వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెంగళూర్ ఎయిర్‌పోర్టులో హైడ్రామా... ఎమ్మెల్యేలను వెళ్లకుండా అడ్డుకున్న కాంగ్రెస్...!

|
Google Oneindia TeluguNews

బెంగళూర్‌లోని హాల్ ఎయిర్‌పోర్టులో హైడ్రామా కొనసాగుతోంది. రాజీనామ చేసిన ఎమ్మెల్యేలు ఓక్కోక్కరుగా ముంబాయి వెళుతున్నారు. ఈ నేపథ్యంలోనే పదిమంది ఎమ్మెల్యేలు రాజీనామ చేసిన అనంతరం ఎవ్వరికి తెలియకుండా ముంబాయిలో మకాం వేసిన విషయం తెలిసిందే... ఇక మిగతా ఎమ్మేల్యేలు కూడ రాజీనామాలు చేసి ముంబాయి దారి పట్టారు.. ఈ నేపథ్యంలోనే బెంగళూర్‌లోని వీవీఐపీ ఎయిర్‌పోర్టు అయిన హాల్‌ నుండి ప్రత్యేక విమానాల ద్వార ఎమ్మెల్యేలు వెళుతున్నారు. దీంతో ఇది పసిగట్టిన కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యేలు ఎవరు బెంగళూర్ దాటి వేళ్లకుండా అడ్డుకుంటుంది.ఇందుకోసం తన కార్యకర్తలను హాల్ ఎయిర్ పోర్టులో కాపలా పెట్టింది.

తాజాగా సోమవారం ఉదయం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న ఇండిపెండెంట్ ఎమ్మెల్యే నగేష్ సైతం ముంబాయి బాట పట్టాడు. గవర్నర్‌కు ఉపసంహరణ లేఖ ఇచ్చిన అనంతరం బీజేపీ క్యాంప్‌కు వెళ్లేందుకు హాల్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు. దీంతో ఎమ్మెల్యేను ముంబాయి చేర్చేందుకు యడ్యూరప్ప పీఏ ఎమ్మెల్యే వెంట ఉండి ఏర్పాట్లు చేశాడు. ఇది గమనించిన డీప్యూటీ సీఎం పరమేశ్వర అనుచరులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేను ఎక్కడికి తీసుకువెళ్తుతున్నావంటూ ప్రశ్నించారు. ఈనేపథ్యంలోనే యడ్యూరప్ప పీఏతో వాగ్వావాదానికి దిగారు. దీంతో ఎయిర్‌పోర్టులో ఉద్రిక్త పరిస్థితులు నెలకోన్నాయి.

Hydrama continues at the Hal Airport in Bangalore

దీంతో ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అయితే ఎమ్మెల్యేను శిబిరానికి చేర్చేందుకు బీజేపీ కేంద్ర బలగాలను ఉపయోగించుకుంటడగా ,రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పోలీసులను ఉపయోగించుకుంటుంది. ఈనేపథ్యంలోనే ఎయిర్ పోర్టులో ఉద్రిక్త వాతవరణం నెలకోంది.

English summary
Hydrama continues at the Hal Airport in Bangalore. MLAs who resigned the party and moving to Mumbai hotel by HAL airport.the congress party acivist stop the mlas in airport.while bjp took the special arrangements for mla's
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X