వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమర్ సింగ్‌ను కుక్కతో పోలుస్తూ పోస్టర్లు

|
Google Oneindia TeluguNews

లక్నో: సమాజ్ వాది పార్టీ నేత అమర్ సింగ్‌కు వ్యతిరేకంగా ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో పోస్టర్లు వెలిశాయి. కుటుంబాలను కూల్చడంలో ఆయనను మించిన వారు లేరంటూ ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. ఆయనను కుక్కతో పోలుస్తూ కూడా పోస్టర్లు వెలిశాయి.

మరోవైపు సమాజ్‌వాది పార్టీకి, ములాయం సింగ్ యాదవ్ కుటుంబ కలహాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అమర్ సింగ్ స్పష్టం చేశారు. తమ నాయకుడు ములాయం సింగేనని చెప్పారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పైన మాట్లాడేందుకు నిరాకరించారు. తనను ఒంటరిగా వదిలేయాలన్నారు.

 Amar Singh

కాగా, రాజీనామాపై వస్తున్న ఊహాగానాలకు ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ తెరదించారు. ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ అయ్యారు. దీంతో అఖిలేశ్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరిగింది.

అయితే భేటీ అనంతరం అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తాను మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిశానని చెప్పారు. తేనీటి విందులో పాల్గొని, రాష్ట్రంలోని తాజా పరిస్థితులను గవర్నర్‌కు నివేదించినట్లు ఆయన వెల్లడించారు.

English summary
'I am Amar Singh, expert in breaking families'; posters hit Lucknow streets.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X