వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను అమాయకుడ్ని, వేటకే వెళ్లలేదు: కోర్టులో సల్మాన్ ఖాన్

కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ శుక్రవారం జోధ్‌పూర్‌ కోర్టుకు హాజరయ్యారు. 19ఏళ్ళ నాటి ఈ కేసులో సల్మాన్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

|
Google Oneindia TeluguNews

జోధ్‌పూర్‌: కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ శుక్రవారం జోధ్‌పూర్‌ కోర్టుకు హాజరయ్యారు. 19ఏళ్ళ నాటి ఈ కేసులో సల్మాన్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. తాను నిర్దోషినని, తనమీద తప్పుడు ఆరోపణలు చేశారని సల్మాన్‌ తెలిపారు.

తానసలు వేటకే వెళ్లలేదని, భద్రతా కారణాల వల్ల షూటింగ్‌ తర్వాత నేరుగా హోటల్‌కే వచ్చి గదిలో విశ్రాంతి తీసుకున్నానని కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా 25 మంది సాక్ష్యాల ఆధారంగా రూపొందించిన మొత్తం 65 ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.

 'I Am Innocent': Salman Khan Faced 65 Questions In Court On Blackbuck Case

అటవీ శాఖ అధికారులు కుమ్మక్కై పబ్లిసిటీ కోసం తనపై తప్పుడు ఆరోపణలు చేశారని సల్మాన్‌ పేర్కొన్నారు. సల్మాన్‌తో పాటు సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలిబింద్రే, టబులు కూడా ఈ కేసులో సహనిందితులుగా ఉన్నారు. ఈ కేసు విచారణ జనవరి 25నే జరగాల్సి ఉండగా గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భద్రత దృష్ట్యా కేసును శుక్రవారానికి వాయిదా వేశారు.

1998లో 'హమ్‌ సాథ్‌ సాథ్‌ హై' చిత్రం చిత్రీకరణ సమయంలో సల్మాన్‌ఖాన్‌ స్నేహితులతో కలిసి కృష్ణజింకలను వేటాడినట్లు కేసు నమోదైంది. ఇదే సందర్భంలో అక్రమ ఆయుధాలు కలిగిఉన్నారన్న మరో కేసు కూడా సల్మాన్‌పై నమోదవగా అందులో ఆయన నిర్దోషని గతవారం కోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.

English summary
Movie star Salman Khan, questioned in a Rajasthan court today on the alleged killing of blackbuck deer during a film shoot 19 years ago, declared, "I am innocent". The 51-year-old said he had been "falsely implicated", testifying in the presence of his co-stars Saif Ali Khan, Tabu, Sonali Bendre and Neelam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X