హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్ దేశ రెండో రాజధాని కావొచ్చు: ఢిల్లీ కాలుష్యంపై సీహెచ్ విద్యాసాగర్ రావు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Hyderabad May Be The Second Capital Of India Says CH Vidyasagar Rao || Oneindia Telugu

హైదరాబాద్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అక్కడి ప్రజలు ఊపిరి తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు అవసరం ఉంటే తప్ప బయటకు రావొద్దని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. కాలుష్య తీవ్ర దృష్ట్యా పాఠశాలలకు కూడా సెలవు ప్రకటించింది ఢిల్లీ ప్రభుత్వం.

Delhi pollution:చావనివ్వండని వదిలేస్తారా?:ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, రాష్ట్రాలకు సమన్లుDelhi pollution:చావనివ్వండని వదిలేస్తారా?:ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, రాష్ట్రాలకు సమన్లు

ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్, సీనియర్ బీజేపీ నేత విద్యాసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నెలకొన్న కాలుష్యపరిస్థితులను చూస్తుంటే డా. బీఆర్ అంబేడ్కర్ కోరుకున్నట్లుగా హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందేమోనని వ్యాఖ్యానించారు.

Hyderabad may be soon second capital of india, says CH Vidyasagar Rao

తెలుగు వర్సిటీలో యువ కళావాహిని, సారిపల్లి కొండలరావు ఫౌండేషన్‌ల ఆధ్వర్యంలో డా. శ్రీధర్ రెడ్డి రచించిన 'శ్రీధర్ కవితా ప్రస్థానం' అనే కవితా సంపుటి ఆవిష్కరణ కార్యక్రమంలో విద్యాసాగర్ రావు ప్రసంగిస్తూ ఈ మేరకు స్పందించారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు.

మళ్లీ దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఘనంగా చాటుకోవడానికి ప్రయత్నం జరగాలని విద్యాసాగర్ రావు ఆకాంక్షించారు. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్, రచయిత్రి ముక్తేవి భారతి, ప్రజాకవి జయరాజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కాగా, ఢిల్లీ కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. మంగళవారం కాస్తా కాలుష్యం నుంచి దేశ రాజధాని తేరుకున్నట్లు కనిపించినప్పటికీ పూర్తి స్థాయిలో మాత్రం గాలి స్వచ్ఛతను అందుకోలేదు. మరోవైపు దేశ రాజధానిలో వాయు కాలుష్యం సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ రాజధాని ప్రాంతం పరిధిలో ఉన్న రాష్ట్రాలదే ఇక్కడి కాలుష్య బాధ్యత అని తేల్చి చెప్పింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఆ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు సమన్లు జారీ చేసింది.

ఢిల్లీ కాలుష్యానికి, పంట వ్యర్థాల దహనానికి ఎవరు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించింది. ప్రతి ఏటా వ్యర్థాల దహనం ఎందుకు జరుగుతోందని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను, అధికారులను నిలదీశారు. ఢిల్లీలో గాలి కాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. రైతులకు పంట వ్యర్థాలను కాల్చే హక్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంట వ్యర్థాల దహనానికి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పోలీస్ కమిషనర్లు బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు సప్ష్టం చేసింది.

ఢిల్లీలో ప్రజలు స్వచ్ఛమైన గాలి పీల్చే పరిస్థితి లేకుండా పోయిందని సుప్రీంకోర్టు మండిపడింది. జీవించే హక్కు చాలా ముఖ్యమైనదని, ఢిల్లీ నగరంలో ప్రతి గదిలోనూ గాలి నాణ్యత సూచీ(ఏక్యూఐ) 500 దాటడం బాధాకరమని వ్యాఖ్యానించింది. ఇందుకు ఢిల్లీకి పొరుగున ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని పేర్కొంది.

English summary
Hyderabad may be soon second capital of india, says Maharashtra former Governor CH Vidyasagar Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X