరాబాద్ బ్రిటీష్ రెసిడెంట్‌గా కొనసాగుతున్న కాలంలో ఆయన నగరంలో రెసిడెన్సీని (ప్రస్తుత కోఠీ ఉమెన్స్ కాలేజీ)ని నిర్మించాడు.

hyderabad love story in the bbc

నిజాం ప్రభుత్వం క్రిక్ పాట్రిక్‌కు విధేయంగా ఉండేది. ఆయనకు నిజాంతోనే కాకుండా నగరంలోని ప్రముఖ కుటుంబాలతో సాన్నిహిత్య సంబంధాలుండేవి. అప్పట్లో నిజాం ప్రభుత్వంలో ప్రధానమంత్రి అయిన నవాబ్ మహమూద్ అలీఖాన్ మనుమరాలిని క్రిక్ ప్రేమించాడు. ఆమె ప్రేమ కోసం ఆయన క్రైస్తవ మతాన్ని వీడి ఇస్లాం స్వీకరించి ఖైర్ ఉన్నిసాను వివాహం చేసుకున్నాడు.

అనంతరం తర్వాత క్రిక్ పాట్రిక్ వ్యవహార శైలిపై బ్రిటిష్ రాజులకు కోపం వచ్చింది. లార్డ్ వెల్లస్లీ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్రిక్‌పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆయనకు బ్రిటీషర్లు సమన్లు జారీ చేశారు. ఈ వివాదంతో క్రిక్ పాట్రిక్ జీవితాన్ని కష్టాలు చుట్టుముట్టాయి. క్రిక్‌కు సమన్లు వచ్చిన తర్వాత ఆయన కోల్‌కతా వెళ్లారు. అక్కడే 15 అక్టోబర్ 1805లో అనారోగ్యంతో చనిపోయాడు.

కొంతకాలం తర్వాత ఆయన భార్య కూడా చనిపోయింది. ఆ కాలానికి ఆమె వయసు 27 సంవత్సరాలు. పిల్లలు చాలా చిన్న వాళ్లు కావడంతో వాళ్లను బ్రిటీష్ అధికారులు తాత దగ్గరకు లండన్ పంపించారు. అనంతరం పిల్లలు ఇస్లాం మతం నుంచి క్రైస్తవ్యాన్ని స్వీకరించి పేర్లు కూడా ఆ మతానికి అనుగుణంగా మార్చుకున్నారు. ఇదీ శ్వేత జాతీయుడైన క్రిక్ పాట్రిక్, ఖైరున్సిసా ప్రేమగాథ.

English summary
hyderabad love story in the bbc
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X